ఖైదీ జీవిత కథతో సినిమా | Prisoner's life story with Sanjay Dutt Movie | Sakshi
Sakshi News home page

ఖైదీ జీవిత కథతో సినిమా

Jan 31 2016 11:42 PM | Updated on Sep 3 2017 4:42 PM

ఖైదీ జీవిత కథతో సినిమా

ఖైదీ జీవిత కథతో సినిమా

జైలు జీవితం నటుడు సంజయ్ దత్‌కు ఓ కథ ఇచ్చిందని సమాచారం. ఆ కథతో సినిమా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట.

జైలు జీవితం నటుడు  సంజయ్ దత్‌కు ఓ కథ ఇచ్చిందని సమాచారం. ఆ కథతో సినిమా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అక్రమాయుధాల కేసులో జైల్లో ఉన్న సంజయ్ దత్  తన తోటి ఖైదీలతో చాలా స్నేహంగా ఉంటున్నారట. ఆ క్రమంలో ఓ ఖైదీ జీవితం సంజయ్‌ను ఆకర్షించిందని సమాచారం. కుటుంబ తగాదాల్లో శిక్ష అనుభవిస్తున్న ఆ ఖైదీ జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని ఆయన అనుకుంటున్నారట. ఈ నెల 25న జైలు నుంచి విడుదల కానున్నారు సంజయ్ దత్. బయటకు వచ్చీ రాగానే ఈ ప్రాజెక్ట్ గురించి కసరత్తులు మొదలు పెట్టాలనుకుంటున్నారట.

ఈ చిత్రంలో నటించాలనుకుంటున్నారా? లేక కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారా? అనే విషయం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే... సంజయ్ దత్  ఇప్పటికే కొన్ని చిత్రాలు అంగీకరించారు. వాటిపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement