వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గువ్వలదిన్నె ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి కండక్టర్ సహా ఇద్దరు మృతిచెందారు.
- 35 మందికి గాయాలు
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్ జిల్లా)
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని గువ్వలదిన్నె ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి కండక్టర్ సహా ఇద్దరు మృతిచెందారు. 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది.
బెంగుళూరు నుంచి కడపకు వస్తున్న కడప డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 0928 నంబరుగల ఆర్టీసీ బస్సు గువ్వలచెరువు ఘాట్ రోడ్డు నాల్గవ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో కండక్టర్, మరోవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి బస్సులో ఇరుక్కుపోయాడు. అతను బతికే ఉన్నాడు. అతనిని క్షేమంగా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 108లో క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.