సులభంగా డబ్బు సంపాదించాలని..

Nalgonda Couple Arrest in Robbery Case in Kurnool - Sakshi

 దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్న దంపతులు

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చోరీలు  

కర్నూలు, నాగార్జునసాగర్‌(తెలంగాణ) : పది రోజులుగా నల్లగొండ జిల్లాలోని బంగారం షాపులు, సెల్‌ఫోన్, వస్త్ర దుకాణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులు పోలీసులకు చిక్కారు. బుధవారం హాలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ధనుంజయగౌడ్‌ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుచానూరు పరిధిలోని శాంతినగర్‌కు చెందిన ఇరగంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్‌ శ్రీనివాస్, సౌజన్యారెడ్డి అలియాస్‌ సంజు  దంపతులు సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారన్నారు. వీరు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట, గూడూరు, బుచ్చిరెడ్డిపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధితోపాటు ఏపీలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. కర్నూలు జిల్లా బనగానపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ బంగారు దుకాణంలో దంపతులు నేరాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లారని, ఇటీవల జైలునుంచి విడుదలయ్యారన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో సులభంగా దొంగతనాలకు పాల్పడవచ్చని నల్లగొండ జిల్లాను ఎంచుకున్నారని చెప్పారు.

పట్టుబడింది ఇలా.. : జిల్లాలో ఇటీవల బంగారం షాపులు, సెల్‌షాపులు, వస్త్ర దుకాణంలో పలు చో ట్ల దొంగతనాలు జరగడంతో ఎస్పీ ఆదేశాల మేర కు మిర్యాలగూడ డీఎస్సీ, హాలియా సీఐ ధనుంజయగౌడ్‌ పోలీసుల బృందాలతో నిఘా ఉంచారు.  ఈనెల 22న నాగార్జునసాగర్‌ నుంచి పల్సర్‌ బైక్‌పై హాలియా వైపు వస్తున్న ఇరగంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సౌజన్యారెడ్డిలను సీసీ ఫుటేజుల ఆధారంగా గమ నించి సాయంత్రం 6గంటల సమయంలో సమ్మక్క సారక్క ఎక్స్‌రోడ్డు వద్ద పట్టుకున్నారు. వారిని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10,542 విలువైన దుస్తులు, ఒక నక్లెస్, 2 చెవి బుట్టాలు, ఒక చైన్, రెండు శ్యాంసంగ్‌ ఏ9 మొబైల్స్, ఒక బంగారం నక్లెస్, ఒక పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 5లక్షలు ఉంటుందన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top