Mental illness
-
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్‌తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్‌కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
సెల్‌ఫోన్ మింగి మహిళ మృతి
కాకినాడ క్రైం: సెల్‌ఫోన్ మింగిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చేరింది. అక్కడ తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈసోఫాగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బ తింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. రమ్య స్మృతిని శఽనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సెల్‌ఫోన్ తొలగింపు ప్రక్రియలో రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు చేసిన పొరపాటు వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి విలపించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడయ్యే వరకూ అక్కడే ఉంచాలని కోరినా రాజమహేంద్రవరం జీజీహెచ్ అధికారులు బలవంతంగా కాకినాడకు తరలించారని ఆరోపించాడు. అక్కడి నుంచి కాకినాడ చేరేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ వ్యవధిలో రమ్య ఆరోగ్య స్థితి మరింత క్షీణించి మరణానికి దారి తీసిందని వాపోయాడు.భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం! -
ఇంటి దీపాన్ని.. ఇల్లే ఆర్పుతోందా!
సాధారణంగా పేదరికం, నిరుద్యోగం, అప్పులు, అవమానాలు, కుంగుబాటు, వైవాహిక సమస్యలు.. వంటివి ఆత్మహత్యలకు పురిగొల్పుతాయి. అయితే వాటిలో గృహహింస కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య అనేది వ్యక్తిగత చర్య అయినప్పటికీ అది అనేక సామాజిక కారణాలతో ప్రభావితం అయ్యి ఉంటుంది. వ్యక్తిగత దుర్బలత్వం సామాజిక ఒత్తిళ్ల నుంచి వచ్చేదై ఉంటుంది. దీనిని మానసిక అనారోగ్యంగానూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుటుంబ కలహాలు, సామాజిక అస్థిరతలు సమాన పాత్ర పోషిస్తాయి.గృహహింసలో ప్రధానంగా...గృహహింస కారణంగా 64 శాతం మంది మహిళలు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నట్టు ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం విడాకులు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, వివాహం రద్దు లేదా వివాహం చేసుకోలేకపోవడం (భారతదేశంలో వివాహ విధానాల ప్రకారం), అవాంఛిత గర్భం, వివాహేతర సంబంధాలు, ఈ సమస్యకు సంబంధించిన విభేదాలు.. ఇలాంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పరువు’ అనే కారణంతో కుటుంబ ఆత్మహత్య సంఘటనలు తరచు సంభవిస్తుంటాయి.మానసిక రుగ్మతలుఆత్మహత్య కారణంగా మరణించేవారిలో దాదాపు 90 శాతం మంది మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెన్నైలో చేసిన అధ్యయనంలో 80 శాతం, బెంగళూరులో 43 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడతున్నట్లు తెలిసింది. సమాజంలో/ కుటుంబంలో అణచివేతకు గురైనవారు డిప్రెషన్, ఇతర మానసిక వ్యాధి లక్షణాలను ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఎక్కువశాతం మంది డిప్రెషన్వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు.మద్యపానం వల్ల..ఆత్మహత్యలలో మద్యపానం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆత్మహత్య చేసుకునే సమయంలో 30–50 శాతం మంది పురుషులు మద్యం మత్తులో ఉండగా, స్త్రీలను వారి భర్తల మద్యపాన వ్యసనమే ఆత్మహత్యకు పురికొల్పుతున్నట్లు వెల్లడైంది. ఆత్మహత్య అనేది ఎన్నో అంశాలు కలిసిన అతి పెద్ద సమస్య. అందుకే నివారణ చర్యలు కూడా అన్ని వైపుల నుంచి జరగాలి. ఇక జాతీయ స్థాయిలో ఆత్మహత్య నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, సహకారం, సమన్వయం, నిబద్ధత అవసరం. మానసిక ఆరోగ్య రంగంలో సామాజిక, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులు ఆత్మహత్యల నివారణలో చురుకైన పాత్ర పోషించాలి.చేయూత అవసరం..→ గృహహింస బాధితులకు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కారణం అవుతుంటారు. భరించడం అనే స్థాయి నుంచి తమ బతుకు తాము బతకగల ధైర్యం, స్థైర్యం పెం΄÷ందించుకోవాలి. → టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నూతన జీవనం వైపుగా అడుగులు వేయాలి. ఇందుకు కుటుంబ సభ్యులు చేయూతను అందించాలి. → స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలలో అవగాహన తరగతులు నిర్వహించాలి. → ఉపాధ్యాయులు, పోలీసులు, నాయకులు, నమ్మకమిచ్చే అభ్యాసకులు... ఇలా అందరూ బాధ్యత గా వ్యవహరించాలి.→ ప్రాణాలతో బయటపడిన వారిని సంఘటితం చేసి, వారిని ఈ అవగాహన తరగతులలో పాలుపంచుకునేలా చేయాలి.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్గమనిక:ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్‌కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్‌గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్‌ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్‌గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్‌కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్‌కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్‌గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్‌గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్‌లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
ఒంటరితనం వేధిస్తుందా? మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) జోడెద్దులా పల్లెల్లో సవారీ చేస్తుండగా.. ఇప్పుడు మానసిక రుగ్మతలూ వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ తాజాగా గ్రామీణ ప్రాంతాలకూ తాకడం ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మానసిక ఇబ్బందులతో వస్తున్న వారు ఎక్కువయ్యారని వైద్యులు తెలియజేస్తున్నారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారు వేలాదిమంది ఉన్నట్టు బయటపడింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్టు వెల్లడైంది. స్కిజోఫ్రీనియా..యాంగ్జైటీలే ఎక్కువగా.. స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ మందిలో ఉన్నాయి. ప్రతి దానికీ డీలా పడిపోవడం, ఏమవుతుందోనని భయం, ఆందోళన వంటి జబ్బులతో సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటంతో వృత్తిపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మనదేశంలో సుమారు 3 మిలియన్ల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ మానిసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలు ► ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నకుటుంబాలు రావడంతో వేధిస్తున్న ఒంటరితనం. ► ఆరు సంవత్సరాల వయసు నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటం. ► మద్యం, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో యువకుల్లో మానసిక రుగ్మతలు పెరగడం. ► ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో విపరీతమైన ఒత్తిడి. ► సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగడం. ► వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జీవనశైలి జబ్బులకు గురవడం. ► ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో చిన్నారుల్లో మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
మానసిక ఒత్తిడి, మందులు వాడినా తగ్గడం లేదా? ఇలా చేయండి
పెరుగుతున్న జనాభాతోపాటు అన్ని రకాల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఏ వ్యాధైనా తొలిదశలో గుర్తించి, సరైన చికిత్స చేయించుకుంటే తగ్గిపోతాయి. మానసిక వ్యాధులు సైతం ఇలాగే తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ.. మానసిక వ్యాధిగ్రస్తులు అందరిలో ఒకరిలా ఉండలేకపోతున్నారు. ఏ విషయమైనా ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు. చిరునవ్వును ఆస్వాదించలేకపోతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురికావడం వల్లే మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని.. దీన్ని అధిగమించడానికి జీవితంలో పాజిటివ్ దృక్పథం పెంచుకుంటూ ఒత్తిడిని జయించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు. మహానుభావుల జీవితమే స్ఫూర్తి.. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు నెట్టేశారు. ఆ స్థానంలో సాధారణ వ్యక్తులుంటే అవమానం తట్టుకోలేకపోయేవారు. కానీ.. గాంధీ వారినే భారతదేశం నుంచి నెట్టేసే వరకు విశ్రమించలేదు. అవమానాన్ని పట్టుదలగా మార్చుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చే వరకు వెనుకడుగు వేయలేదు. అలాగే.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 91 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లు సినిమానే జీవితంగా గడిపారు. సుమారు 40 ఏళ్ల క్రితమే అనారోగ్యానికి గురయ్యారు. తనకు కేన్సర్ ఉందని తెలిసినా.. దానిని జయిస్తానని ధైర్యంగా గడిపారు. నైతిక విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ.. నిత్యం నకడ, మితాహారం, సమయానుకూలంగా నిద్ర, అందరితో స్నేహంగా, సంతోషంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. తాను సంతోషంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలిగితే అంతకు మించింది మరేదీ లేదు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మానసిక వ్యాధులు.. లక్షణాలు మనిషి శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్లకు సంబంధించిన మార్పుల వల్ల మానసిక వ్యాధులు పుట్టుకొస్తాయి. సెరటోనిన్ అనే రసాయన పదార్థం మెదడులోని నాడీ కణాల్లో తగ్గినప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఈ వ్యాధితో బాధ పడేవారు ఎప్పుడూ నిషాతో ఉండటం.. ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డోపమెన్ అనే రసాయన పదార్థం మెదడులోని కొన్ని భాగాల్లో ఎక్కువగా పెరగడంతో స్కిజోఫ్రినియా అనే వ్యాధి వస్తుంది. విచిత్రమైన అనుమానాలు, భయభ్రాంతులు, వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడులో సెరటోనిన్, అడ్రనలిన్ అనే రసాయన పదార్థాల హెచ్చుతగ్గులతో ఆనక్సిటీ వ్యాధి వస్తుంది. ఎసిట్రైల్ కోలిన్ అనే రసాయన పదార్థం తగ్గినప్పుడు మతిమరుపు వస్తుంది. బైపోలార్ డిజార్డన్ అనే వ్యాధికూడా రసాయనాల హెచ్చుతగ్గుల వల్ల వస్తుంటుంది. మంత్రాలు, తాయత్తులతో తగ్గదు మానసిక వ్యాధి వస్తే మంత్రాలు, తాయత్తులు కట్టించుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ విశ్వాసాలు ఎక్కువ. పట్టణాల్లోనూ కొన్నిచోట్ల ఈ సంస్కృతి కనిపిస్తోంది. మానసిక జబ్బులకు శాసీ్త్రయ వైద్యం ఒక్కటే పరిష్కార మార్గం. మందులు వాడినా తగ్గట్లేదు అనే ధోరణి ప్రజల్లో ఉంది. ఒక్కోసారి నెల పట్టొచ్చు. ఆరు నెలలైనా పట్టొచ్చు. కానీ మానసిక ఆరోగ్యానికి ఇదే మంచి మార్గం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్!
మానసికంగా బాగుంటేనే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. మెంటల్‌గా బాగుంటేనే మన రోజూవారీ లైఫ్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి మనసే స్ట్రగులైతే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నిలువునా పతనం దిశగా తీసుకువెళ్లి మట్టుబెట్టేంత వరకు వదలదు ఆ మానసిక వ్యాధి. దీన్ని జోక్‌గా తీసుకోవద్దు. ప్రతిమనిషి మానసికంగా బలంగా ఉంటే దేన్నేనా అవలీలగా జయించగలడు అన్నది సత్యం. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక అనారోగ్యం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? తదితరాల గురించే ఈ కథనం.! మానసిక అనారోగ్యామే అని కొట్టి పారేయొద్దు. అది ఓ భయానకమైన వ్యాధి మనిషిని నిలువునా కుంగదీసి చనిపోయేలా ప్రేరేపిస్తుంది. ముందుగానే మేల్కొని బయటపడేందుకు ప్రయత్నించకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మానసికంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకి అనూహ్యంగా పెరుగుతుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా మనిషి అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తోంది. అయినా మానసిక రుగ్మత బారిన పడి మనిషి ఎందుకు విలవిల్లాడుతున్నాడు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఏం చేయలేను అనేంత స్థాయికి దిగజారి నిరాశ నిస్ప్రుహలోకి వెళ్లిపోతున్నాడు. ఎక్కడ ఉంది ఈ లోపం. వ్యవస్థలోనా? మనిషిలోనా ?అంటే.. మనిషి టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో పెడుతున్న పరుగులు తనకు తెలియకుండానే మనసుపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఎదుటి వాడు తనకన్న బెటర్‌గా ఉన్నాడనే అక్కసు, తాను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అన్న నిరాశ, తాను అనుకున్నవి సాధించలేకపోయాను అన్న నిట్టూర్పుతో.. ఢీలా పడి ఈ మానసిక రుగ్మత బారిన ఈజీగా పడి పోతున్నాడు. ఆ తర్వాత దీన్నుంచి బయటపడలేక గుంజుకుపోతున్నాడు. చివరికి తనను తాను అంతం చేసుకునేంత స్థితికి దిగజారిపోతున్నాడు. ఎలా బయటపడాలి..? ముందుకు కెరీర్ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే..దాన్ని వెంటనే మనసులోంచి తీసేయండి. అందరూ అన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించుకోండి. మొక్కలన్నింటి పువ్వులు ఉండవు. పుష్పించిన పూలన్నీ సుగంధాలు వెదజల్లవు. కానీ వాటికి ఉండే ప్రత్యేకత విభిన్నం, పోల్చదగినది కాదు. ఔనా!. సుగంధ భరితం కానీ పువ్వు ఔషధం అవుతుంది. సుగంధం వెద్దజల్లే పువ్వు అత్తరుగా మారతుంది. అలాగే మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనం కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయండి. మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోండి. రికార్డు స్థాయి విజయాలు కాకపోయినా పర్వాలేదు. మీదైనా చిన్ని ప్రపంచంలో మీరు సాధించింది ఎంత చిన్నవైనా అవి గొప్పవే. మీలా మీ స్థాయిలో ఉన్నవాళ్లు ఎవ్వరూ సాధించలేకపోయారు లేదా చేరుకోలేకపోయారు. కనీసం మీరు ప్రయత్నించారు, కొంత అయినా సాధించారు అని మనస్సు పూర్తిగా ఫీలవ్వండి, సంతోషపడండి. పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్ అనే పదం స్మరించండి. అది అన్నింటికీ అసలైన మందు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుంది. మీరు సాధించగలుగుతారు అనేది సత్యం అని చాలా బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పరారే. వియోగం వల్ల వచ్చే మానసిక బాధ.. మనకు నచ్చిన వ్యక్తి లేదా ఆత్మీయుడు మన సొంతం అనే వ్యక్తి కాలవశాత్తు లేదా ప్రమాదవశాత్తు దూరం అయినా మానసికంగ కుంగిపోవద్దు. ఇది సర్వసాధారణం. అందరి జీవితాల్లో జరిగేదే. కొందరికి చిన్నతనంలోనే నా అనేవాళ్లు దూరం అయితే మరికొందరికీ ఓ స్టేజ్‌లో దూరం అవ్వచ్చు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ముందుకు సాగిపోండి. అదే ప్రేమికులు/భార్యభర్తలు విడిపోయినా లేదా చనిపోయినా మీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ తీర్చలేనిది తట్టుకోలేనిది ఒప్పుకుంటాం. కొందరూ మన జీవిత ప్రయాణంలో కొంత వరకే. వారి జ్ఞాపకాలు మన వెంట పదిలంగా ఉంటాయి. గుండె నిండా శ్వాస పీల్చుకుని వారిని గుర్తు చేసుకోండి అలానే ఎందుకు దూరం అయ్యారని బాధపడొద్దు. మీకు తీరని ద్రోహం చేసి నిలువునా మోసం చేసి వెళ్లిపోయారని అస్సలు చింతించొద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇదొక గుణపాఠంగా తీసుకో. నీ స్థాయికి సరిపోని వాడు అని గడ్డిపరకను తీసిపడేసినట్టు పడేయి. నీ మనసు పట్టి పీడుస్తున్న వేదన దూదిపింజలా తేలిక అయిపోతుంది. మనిషి ఎంతో తెలివైన వాడు. అసాధ్యలన్నింటిని సాధించగలుగుతాడు. తనలాంటి సాటి మనుషుల చేతిలో మోసపోయిన, ధగ పడితే మాత్రం తిరిగి లేచి నిలబడలేక విలవిలలాడతాడు. ఎందుకిలా? 'ఓ మనిషి' నీకు మహాశక్తి ఉంది. మెలి పెడుతున్న మనుసును మధించి సరైన మార్గంలో పెట్టి దూసుకుపోవాలి. గమ్మతైన మనసు కథ.. మనల్ని ఎంతో ప్రేమించి మనమే సర్వస్వం అనుకునే వాళ్లని ప్రతి క్షణం స్మరించం. కానీ మనల్ని బాధపెట్టిన వాడిన మన మనసు పదే పదే గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. నీలో నీవే తిట్టుకుంటూ, భోంచేసినా, కూర్చొన్నా, అతడినే గుర్తు తెచ్చుకుంటావు. మనకు ఇష్టం లేకపోతే మనకు నచ్చిన స్వీట్ అయినా పక్కన పెడతాం. అలాంటిది మనకు నచ్చని వ్యక్తి, వేదన పాలు చేసిన వాళ్లను, వాళ్ల తాలుకా గాయాలను ఎందుకు తలుచుకుంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా?. కనీసం ఛీ! వీడు నన్ను ఇంతలా బాధపెట్టాడు గుర్తు తెచ్చుకోవడమే పాపం అని గట్టిగా మీరు అనుకున్నట్లయితే. ఏ మానసిక సమస్య మీ దరిదాపుల్లోకి రాగలదు. జీవితం సాఫీగా సాగితే నీ గొప్పదనం ఉండదు. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుంది. అదే నీ గొప్పతనన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశం. దురదృష్టవంతుడివి కాబట్టి కష్టాలు రాలేదు. నువ్వు తట్టుకోగల సమర్థుడువి కాబట్టే నీకు వచ్చాయి. అవే రాకపోతే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. పైగా నువ్వు గొప్పోడివి అని చూపించుకునే అవకాశం ఉండదు. మిత్రమా! సాధించలేకపోవడంలోనే సాధన ఉంది. కోల్పోవడంలోనే పొందడం ఉంది. ఇదే నిజం! కూల్‌గా ఆలోచించి.. మనో చిత్తాన్ని పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృఢం ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వండి. సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
మానసిక సమస్య ఉందని గుర్తించడమెలా?
‘గుడ్ మార్నింగ్ సర్. నా పేరు సురేష్. సాక్షి ఫన్ డే లో వస్తున్న ‘సై కాలం’ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా. రకరకాల మానసిక సమస్యలు, వాటి లక్షణాలు, వాటినెలా పరిష్కరించుకోవాలి అనే విషయాల మీద చాలా బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అసలు ఒక మనిషికి మానసిక సమస్య ఉందో లేదో గుర్తించడం ఎలా? అనే టాపిక్ కూడా రాస్తే బాగుంటుంది సర్’ అంటూ మొన్నా మధ్య ఒక కాల్ వచ్చింది. ఆ సూచన విలువైందిగా తోచింది. అందుకే ఈ వారం ఆ అంశం గురించే తెలుసుకుందాం! సమస్య, రుగ్మత వేర్వేరు సురేష్లానే చాలామందికి మానసిక సమస్యల గురించి ప్రాథమిక అవగాహన కూడా ఉండదు. ఎవరి ప్రవర్తనైనా కొంచెం తేడాగా కనిపించగానే గుళ్లూ, గోపురాలకు తిప్పేస్తారు. యజ్ఞాలూ,యాగాలూ, శాంతి పూజలూ చేయిస్తారు. లేదా మంత్రగాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే మానసిక సమస్యలు, రుగ్మతల మధ్య తేడా అర్థం చేసుకోవాలి. రోజువారీ ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, సర్దుబాటులో సమస్యలు, కోపం, విచారం, చదువులో, ఉద్యోగంలో ఇబ్బందులు లాంటివి మానసిక సమస్యలు. ఇవి తాత్కాలికం. యాంగ్జయిటీ, డిప్రెషన్, బైపోలార్, ఫోబియా, స్కిజోఫ్రీనియా లాంటివి మానసిక రుగ్మతలు. ఇవి దీర్ఘకాలం ఉంటాయి. సహానుభూతి ఉంటే చాలు.. మానసిక వ్యాధి ఉందా లేదా అని అంచనా వెయ్యడానికి సరిపడా మానసిక నిపుణులు మన దేశంలో అందుబాటులో లేరు. అందువల్ల సహానుభూతి, మంచిగా వినే నైపుణ్యం ఉన్నవారెవరైనా ప్రాథమిక అంచనా వేయవచ్చు. అయితే మానసిక వ్యాధి ఉన్నవారితో మాట్లాడాలంటే చాలామంది జంకుతారు. కారణం.. మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి అనగానే చాలామందికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడే, శుభ్రత లేని వ్యక్తి గుర్తొస్తాడు. అతనితో మాట్లాడితే తిడతాడేమో, కొడతాడేమో అని భయపడతారు. కానీ మానసిక అనారోగ్యం ఉన్నవారు కూడా మామూలు వ్యక్తులే. వారితో మాట్లాడినందువల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదని గుర్తించండి. ఎలా మాట్లాడాలి? ‘మీకేదో మానసిక సమస్య ఉన్నట్లుంది’ అని మొదలుపెడితే ఎవరైనా నొచ్చుకుంటారు. కాబట్టి వారితో మాట కలిపేందుకు.. ఈ మధ్య పత్రికల్లో వచ్చిన వార్త లాంటి మామూలు విషయంతో మొదలు పెట్టండి. ఆ తర్వాత అతని స్థానంలో మిమ్మల్ని ఊహించుకుని, అతని బాధను, సామాజిక, కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోండి. దీన్నే సహానుభూతి అంటారు. వీలైనంత వరకు ఆ వ్యక్తి బంధువులెవరూ అక్కడ లేకుండా చూసుకోండి. కొంతమంది తమకు మానసిక సమస్య ఉందని ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడి సమాచారం సేకరించండి. శారీరక జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎంత సహానుభూతితో మాట్లాడతామో, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తితో కూడా అంతే సహానుభూతితో వ్యవహరించాలి. ఏం చెయ్యాలి? మానసిక సమస్య లక్షణాలు కనిపించగానే మానసిక వ్యాధి ఉందని నిర్ధారణకు రాకూడదు. ఆ వ్యక్తితో మాట్లాడి లక్షణాలు ఎన్నాళ్ల నుంచి ఉన్నాయి, జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలి. అతని సామాజిక, ఆర్థిక, సంబంధ బాంధవ్యాల వివరాలు, సమస్యల గురించి ఆరా తీయాలి. వీటి ద్వారా ఆ వ్యక్తి ఎందుకు మానసిక సమస్యతో బాధపడుతున్నాడో అర్థం చేసుకోగలుగుతారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీకు అనిపిస్తే వెంటనే దగ్గర్లోని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. వారు అతనితో మరింత లోతుగా మాట్లాడి, సైకో డయాగ్నసిస్ ద్వారా రుగ్మతను నిర్ధారిస్తారు. అవసరమైన సహాయం అందిస్తారు. అడగాల్సిన ప్రశ్నలు.. రాత్రిపూట నిద్ర పట్టడంలో ఏదైనా సమస్య ఉందా? · రోజువారీ పనులు చేయడంలో ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోందా? కొద్దికాలంగా విచారంగా, జీవితంలో సంతోషమే లేనట్లుగా అనిపిస్తోందా? · దేని గురించైనా భయభ్రాంతులకు లోనవుతున్నారా? మరీ ఎక్కువగా మద్యం తాగుతున్నారని బాధపడుతున్నారా? · మద్యం లేదా మాదక ద్రవ్యాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? వీటిలో ఏ ప్రశ్నకైనా ‘అవును’ అని సమాధానం చెప్తే, మరింత సమయం వెచ్చించి మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రుగ్మతను గుర్తించే లక్షణాలు.. ఏ శారీరక వ్యాధికీ సంబంధంలేని బాధల్ని చెప్పడం · మానసిక వ్యాధికి సంబంధించిన వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్ర ఉండటం డిప్రెషన్ లేదా మద్యపాన సంబంధమైన మానసిక సమస్య ఉందని నేరుగా చెప్పడం మద్యపాన వ్యసనం లేదా గృహహింస లాంటి ప్రత్యేక కారణాలు వైవాహిక, లైంగిక సమస్యలు · దీర్ఘకాల నిరుద్యోగం, సన్నిహిత వ్యక్తి మరణం, జీవితం సమస్యలమయం కావడం అతీంద్రీయ శక్తులు ఉన్నాయని అనుమానించడం. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్‌కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘనటతో హనీమూన్ క్యాన్సిల్
చాలామంది నిద్రలో గట్టిగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఏదో కలలో అలా చేసి ఉండొచ్చు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదంత చిన్న విషయమేమీ కాదు. నిద్రల్లో లేచి బిగ్గరగా ఏడవడం, భయంతో వణికిపోవడం వంటివి తరచూ చేస్తూ అది నిజంగా జబ్బే. ఈ పరిస్థితిని నైట్ టెర్రర్ లేదా స్లీప్ టెర్రర్ అని అంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుందా? అన్నది ఇప్పుడు చూద్దాం. మాధురి, మాధవ్ అందమైన జంట. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కోసం కేరళ వెళ్లినప్పుడు నిద్రలో మాధురి గట్టిగా అరుస్తోంది. మాధవ్ లేచి చూసేసరికి భయపడి వణికిపోతోంది. ఆమెను పట్టుకుని కుదిపాడు. అయినా మాధురి నార్మల్ స్టేజ్‌కు రాలేదు. ఆమె అరుపులకు హోటల్ స్టాఫ్ కూడా వచ్చారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. హనీమూన్ కేన్సిల్ చేసుకుని వచ్చేశారు. ఆ రాత్రి ఎందుకలా అరిచావని మాధురిని అడిగితే... ఏదో పీడకల వచ్చిందని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ అలాగే జరుగుతోంది. కారణమేంటని అడిగితే, చిన్నప్పటినుంచి తాను అప్పుడప్పుడూ అలా అరుస్తానని, కారణం తనకూ తెలియదని చెప్పింది. జీవితాంతం దీన్ని భరించాల్సిందేనా అని ఆందోళన చెందాడు. గూగుల్ చేసి అదో స్లీప్ డిజార్డర్ అని అర్థం చేసుకుని కౌన్సెలింగ్ కు తీసుకువచ్చాడు. స్లీప్ టెర్రర్స్... మాధురి సమస్యను స్లీప్ టెర్రర్స్ లేదా నైట్ టెర్రర్స్ అంటారు. నిద్రలో జరిగే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను పారాసోమ్నియాగా పరిగణిస్తారు. నిద్రలో ఉన్నప్పుడు అరుపులు, తీవ్రమైన భయం దీని ప్రాథమిక లక్షణాలు. ఇది సాధారణంగా సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువసేపు ఉండవచ్చు. ఇది 40 శాతం మంది పిల్లల్లో కనిపిస్తుంది, సాధారణంగా యుక్తవయసులో దాన్ని అధిగమిస్తారు. కానీ తక్కువశాతం పెద్దల్లో కూడా స్లీప్ టెర్రర్స్ కనిపిస్తుంటాయి. అందులో మాధురి కూడా ఒకరు. స్లీప్ టెర్రర్స్, పీడకలలు ఒకటి కాదు. స్లీప్ టెర్రర్ లక్షణాలు యుక్త వయసు తర్వాత కూడా స్లీప్ టెర్రర్స్ వస్తున్నా, దీనివల్ల పగలు అధికంగా నిద్ర వచ్చి వర్క్ ప్లేస్‌లో సమస్యలు ఎదురవుతున్నా వెంటనే సైకాలజిస్ట్‌ను కలవాల్సిన అవసరం ఉంది. శారీరక, మానసిక పరీక్షల అనంతరం మీ సమస్యను నిర్ధారిస్తారు. అవసరమైతే పాలిసోమ్నోగ్రఫీకి (నిద్ర అధ్యయనం) సిఫారసు చేస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి ... · నిద్రలో భయపెట్టే అరుపులు · కళ్లు పెద్దవి చేసి చూడటం · మంచం మీద కూర్చొని భయంగా కనిపించడం · గట్టిగా ఊపిరి పీల్చుకోవడం, మొహం ఎర్రగా మారడం · మేల్కొలపడానికి ప్రయత్నిస్తే తన్నడం, కొట్టడం · మర్నాడు ఉదయం దాని గురించి జ్ఞాపకం లేకపోవడం పిల్లల్లో, మహిళల్లో ఎక్కువ... స్లీప్ టెర్రర్స్ అనేవి నిద్రలో సంభవిస్తాయి. కుటుంబ సభ్యులకు స్లీప్ టెర్రర్స్ లేదా స్లీప్ వాకింగ్ చరిత్ర ఉంటే స్లీప్ టెర్రర్స్ సర్వసాధారణం. పిల్లల్లో, ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. · నిద్ర లేమి, విపరీతమైన అలసట · మానసిక ఒత్తిడి · నిద్ర షెడ్యూల్‌కు అంతరాయాలు లేదా నిద్రలో అంతరాయాలు · తరచూ ప్రయాణాలు · జ్వరం · నిద్రలో ఉన్నప్పుడు శ్వాస సంబంధమైన సమస్యలు · రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు, · మద్యం వినియోగం ప్రశాంతత ముఖ్యం... మీకు లేదా మీ పిల్లలకు స్లీప్ టెర్రర్స్ ఉంటే దాన్నుంచి తప్పించుకోవడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. · మీకు నిద్ర లేమి ఉంటే, ముందుగా నిద్రపోయే సమయాన్ని షెడ్యూల్ చేసుకోండి. నిద్రకు ఆటంకం కలిగించే మొబైల్ ఫోన్, అలారం లాంటి వాటిని దూరంగా పెట్టండి. · అలసట, ఆందోళన స్లీప్ టెర్రర్స్కు దోహదం చేస్తాయి. అందువల్ల నిద్రవేళకు ముందు ప్రశాతంగా ఉండేలా చూసుకోండి. · స్లీప్ టెర్రర్స్ వల్ల గాయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బెడ్ రూమ్‌ను సురక్షితంగా మార్చండి. తలుపులు మూసివేయండి. పదునుగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచుకోవద్దు. · నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం లేదా వెచ్చని నీళ్లతో స్నానం చేయడం లాంటివి మంచి నిద్రకు సహాయపడతాయి. ధ్యానం లేదా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా సహాయపడవచ్చు. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఉంటే, వాళ్లు నిద్రపోయాక ఎంత సమయానికి ఆ ఎపిసోడ్ వస్తుందో గమనించండి. దానికి పది నిమిషాల ముందు నిద్రలేపితే సరి. · మీ పిల్లలకు స్లీప్ టెర్రర్ ఎపిసోడ్ వస్తే, కదిలించడం లేదా అరవడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. అందుకే బిడ్డను కౌగిలించుకుని శాంతింపచేయండి. ప్రశాతంగా మాట్లాడండి. దానంతట అందే ఆగిపోతుంది. · ఈ పనులన్నీ చేసినా ఫలితం లేకపోతే సైకాలజిస్ట్‌లను కలవడం తప్పనిసరి. భద్రతను ప్రోత్సహించడం, ట్రిగ్గర్లను తొలగించడంపై వారు దృష్టి పెడతారు. · కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, హిప్నాసిస్, బయోఫీడ్‌బ్యాక్ లేదా రిలాక్సేషన్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. -సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు
సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మానసిక రోగం. నిజమైన బయటకు చెప్పుకోలేం కానీ.. చుట్టున్న ప్రపంచంలో ఎంతో మంది మానసిక రోగులు... నాతో సహ. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సమస్య ఉంది. కొందరు నియంత్రించుకోవచ్చు. మరికొందరు సమస్యలో పీకల్లోతులో ఇరుక్కుపోవచ్చు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా బయటపడాలి? మన చుట్టున్న ప్రపంచంలో భౌతికంగా ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తారు. కొందరు ఎత్తుంటారు, మరికొందరు చిన్నగా ఉంటారు. కొందరు అందంగా కనిపిస్తారు. మరికొందరు అందంగా కనిపించేందుకు ఆరాటపడతారు. భౌతికంగానే కాదు, మానసికంగా కూడా చాలా తేడాలుంటాయి. భౌతికంగా గొప్పగా కనిపించడం వేరు, మానసికంగా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఉండడం వేరు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే ఎంతో శక్తి కావాలి. కానీ మన చుట్టున్న వారిలో కొందరు ఈ పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురయి మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అసలు సైకాలజికల్‌గా సమస్యలేంటాయి? ఎన్ని స్థాయిలు ఉన్నాయి? లెవల్ - 1 - (అయోమయం, గందరగోళం) మనం ఈ పోటీ ప్రపంచంలో గెలవాలన్న ఆరాటం ఈ పోటీలో ఏమవుతుందో అన్న భయం, ఆందోళన సరైన దారిలో గెలవలేం కాబట్టి ప్రత్యామ్నయాల కోసం వెతుకులాట పక్కదారులు పట్టే ఆలోచనలు, అదుపు తప్పే మనసు చెడు అలవాట్లకు బానిస (డ్రగ్స్, మద్యం, పోర్నో, మొబైల్ అడిక్షన్) ఇతరులను విమర్శించడం, నేనే కరెక్ట్ అనుకోవడం నచ్చజెప్పడానికి ఎవరు (అమ్మ, నాన్నతో సహా) ప్రయత్నించినా.. వారు చెప్పేదంతా తప్పు అనుకోవడం వాదించడం, గొడవ పడడం, వక్రమార్గంలోనైనా గెలవాలని తాపత్రయపడడం Reminder pic.twitter.com/YVVFXJS135— Wise Chimp (@wise_chimp) August 5, 2023 లెవల్ - 1(అయోమయం, గందరగోళం)లో పరిశీలనలు ఎలాంటి పాజిటివిటీ ఉండదు వీళ్లంతట వీళ్లే సమస్య నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు ఏదో ఒక ప్రయత్నం చేస్తే తప్ప మార్పు రాదు ఎవరో ఒకరు వీళ్లను బయటకు తీసుకురాగలిగితే తప్ప ఇలాంటి వాళ్లు సమస్య నుంచి బయటకు రాలేరు లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - లక్షణాలు ఏం నేర్చుకోవాలి? ఎలా సాధించాలి? ఎలాంటి కఠిన పరిస్థితులకయినా అలవాటు పడే, సర్దుకునే నైజం నేను గెలవాలి, నాకున్న నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? మరింత ముందుకు వెళ్లాలంటే ఏం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? చుట్టున్న సమాజాన్ని ఎలా మంచి కోసం వినియోగించుకోవాలి? అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లేలా నేనేం చేయాలి? నేను గెలుస్తాను సరే, మరికొంతమందికి ఎలా సాయ పడగలను? May you always fly high like your helicopter shots. Happy birthday, MS! pic.twitter.com/f9aqiY6HV0 — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2023 లెవల్ - 2 - కార్యసాధకులు, విజేతలు - పరిశీలనలు మన చుట్టున్న విజేతల్లో ఇదే మీరు చూస్తారు. మన మధ్యనే ఉంటారు, మనం ఊహించలేనంత ముందుకు వెళతారు. సమాజాన్ని ఔపాసన పట్టేస్తారు, మనకు కనిపించని అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఎంచుకున్న మార్గంలో అత్యున్నత దశకు చేరుకుంటారు నలుగురికి మేలు చేసే ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు సంపద సృష్టిస్తారు, తాము గెలిచి మరొకరికి మార్గదర్శకంగా మారతారు ఎంతో మంది సక్సెస్ ఫుల్ లీడర్లలో కనిపించే సీక్రెట్ ఇంతటితోనే ముగుస్తుందా? ఇంతకంటే అత్యున్నత దశ ఏమి లేదా? కచ్చితంగా ఉంది. సంపదతోనే అంతా ముగియదు. ఆ తర్వాత ఇంకేదైనా చేయాలని కలిగే అనుభూతే అత్యున్నత దశ. మూడో లెవల్ - మహాత్ములు - లక్షణాలు నేను ఏంటీ అన్నది పక్కనబెడతారు నా సమస్య అంటూ ఏదీ ఉండదు నేను ఈ సమాజానికి ఏం చేయగలను అన్నది మాత్రమే భావన ప్రతీ ఆలోచనలో తన నుంచి ఏదో ఒక సందేశం ఇతరులకు చేరాలన్న తాపత్రయం మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇదేమీ వైరాగ్యం కాదు, ఇదొక అద్భుతమైన స్థాయి. రమణ మహర్షినే చూడండి, ఆయనకు ఏ ఆస్తులు లేకపోవచ్చు, కానీ ప్రపంచమే ఆయనది. మనసును నియంత్రించుకోగల శక్తిని, ఆలోచనలను పెంచుకోగల యుక్తిని తెలుసుకున్నారు. Compassion is concern for others - sincere concern for others' well-being founded on awareness of our own experience. Since it makes us happy when others show us affection and offer us help, if we show others affection and readiness to help they too will feel joy. — Dalai Lama (@DalaiLama) August 4, 2023 మూడో లెవల్ - మహాత్ములు - పరిశీలనలు ఇలాంటి వారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గమనిస్తారు, చదువుతారు. ధ్యానం, వ్యాయామం, యోగ ముద్రతో మనస్సును శాంతంగా మరియు స్థిరంగా ఉంచుకుంటారు ప్రతి రోజు.. వర్తమానంలో జీవిస్తుంటారు నిజమైన ఆలోచనల మధ్య అన్ని భ్రమలను వీడి పూర్తి పాజిటివిటీతో జీవిస్తుంటారు ఎలాంటి ఆడంబరాలుండవు, ఏది ఎంత అవసరమో అంతే తీసుకుంటారు ఏం ఆశించకుండా ఇంకొకరికి సాయం చేస్తారు, అయితే ఇక్కడ సంపద అనేది మానసిక సాయం సలహాలు, మార్గనిర్దేశనం, పాజిటివిటీని పెంపొందించే మాటల రూపంలో ఉంటుంది. ఈ స్థాయిలోకి అందరూ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే ప్రతీ ఒక్కరు రెండో స్థాయిలోకి రావొచ్చు. మీరు మారండి. మారను అనుకోవడమే కష్టం. ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఎంత వరకు మారాలి? ఈ ప్రశ్నలన్నింటికీ మీలోనే సమాధానాలున్నాయి. మార్పు ఎలా ఉంటుందన్నది మీ ఇష్టం. (డాక్టర్ మృదుల, ప్రముఖ సైకాలజిస్టు, లైఫ్ కోచ్, సర్టిఫైడ్ కౌన్సిలర్ (నేషనల్ కెరియర్ సర్వీస్, కార్మిక ఉపాధి శాఖ), NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ లర్నింగ్ & డెవలప్మెంట్ మేనేజర్, సర్టిఫైడ్ ఇన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ఇన్ ఎమోషనల్ ఇంటలిజెన్స్, సైకాలజీలో పీహెచ్డీ చేశారు, ఈ రంగంలో 20 ఏళ్లుగా ఉన్నారు. మానసిక శాస్త్రంలో ఎంతో మంది ఆలోచనలను ప్రభావితం చేసిన వ్యక్తి) -
సరదా అనుకున్నాం కానీ, అదొక వ్యాధి అనుకోలేదు.. అసలు ఏంటిది?
గత కొన్ని రోజులుగా శ్రీనగర్ కాలనీ నివాసి లలిత (35) ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు రహస్యంగా దాస్తోంది. డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కుటుంబసభ్యులు ఎందుకయినా మంచిదని ఒకరోజున సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పరిశీలించిన వైద్యుడు ఆమె సీబీఎస్డీ అనే వ్యాధికి గురైందని నిర్ధారించారు. అదేమిటీ..తరచూ షాపింగ్ చేస్తుంటే సరదా అనుకున్నాం కానీ అదొక వ్యాధి అనుకోలేదే అని ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. నగరంలో విజృంభిస్తున్న సరికొత్త మానసిక వ్యాధికి లలిత ఓ ఉదాహరణ. సాక్షి, హైదరాబాద్: కంపల్సివ్ బయింగ్ బిహేవియర్ లేదా కంపల్సివ్ బైయింగ్, షాపింగ్ డిజార్డర్ (సీబీఎస్డీ/సీబీడీ)తో బాధపడు తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరినీ వేధిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సీబీఎస్డీ తీవ్రమైన ఒత్తిడితో ముడిపడిన మానసిక ఆరోగ్య పరిస్థితి అని, అనవసరమైన వాటిని కూడా కొనడాన్ని నియంత్రించుకోలేని సమస్య గా మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ (కొన్నిప్రత్యేక అలవాట్ల నియంత్రణ లోపాలు)లో ఒకటిగా దీనిని చేర్చింది. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా షాపింగ్ చేయాలనే కోరిక కలుగుతుంటుంది. అధిక వ్యయం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికసమస్యలు, అను బంధాల విచ్ఛిన్నం వంటి ప్రతికూల ఫలితాలున్నప్పటికీ పట్టించుకోకుండా అదేపనిలో నిమగ్నమైపోతారు. ఈ రుగ్మత ఉన్నవారు తమ బడ్జెట్‌పై స్పష్టమైన వైఖరి లేకుండా వారి సాధారణ కార్యకలాపాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ కొనడంలోనే నిమగ్నమవుతుంటారు. కరోనా సహా...కారణాలనేకం.. మానసిక, పర్యావరణ, జీవ సంబంధమైన కార ణాలుసహా అనేక అంశాలు కంపల్సివ్ షాపింగ్ ను ప్రేరేపిస్తున్నాయి. పెరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, ఆన్లైన్ షాపింగ్, ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సీబీఎస్డీకి దోహదపడుతున్నట్లు మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్థిక అవగాహన లోపించడం, రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతి చిన్న వస్తువును ఆన్లైన్ ద్వారా కొనడం అత్యధికశాతం మందిని ఈ వ్యాధికి చేరువ చేసిందంటున్నారు. కంపల్సివ్ షాపింగ్ కోసం చికిత్స కోరిన వ్యక్తుల్లో దాదాపు 34% మంది ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడినవారని జర్మనీలోని హన్నోవర్ మెడి కల్ స్కూల్ పరిశోధకులు తేల్చడం గమనార్హం. భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రం.. కంపల్సివ్ షాపింగ్ లింగ భేదాలకు అతీతంగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్త షాపింగ్ ప్రియత్వం ఎక్కువ. అందువల్ల మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం వంటి ప్రతికూల భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రతరం కావొచ్చు. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ (కొన్ని సమయాల్లో కుంగుబాటు, కొన్ని సమయాల్లో విపరీత ప్రవర్తన), అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (అతిగా ప్రవర్తించడం) (ఓసీడీ) తదితర ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులలో కంపల్సివ్ షాపింగ్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు. దీనికి మందులు, జీవనశైలి మార్పుల కలయికతో కూడిన సమగ్ర చికిత్స విధానం అవసరమని వైద్యులు అంటున్నారు. వ్యక్తులు ఖర్చు చేసే అలవాటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ఈ చికిత్స సహాయపడుతుందని చెబుతున్నారు. కంపల్సివ్ షాపింగ్‌తో పోరాడుతున్న వ్యక్తులు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ.. సమగ్ర మనోరోగ చికిత్స జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో 5% మంది పెద్దలను కూడా సీబీఎస్డీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదించింది. వీరిలో ప్రతిముగ్గురి లో ఒకరు ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధ పడుతున్నారు. ‘షాపింగ్‌పై కోరికతో వారు కొనుగోలు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు. మహిళలే కాదు..అందరిలోనూ కని్పస్తోంది గతంలో పార్కిన్సన్స్ లాంటి మెదడు మీద ప్రభావం చూపే వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ సీబీడీని గుర్తించేవాళ్లం. దీన్ని బైపోలార్ డిజార్డర్ అనేవాళ్లం. అయితే ఇటీవలి కాలంలో ఇతరత్రా వ్యాధులు లేకుండానే..సీబీడీకి గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అవసరానికో, ఆర్థికంగా బాగుండో కొనేవారిలా కాకుండా ఈ వ్యాధికి గురైన వారు కొన్నవాటితో సంతోషం కూడా పొందరు. కొన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారు. అవమానంగా ఫీలవుతారు. దాంతో మళ్లీ కొంటారు. అలా అలా.. మత్తు పదార్థాలకు అలవాటైన వారిలా.. కొంటున్న విషయాన్ని, కొన్న వస్తువుల్ని రహస్యంగా ఉంచుతారు. వీరికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్ తో పాటు మందులను కూడా వాడాల్సి ఉంటుంది. గతంలో మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. –డాక్టర్ చరణ్ తేజ, న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
మానసిక, శారీరక వైకల్యం ఉన్న వారికి బీమా
న్యూఢిల్లీ: సాధారణ, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు వైకల్యం ఉన్న వారు, హెచ్ఐవీ బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను తీసుకు రావాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. ఐఆర్డీఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలకు (2016) అనుగుణంగా ఈ ఉత్పత్తుల ప్రీమియం ధరలను నిర్ణయించాలని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా వ్యక్తులకు సంబంధించి పాలసీల క్లెయిమ్‌లు తిరస్కరించకుండా బోర్డు స్థాయిలో ఆమోదం పొందిన అండర్‌రైటింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆదేశించింది. ఏడాది కాల వ్యవధితో బీమా ఉత్పత్తి ఉండాలని, దాన్ని ఏటా పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని కోరింది. -
నెత్తుటి మరక.. అతనొక మానసిక రోగి
ఒడిషా చరిత్రలో నెత్తుటి మరక చోటు చేసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిశోర్ దాస్(61)పై తుపాకీ కాల్పులు జరిగాయి. దీంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిన ఆయనను.. ఝార్సుగుడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉన్నత చికిత్స కోసం హెలీకాఫ్టర్లో భువనేశ్వర్ తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మంత్రి మృతికి కారణమైన ఏఎస్ఐ గతంలో ఆయన వద్ద గన్‌మెన్‌గా పని చేసినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై రాష్ట్ర హోంశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. ఝార్సుగుడ: బ్రజ్‌రాజ్ నగర్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తుపాకీ కాల్పులకు గురికావడం కలకలం రేపింది. అభిమానులతో కలిసి ఊరేగింపునకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఆయనపై తుపాకీ తూటా పేలింది. బ్రజ్‌రాజ్ నగర్ గాంధీ చక్ ఔట్‌పోస్ట్ ఏఎస్ఐ గోపాల్‌దాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. మంత్రి ఛాతికి గురిపెట్టి, తుపాకీ పేల్చడంతో బుల్లెట్ శరీరంలో ఎడమవైపు దూసుకు పోయింది. బ్రజ్‌రాజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కొత్త కార్యాలయ భవనాలను ప్రారంభించేందుకు మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న హడావిడిలో గాంధీ ఛక్ సమీపంలో తుపాకీ పేలుడు సంభవించింది. గాంధీ చక్ ఔట్‌పోస్ట్ ఠాణా ఏఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో అతి సమీపం నుంచి మంత్రి ఛాతీకి గురిపెట్టి కాల్చడంతో మంత్రి అక్కడికక్కడే కుప్పకూలారు. పక్కనే స్థానిక ఐఐసీ ప్రద్యుమ్న స్వొయినిపై సైతం కాల్పులు జరపగా, ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం నవీన్ పట్నాయక్ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై క్రైంశాఖ దర్యాప్తుకు ఆదేశించారు. ఒడిషా ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్ మృతి కేసులో కీలక విషయం వెలుగు చూసింది. ఆయన్ని కాల్చి చంపిన ఏఎస్ఐ గోపాలకృష్ణ దాస్ మానసిక స్థితి సరిగ్గా లేదని తేలింది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న దాస్.. పదేళ్లుగా సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే.. అతనికి ఉన్న మానసిక వ్యాధిని పక్కనపెట్టి.. సర్వీస్ రివాల్వర్ జారీ చేయడంతో పాటు బ్రజరాజ్ నగర్ పోలీస్ పోస్ట్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ మేరకు ఆయనకు పదేళ్లుగా చికిత్స అందిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ త్రిపాఠి మీడియాకు వివరాలను వెల్లడించారు. పదేళ్ల నుంచి ట్రీట్మెంట్ పదేళ్ల కిందట గోపాలకృష్ణ దాస్ తన దగ్గరకు చికిత్స కోసం వచ్చాడని ఆయన తెలిపాడు. కోపధారి అయిన దాస్.. దానిని నియంత్రించుకునేందుకు తన దగ్గర చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అతనికి ఉన్న బైపోలార్ డిజార్డర్ వ్యాధికి ప్రతీరోజూ మందులు వాడాల్సిందేనని, కానీ, ఏడాదిగా అతను తన దగ్గరికి రాలేదని డాక్టర్ త్రిపాఠి వెల్లడించారు. జార్సుగూడ ఎస్డీపీవో గుప్తేశ్వర్ భోయ్ మాట్లాడుతూ.. దాస్‌కు ఏఎస్ఐ హోదాలో బ్రజ్‌రాజ్‌నగర్ ఏరియా గాంధీ చక్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పారని, ఆ తర్వాతే లైసెన్స్డ్ పిస్టోల్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన భార్య జయంతి దాస్ తెలిపారు. వృత్తి రిత్యా కుటుంబానికి దూరంగా(400 కిలోమీటర్ల..) ఉంటున్నాడని ఆమె వివరించారు. మంత్రిపై దాడికి సంబంధించిన సమాచారం టీవీ చానెళ్ల ప్రసారంతో తెలిసిందన్నారు. ‘నా భర్త గత ఏడాదిన్నరగా గాంధీ ఛక్ ఔటుపోస్టులో ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యానికి సంబంధించి మందులు కూడా వాడుతున్నారు. అయితే అతను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారో తెలియదు. ఉదయమే కుమార్తెతో, శనివారం రాత్రి కుమారుడితో వీడియోకాల్ ద్వారా మాట్లాడారు. కాల్ సమయంలో పూర్తిగా సాధారణమైనట్లు కనిపించా’రని ఆమె వివరించారు. ఈ చర్యతో తామంతా షాక్‌కు గురయ్యామన్నారు. నిందితుడు దాస్‌ను ఝార్సుగూడ పోలీసులు ఘటనకు పాల్పడిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. క్రైంబ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని ఉత్తర రేంజ్ ఐజీ దీపక్‌కుమార్ ప్రకటించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. మంత్రి దగ్గర కూడా.. నిందిత ఏఎస్ఐ గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు బ్రజరాజ్ నగర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీఓ) గుప్తేశ్వర్ భొయ్ తెలిపారు. గంజామ్ జిల్లా జలేశ్వర్ఖండికి చెందిన దాస్.. బెర్హమ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత జార్సుగూడలో పన్నెండేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో 2 రౌండ్లు కాల్పులు జరిపగా.. ఈ పరిస్థితికి ప్రేరేపించిన కారణాలను ధ్రువీకరించే దిశలో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. గోపాల్‌దాస్.. కొన్నేళ్ల క్రితం మంత్రి వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్ఓ)గా పనిచేశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. భువనేశ్వర్‌కు ఎయిర్‌లిఫ్ట్.. తుపాకీ కాల్పులకు గురైన రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్‌ను ముందుగా ఝార్సుగుడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాఫ్టర్‌లో భువనేశ్వర్‌కు తరలించారు. మధ్యాహ్నం 2.55 గంటలకు విమానాశ్రయానికి చేరడంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, అంబులెన్స్‌లో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి చేర్చారు. క్యాపిటల్ ఆస్పత్రి డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించగా, ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్సను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది. మంత్రి గుండెల్లోకి బుల్లెట్ దూసుకు పోవడంతో ఊపిరితిత్తులు, లోపలి భాగాల పునరుద్ధరణకు చేసిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త ప్రసరణకు చేసిన ప్రయత్నాలు అనుకూలించ లేదు. ఐసీయూలో అత్యవసర చికిత్స సేవలు ఫలప్రదం కానందున ప్రాణాలు కాపాడటం సాధ్యం కాలేదని అపోలో ఆస్పత్రి వర్గాలు మీడియాకు వెల్లడించారు. దీంతో భారీగా అంతర్గత రక్తస్రావమై, ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసినట్లు డాక్టర్ దేవాశిష్ నాయక్ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం వెల్లడించింది. అత్యంత ధనిక మంత్రిగా.. ఆరోగ్య శాఖామంత్రి నవ కిషోర్ దాస్ నవీన్ మంత్రి మండలిలో రెండో అత్యంత ధనవంతుడు. 2009 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి నిరవధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 2019 ఎన్నికల ముందు బీజేడీ చేరి, మరోసారి విజయం సాధించారు. పార్టీలో అనతి కాలంలోనే కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 70కి పైగా వ్యక్తిగత వాహనాలు, రూ.కోటి విలువ చేసే మెర్సిడెజ్ బెంగ్ కారు, ఒక రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్, రైఫిల్ కలిగి ఉన్న కిషోర్‌దాస్ సమగ్ర ఆస్తుల విలువ రూ.34 కోట్లుగా గతేడాది ప్రకటించారు. గనుల మైనింగ్ ఆనయకు ప్రధాన ఆదాయ వనరు. బలమైన నాయకుడిని కోల్పోయాం.. 1962 జనవరి 7న సంబల్పూర్లో జన్మించిన నవకిషోర్ దాస్.. ఎల్ఎల్.బి, ఎంఏ పూర్తి చేశారు. 1980 దశకంలో విద్యార్థి రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంబల్పూర్లోని గంగాధర్ మెహెర్ కళాశాల(ప్రస్తుతం గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం)లో చదువుతున్నప్పుడు, విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. దాస్ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా 4 దశాబ్దాలు కొనసాగింది. ఉన్నత నాయకత్వ లక్షణాలతో అన్ని వర్గాల ఆదరణ చూరగొన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి తొలుత కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత బిజూ జనతాదళ్ అభ్యరి్థగా శాసన సభ్యుడిగా తుదిశ్వాస వరకు కొనసాగారు. ఆయన మరణంతో పశి్చమ ఒడిశాతో రాష్ట్రం బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దాస్ ఆకస్మిక మృతి ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని ప్రకటించారు. ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు వైద్య రంగంలో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయన్నారు. పశ్చిమ ఒడిశాలో బీజేడీని బలోపేతం చేయడంలో అతని సహకారం అసాధారణమైనదని, పారీ్టలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. గతంలో మంత్రి మహంతిపై.. బిజూ జనతాదళ్ హయాంలో మంత్రులపై దాడులు జరగడం ఇది రెండోసారి. గతంలో 2014 ఫిబ్రవరి 21న న్యాయశాఖ మంత్రి మహేశ్వర్ మహంతిపై తుపాకీ దాడి జరిగింది. ఈ ఘటన పూరీలో చోటు చేసుకుంది. మంత్రి శరీరంలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. అదృష్టావశాతు ఈ దాడి నుంచి మంత్రి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా మంత్రి నవకిషోర్ దాస్ తుపాకీ పేలుడుతో మృతిచెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 2009 నుంచి ఆయన ఝార్సుగుడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రాజీనామా చేయాలి: కాంగ్రెస్ మంత్రి కిషోర్‌దాస్‌పై తుపాకీ దాడి తదనంతర మృత్యు ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిపై బాధ్యత వహిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కంటాబంజి ఎమ్మెల్యే సంతోశ్ సింగ్ సలుజా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఆరోగ్య మంత్రిపై కాల్పులపట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ దారుణమైన ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తోందని, అయితే ఈ విషాద ఘటన రాష్ట్ర ప్రజల భద్రత వ్యవస్థ పట్ల ప్రశ్న లేవనెత్తిందని నిలదీశారు. ప్రభుత్వం తన మంత్రికి భద్రత కల్పించ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ట అని, దీనిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి స్వయంగా హోంశాఖను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని మీడియా వింగ్ చైర్మన్ గణేశ్వర్ బెహెరా, జట్నీ నియోజక వర్గం ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌత్రాయ్ డిమాండ్ చేశారు. ప్రధాని సహా పలువురి సంతాపం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నవకిషోర్ దాస్ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కాల్పులకు గురికావడం బాధాకరమన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేశ్ లాల్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. అలాగే పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ ప్రముఖులు మంత్రి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అరుణ్ బొత్రా నేతృత్వంలో.. బ్రజ్‌రాజ్‌నగర్‌లో మంత్రి కిషోర్‌దాస్‌పై ఏఎస్ఐ కాల్పులు జరపడంతో మృతికి దారితీసిన ఘటనపై విచారణ జరిపేందుకు ఒడిశా క్రైంబ్రాంచ్ బృందం ఆదివారం సాయంత్రం ఝార్సుగుడ చేరుకుంది. ఎస్పీ రమేశ్ చంద్ర దొర ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ బృందంలో బాలిస్టిక్, సైబర్ నిపుణులు, క్రైంబ్రాంచ్ అధికారులు ఉన్నారు. దర్యాప్తును క్రైంశాఖ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ బోత్రా విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. కాల్పులకు గల కారణాన్ని తెలుసుకోవడానికి, ఘటన జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏఎస్ఐను విచారించనున్నారు. -
అటెన్షన్‌గా లేకపోతే టెన్షనే! బయటపడటం కష్టమా? డాక్టర్లు ఏమంటున్నారు?
మారుతున్న కాలానికి అనుగుణంగా మానసిక జబ్బులకు గురవుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వైద్యుల పరిశీలనలతో వెల్లడింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో కలవకపోవడం, పలకరించినా స్పందించకపోతుండటంతో సదరు వ్యక్తులను తీసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలోని సర్వజనాసుపత్రికి మానసిక రుగ్మతలతో వస్తున్న వారిని పరిశీలించగా.. మానసిక ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. సగటున 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తేలింది. చాలా మంది మహిళలు లేదా పురుషులు ఈ రుగ్మతలు ఉన్నట్లు కూడా తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తుండటంతో తీవ్రత పెరిగాక వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో.. మగవాళ్లు ఎందుకు ఎక్కువ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో చిన్న చిన్న శారీరక సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారని తేల్చారు. జలుబు, దగ్గు లాంటివి ఎక్కువ రోజులు వేధించినా వారు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. చిన్న విషయానికే నిరాశ.. వాస్తవానికి చెడు అలవాట్లు ఆడవాళ్లలో చాలా తక్కువ. అయినా సరే నిరాశకు గురై మానసిక ఆందోళన చెందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ (నిరాశ)కు గురవున్నారు. మహిళలు చిన్న చిన్న కుటుంబ విషయాలకు కూడా తీవ్రంగా స్పందించడం, ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటు న్నారని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక.. ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళన చెందుతున్నారనేది వైద్యుల అభిప్రాయం. పట్టించుకోకపోతే ముప్పే.. మానసిక రుగ్మతలను పట్టించుకోకపోయినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటివి పెరిగిపోవడంతో అసిడిటీ, అల్సర్ లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాయదుర్గానికి చెందిన 42 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించారు. అతను పనిచేసే ఆఫీసులో తీవ్ర ఒత్తిడి ఉంది. బాస్ నిత్యం వేధిస్తున్నారన్న భావన నెలకొంది. దీంతో రోజు రోజుకూ మానసికంగా కుంగిపోయి సొంతవూరికి వచ్చేశారని వైద్యులు తేల్చారు. ఉరవకొండకు చెందిన 36 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమి చెప్పినా ఆలకించే స్థితి దాటిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. గత ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో కూతురుకు తక్కువ మార్కులు రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. బాధితులు ఎక్కువవుతున్నారు ఫలానా మానసిక రుగ్మత అందరికీ ఉండాలని లేదు. మగవాళ్లలో స్కిజోఫినియా ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ల విషయంలో డిప్రెషన్ ఎక్కువ. సోషియల్ ఎలిమెంట్స్ అంటే సామాజిక కారణాలు.. కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటివి ఒక కారణం. చిన్న చిన్న సమస్యలకు కూడా కొందరు కుంగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి కౌన్సిలింగ్ కావాలి. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్‌మిషన్ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది ప్రధానంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలకు చదువులో మంచి మార్కులు రాకపోయిన, తమ గోల్ సాధించకపోయిన ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఒత్తిడి ఉంటోంది. అన్ని వయస్సుల వారు ఒత్తిడి బారిన పడుతున్నారు.అలాగే వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆ«ధిపత్యం వంటి ఎన్నో ఒత్తిడికి కారణమవుతున్నాయి. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాం. – డాక్టర్ అనిల్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ మానసిక ఒత్తిడికి చెక్‌పెట్టండిలా... ► కనీసం మనిషి రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ► కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. 45 నిముషాల పాటు వాకింగ్, రన్నింగ్ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ► యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడిని జయించవచ్చు. ► తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, చిరు ధాన్యాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటీన్స్, విటమిన్స్‌తో పాటు మినరల్స్ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. -
అతిగా పగటి కలలు.. కలిగే నష్టాలేంటో తెలుసా?
లండన్: పగటి కలలు.. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. మనసుకు ఉల్లాసం కలిగించడంతోపాటు విసుగు, ఒంటరితనం నుంచి ఉపశమనం కల్పిస్తాయి. మనసులో మెదిలే ప్రతికూల భావాల నుంచి బయటపడడానికి కలలను ఆశ్రయిస్తుంటారు. అంతేకాదు.. పగటి కలలతో మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని గతంలో పరిశోధనల్లో తేలింది. పేదవాడు క్షణాల్లో ధనవంతుడిగా మారిపోవడం పగటి కలల్లోనే సాధ్యం. అయితే, ఇలాంటి కలలు ఒక పరిమితి వరకు అయితే ఫర్వాలేదు. మితిమీరితే అనర్థాలు తప్పవని యూకే సైంటిస్టులు చెబుతున్నారు. మేల్కొని ఉన్నప్పుడు సగం సమయం కలల్లోనే గడిపితే వాటిని మితిమీరిన పగటికలలు అంటారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా జరగొచ్చు.అయితే.. ఇలాంటి వాటితో పలు మానసిక రుగ్మతలు తలెత్తుతాయట. ఆందోళన, కుంగుబాటు, అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్(ఓసీడీ) వంటి ముప్పు ఎదురవుతుందని సైంటిస్టులు గుర్తించారు. జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.5 శాతం మంది మితిమీరిన కలలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్(ఫాంటసీ డిజార్డర్) అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోందట. ఇజ్రాయెల్ హైఫా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎలి సోమర్.. బ్రిటన్ సహాకారంతో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ డిజార్డర్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. అంటే.. ఇలాంటి కలల ద్వారా సానుకూలత కంటే.. ప్రతికూల ధోరణే మనిషిలో పెరిగిపోతుందన్నమాట. ధ్యానం ద్వారా పగటి కలలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో
వైరల్: నడిరోడ్డులో ఓ యువకుడు చేసిన పని.. విస్మయానికి గురి చేస్తోంది. రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ గుద్దుకునే యత్నం చేశాడతను. అతని తల బస్సు అద్దానికి తగిలి.. అదికాస్త బద్ధలయ్యింది. ఈ ప్రమాదం నుంచి.. ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో అతనికి ప్రమాదం తప్పింది. కానీ, తల, కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. తొలుత ఆ యువకుడు కావాలని చేశాడనుకున్నారు స్థానికులు. కానీ, కారణం తెలిస్తే.. కంగు తినడం మీ వంతూ అవుతుంది కూడా!. అయితే.. యువకుడు అంతటితోనే ఆగలేదు. కనీసం ఒంటిపై చొక్కా కూడా లేని ఆ యువకుడు తనకు తగిలిన గాయాలను లెక్కచేయకుండా పైకి లేచి.. తనను గుద్దిన బస్సులోకి ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్‌పై రక్తం కారుతున్న కాళ్లను ఆనించి.. ప్రయాణికులను కాసేపు టెన్షన్ పెట్టాడు. అతన్ని నిలువరించడం స్థానికులు, ప్రయాణికుల వల్ల కూడా కాలేదు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. తొలుత దగ్గర్లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. కేరళ మలప్పురం పెరింథాల్‌మన్నలోని జూబ్లీ జంక్షన్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మానసిక స్థితి బాగోలేదని గుర్తించి.. తల్లిదండ్రుల్ని పిలిపించి మందలించారు. ఆపై వాళ్ల సాయంతో కోజికోడ్‌లోని మెంటల్ హెల్త్ సెంటర్‌కు యువకుడిని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. తాను బ్రెజిల్ జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, బస్సుకు ఉన్న బ్లూకలర్ చూసి అర్జెంటీనా టీం గుర్తుకు వచ్చిందని, ఆ కోపంతోనే అలా చేశానని గట్టి గట్టిగా అరిచాడు. అంతేకాదు.. బస్సు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక.. నెయ్‌మర్‌తో సహా టీం సభ్యులంతా రావాలని డిమాండ్ చేస్తూ హల్ చల్ చేశాడు. In a shocking incident, a mentally ill youth jumped before a moving bus near Perinthalmanna. The cops summoned his parents to the spot, and shifted him to a mental health institute in Kozhikode, reports said. The man suffered head & leg injuries in the incident. pic.twitter.com/sgcSRQHHVJ — Bechu.S (@bechu_s) November 9, 2022 -
మెంటల్ హెల్త్ యాక్టివిజం
మనసుకు వైద్యం చాలా ముఖ్యం మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం పని చేసే యాక్టివిస్టులు ఉన్నారు. కాని ‘మెంటల్ హెల్త్’ బాగుండాలని పని చేసే యాక్టివిస్టులు తక్కువ. నీరజా బిర్లా– కుమార మంగళం బిర్లా భార్యగా కంటే ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్టు’గా వచ్చే గుర్తింపును ఎక్కువ ఇష్టపడతారు. ‘ఎంపవర్’ అనే సంస్థను స్థాపించి బాలల, మహిళల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్నారామె. ఇటీవల హైదరాబాద్‌లో జరిపిన సర్వేలో ఎమర్జెన్సీ నంబర్లకు కేవలం ఒక శాతం మాత్రమే మానసిక సమస్యలు చెప్పుకునే కాల్స్ వచ్చాయి. అంటే మనసుకు వచ్చిన ఆపదను ఇంకా ధైర్యంగా బయటకు చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నీరజా బిర్లా ఏమంటున్నారో విందాం. ‘నా తొలి కాన్పు జరిగి కూతురు (అనన్యా బిర్లా) పుట్టాక నిజానికి అదొక పండగ వాతావరణంగా ఉండాలి. అదంరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఉన్నారు కూడా. కాని నేను మాత్రం ఎలాగో అయిపోయాను. నా ఒడిలో చందమామలాంటి బిడ్డ ఉన్నా నా మనసు రకరకాలుగా ఉండేది. ఊరికే ఏడుపు వచ్చేది. చాలా నిరాశగా అనిపించేది. చిరాగ్గా ఉండేది. ఇలా ఎందుకుందో నాకు తెలియలేదు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాని చివరకు తెలిసింది అది ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అని! ఇలా చాలామంది స్త్రీలకు అవుతుందని. ఆ సంగతి నాకు ముందే తెలిస్తే నేను ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కొని ఉండేదాన్ని. ధైర్యంగా ఉండేదాన్ని. బహిరంగంగా మాట్లాడేదాన్ని. నాలా ఎంతమంది బాధ పడుతున్నారో అనిపించింది. అప్పటి నుంచి దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఉన్న చైతన్యాన్ని గమనించడం మొదలుపెట్టాను. దాని గురించి ఎవరో పని చేయడం కాదనీ, మనమూ మనకు వీలైన పని చేయవచ్చని ఆరేళ్ల క్రితం ఎంపవర్ సంస్థ స్థాపించాను. పూర్తిగా మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం, సహాయం చేసే సంస్థ ఇది. ఈ సంస్థ వల్ల మంచి జరగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు 51 ఏళ్ల నీరజా బిర్లా. ఎన్నో ఏళ్లు సామాజిక సేవ, విద్య రంగాల్లో పని చేస్తున్న నీరజా బిర్లా ఇప్పుడు పూర్తిగా ‘ఎంపవర్’ (మైండ్ పవర్) సంస్థ ద్వారా చేయాల్సిన పని గురించే శ్రద్ధ పెడుతున్నారు. తనను తాను ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్’గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇద్దరు జర్నలిస్టులు ఆరేళ్ల క్రితం నీరజా బిర్లా ‘ఎంపవర్’ ఆవిర్భావం గురించి ప్రెస్‌మీట్ పెడితే ఇద్దరే జర్నలిస్టులు హాజరయ్యారు. ‘చూడండి... మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఎంత నిర్లక్ష్యం ఉందో. అదొక నిషిద్ధ విషయంగా కూడా ఉంటోంది. ఎవరైనా తమకు మానసిక అనారోగ్యం ఉందంటే పిచ్చి అని సమాజం ముద్ర వేస్తుందనే భయం ఇప్పటికీ పోలేదు. దీని గురించే ఎక్కువగా చైతన్యం కలిగించాలి. జ్వరం వస్తే ఎంత సులభంగా చెప్పుకుంటామో అంత సులభంగా చెప్పుకోగలగాలి. బండి మీద నుంచి కింద పడితే అందరూ పరిగెత్తి వెళ్లి ఎంత సహజంగా సాయం చేస్తారో... ‘‘యాంగ్జయిటీగా ఉంది, పానిక్‌గా ఉంది, డిప్రెషన్‌గా ఉంది’’ అంటే కూడా అంతే సహజంగా సాయం చేసేలా ఉండాలంటారు నీరజ. పిల్లల స్థాయి నుంచి ‘ఎంపవర్’ మొదలెట్టినప్పుడు నీరజ ఆలోచనలు స్కూలు స్థాయి నుంచి మానసిక ఆరోగ్యం గురించి చైతన్యం కలిగిస్తే చాలు అనేంతవరకే ఉన్నాయి. లెక్కల సిలబస్, సైన్స్ సిలబస్ ఉన్నట్టే మానసిక ఆరోగ్యం గురించి కూడా సిలబస్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండాలని ఆమె అనేక స్కూళ్లలో ఆ సిలబస్ పెట్టించారు. అంతే కాదు, పిల్లల కోసమే ప్రత్యేకమైన వర్క్‌షాప్స్ నిర్వహించారు. ‘అసలు అందరి కంటే ఎక్కువగా కౌమార దశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఆ వయసులోనే బాడీ షేమింగ్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్... ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలే అని వారికి తెలిస్తే వారు సులువుగా వాటిని ఎదుర్కొంటారు’ అంటారు నీరజా. అయితే పని కొనసాగే కొద్దీ ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లలు, స్త్రీలు అని కాకుండా అన్ని దశల, వయసుల్లో ఉన్నవారికి అవసరం అనే అవగాహనకు వచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు. ఈమె సాగిస్తున్న ఈ ఉద్యమంలో కుమార్తె అనన్యా బిర్లా కూడా భాగస్వామి అయ్యింది. ఇటీవల జరుగుతున్న డిప్రెషన్ ఆత్మహత్యలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రతి చోటా చర్చలు, చైతన్య శిబిరాల అవసరం తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు, సంస్థలు ఆ దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. నగరాల్లో క్లినిక్‌లు ‘ఎంపవర్’ ఆధ్వర్యంలో నేరుగా వైద్య సహాయం అందించే క్లినిక్‌లను ముంబైలో 3 ఏర్పాటు చేశారు నీరజ.. ఆ తర్వాత కోల్కటా, బెంగళూరు, హైదరాబాద్, గోవా, పిలానీలలో క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీరు నేరుగా వైద్య సహాయం అందిస్తే కౌన్సిలర్ల వ్యవస్థను కూడా విస్తృతం చేసుకుంటూ వెళుతున్నారు. ‘మన దేశంలో సమస్య ఏమిటంటే మనకు మానసిక సమస్య ఉందని తెలిశాక వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సైకియాట్రిస్ట్‌లు పెద్దగా అందుబాటులో కూడా ఉండరు. యాంగ్జయిటీ సమస్య ఉన్న మనిషి జీవితంలోని సమస్యలు ఎదుర్కొంటూ యాంగ్జయిటీని కూడా ఎదుర్కొంటూ బతకాల్సి రావడం చాలా కష్టం. కాని మన దగ్గర అలాగే జరుగుతుంటుంది. నడక, వ్యాయామం ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన దగ్గర బలం అంటే శారీరక బలమే. కాని మానసిక బలం ముఖ్యం. శరీరానికి ఎలా వ్యాయామం అవసరమో మనసుకు అంతే వ్యాయామం అవసరం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటారు నీరజ . -
'మానసికంగా అలసిపోయాడు.. రెండు నెలలు పక్కనబెడితే సర్దుకుంటుంది'
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి మానసికంగా అలసిపోయాడని.. అతనికి రెండు నెలల విశ్రాంతి ఇస్తే అంతా సర్దుకుంటుందని పేర్కొన్నాడు. మంగళవారం స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి మానసికంగా బాగా అలసిపోయాడు. అది అతని ఆటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కనీసం అతనికి రెండు నెలలైనా విశ్రాంతినిస్తే బాగుంటుంది. 2019 నవంబర్ తర్వాత కోహ్లి మళ్లీ సెంచరీ చేయలేదు. అతని సెంచరీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్తోనైనా ఆ కొరత తీరుస్తాడనుకుంటే నిరాశే మిగులుతుంది. దీంతో సెంచరీ అందుకోవాలనే తాపత్రయంలో ఒత్తిడిలో నలిగిపోతున్నాడు. ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపట్ల సానభూతితో ఉండాలి.. అనవసర ంగా ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. దీనికి ఒకటే మార్గం ఉంది. అదే విశ్రాంతి. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందన్న లేక తర్వాతైనా కోహ్లికి విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. కోహ్లిలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడితో ఆడించి ఆటకు దూరం చేయకూడదు. ఇది ఒక్క కోహ్లి పరిస్థితి మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్లో ఇలాంటి సమస్య ఎదుర్కొన్న క్రికెటర్లు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. అసలు సమస్య ఏంటో గుర్తిస్తే మంచిది'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకున్న కోహ్లి బ్యాట్స్‌మన్‌గా ఇరగదీస్తాడనుకుంటే నిరాశే మిగులుతుంది. ఐపీఎల్ 2022 సీజన్లో కోహ్లి ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో కోహ్లిని దురదృష్టం కూడా వెంటాడుతుంది. అనవసర రనౌట్లు, అంపైర్ నిర్ణయాలకు బలవ్వడం జరిగాయి. ఇక లక్నోతో మ్యాచ్‌లో కోహ్లి ఏకంగా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చదవండి: Surya Kumar Yadav: 'కోహ్లి స్లెడ్జింగ్ వేరే లెవెల్.. తలదించుకొనే బ్యాటింగ్ కొనసాగించా' కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్‌ప్రెషన్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ -
అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో.. ఏడేళ్లకు సురక్షితంగా..!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు చెందిన వివాహిత (58) సైకోసిస్ అనే మానసిక వ్యాధి బారినపడి కుటుంబానికి దూరమైంది. అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో సంచరిస్తున్న ఆమెను మదర్ థెరిస్సా చారిటీ సంస్థ అక్కున చేర్చుకుంది. ఆమె పరిస్థితి చూసి, చలించిన మానసిక వైద్యురాలు డాక్టర్ అనిత రాయిరాల ఏడాదిగా ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేశారు. ఎట్టకేలకు కోలుకున్న ఆమె తన వివరాలు చెప్పడంతో శనివారం సికింద్రాబాద్‌లోని చారిటీ కార్యాలయంలో వారికి అప్పగించారు. సరైన వైద్యం అందిస్తే ఎంతో మంది మానసిక రోగులు బాగయ్యే అవకాశం ఉందని డాక్టర్ అనిత వ్యాఖ్యానించారు. ►బెంగళూరుకు చెందిన వివాహితకు ఐదుగురు సంతానం. ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె ఓపక్క తన కుటుంబాన్ని చూసుకుంటూ.. మరోపక్క చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెప్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. ►ఆమెకు 49 ఏళ్ల వయస్సులో సైకోసిస్ అనే మానసిక వ్యాధి బారినపడింది. దీని ప్రభావంతో ఏం చేస్తోందో, ఏం మాట్లాడుతోందో కూడా తెలియని స్థితికి చేరుకుంది. అయినప్పటికీ కుటుంబీకులు ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. ►రెండుమూడుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఈమెను అతికష్టమ్మీద పట్టుకున్నారు. అయితే 2015లో ఇంటిని వదిలిన ఈ వివాహిత రైలులో సికింద్రాబాద్‌కు చేరుకుంది. ఈమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన కుటుంబీకులు అక్కడి పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..) ►సికింద్రాబాద్‌కు చేరుకున్న వివాహిత ఫుట్‌పాత్‌పై దిక్కులేని దానిలా కొన్నాళ్లు గడిపింది. రోడ్డుపై ఏది దొరికితే అది తింటూ బతికింది. ఈమెను చూసిన ఓ వ్యక్తి మదర్ థెరిస్సా చారిటీ సంస్థకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన నిర్వాహకులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ►నీడ, తిండి, బట్ట ఇవ్వడంతో పాటు వైద్యం చేయించారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ అనిత రాయిరాల సామాజిక సేవలో భాగంగా ఈ సంస్థకు వెళ్లి అక్కడి వారికి వైద్యం చేస్తుంటారు. అలా దాదాపు ఏడాది క్రితం ఈమె కళ్లల్లో ఆ వివాహిత పడ్డారు. ►ఆమెను చూసిన తొలి రోజే సరైన వైద్యం చేస్తే మామూలు స్థితికి చేరుకుంటుందని భావించారు. ఏడాది పాటు ప్రత్యేక చికిత్స చేసిన డాక్టర్ అనిత ఆ వివాహిత మామూలు స్థితికి చేరుకునేలా చేశారు. ఆమె మాట్లాడుతున్నది కన్నడగా భావించిన డాక్టర్... ఆ భాష తెలిసిన తన స్నేహితులతో మాట్లాడించారు. ►అలా ఆమె నుంచి బెంగళూరులోని కుటుంబీకుల వివరాలు తెలుసుకున్నారు. చారిటీ నిర్వాహకుల సహకారంతో అక్కడి స్థానికి పోలీసులను సంప్రదించి ఆమె కుటుంబాన్ని గుర్తించారు. వారితో ఫోన్లో సంప్రదించి, వివాహిత ఫొటో పంపి ఖరారు చేసుకున్నారు. ►శనివారం నగరానికి చేరుకున్న ఆమె భర్త, కుమార్తె, అల్లుడు సికింద్రాబాద్‌లోని చారిటీ కార్యాలయంలో వివాహితను చూసి ఉద్విగ్నానికి లోనయ్యారు. చారిటీ నిర్వాహకులు ఆమెకు కుటుంబానికి అప్పగించారు. ఇక జీవితంలో చూడలేమని భావించిన తన భార్యను తిరిగి అప్పగించిన మదర్ థెరిస్సా చారిటీ సంస్థకు, ఆమెను మామూలు మనిషిని చేసిన డాక్టర్ అనితకు కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. -
స్మార్ట్ ఫోన్‌కు అడిక్టయి.. గతం మర్చిపోయిన యువకుడు
జైపూర్: ఓ యువకుడు స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్ అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. అసలేంజరిగిందంటే.. రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సహ్వా టౌన్‌కు చెందిన అక్రామ్ (20) స్మార్ట్ ఫోన్ మోజులోపడి గతనెల రోజుల్లో చేస్తున్న బిజినెస్‌ను వదిలేశాడు. అంతేకాకుండా గత ఐదురోజులుగా నిద్రకూడా పోవట్లేదట. పరిస్థతి విషమించడంతో కుటుంబసభ్యులు భార్టియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వర్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రస్టులు వైద్యం అందిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం అతనికి వరుసకు మామైన అర్బాజ్ మాట్లాడుతూ ‘మా ఊరిలోనే అక్రమ్‌కు ఎలక్ట్రిక్ వైడనింగ్ వ్యాపారం ఉంది. ఐతే గత నెల రోజులుగా అధిక సమయం మొబైల్‌తోనే గడుపుతున్నాడు. ఫోన్ చూడటంలోపడి చేస్తున్న పని కూడా మానేశాడు. కుటుంబసభ్యులు పదేపదే చెప్పినా మొబైల్‌ని చూడటం మాత్రం మానలేదని తెలిపాడు. కొన్ని రోజులుగా రాత్రంతా మొబైల్లో చాట్లు, గేమ్‌లు ఆడుతున్నాడు. తినడం, త్రాగటం కూడా మానేశాడని తల్లి ఆవేధనతో స్థానిక మీడియాకు తెల్పింది. ఈ విషయమై మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. యువకుడికి సిటీ స్కాన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
రోజుకు 31 మంది బాలలు బలవన్మరణం
న్యూఢిల్లీ: దేశంలో 2020 సంవత్సరంలో రోజుకు 31 మంది చొప్పున చిన్నారులు(18 ఏళ్లలోపు వారు) బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లలు ఎదుర్కొనే మానసిక సమస్యలు కోవిడ్ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితులతో మరింత పెరగడమే ఇందుకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,396 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో నివేదిక తెలిపింది. 2019తో పోలిస్తే 18%, 2018 కంటే 21% ఇది ఎక్కువని పేర్కొంది. 2019లో 9,613 మంది, 2018లో 9,413 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు వెల్లడించాయి. నివేదిక ప్రకారం.. 2020లో ప్రధానంగా కుటుంబసమస్యలతో 4,006 మంది, ప్రేమ వ్యవహారం కారణంగా 1,337 మంది, అనారోగ్య కారణాలతో 1,327 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, సినీ హీరోల ఆరాధన, నిరుద్యోగం, ఆకస్మిక నష్టం, డ్రగ్స్ అలవాటు తదితర కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకున్న కేసులున్నాయి. కోవిడ్ మహమ్మారితో స్కూళ్లు మూతబడటం, సామాజికంగా ఒంటరితనంతోపాటు పెద్దల్లో ఆందోళన వల్ల కూడా చిన్నారుల మానసిక ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువై, వారిలో విపరీత నిర్ణయాలకు కారణమై ఉండవచ్చని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘మన సమాజంలో విద్య, ఆరోగ్యం సంబంధ అంశాలపై పెట్టినంత శ్రద్ధ మానసిక ఆరోగ్యానికి ఇవ్వలేకపోతున్నాం. చిన్నారుల బలవన్మరణాలు పెరుగుతుండటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. పిల్లలు తమ శక్తియుక్తులను తెలుసుకుని, భవిష్యత్ కలలను నిజం చేసుకునే వాతావరణం కల్పించడం తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వాల బాధ్యత’ అని కుమార్ అన్నారు. ఎన్సీబీ రిపోర్టుపై క్రై(చైల్డ్ రైట్స్ అండ్ యూ) సంస్థ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రీతి మహారా స్పందిస్తూ.. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన 11,396 మందిలో బాలురు 5,392 మంది కాగా బాలికలు 6,004 మంది ఉన్నారన్నారు. రోజుకు 31 మంది, గంటకు సుమారు ఒకరు చొప్పున తనువు చాలించారు. చిన్నారులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడం, కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారితో సన్నిహితంగా మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం, కుటుంబసభ్యుల మరణం వంటివి ఈ పరిస్థితికి దారి తీసింది’ అని తెలిపారు. ‘దీనిని నివారించేందుకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తుండాలి’ అని మానసిక ఆరోగ్య నిపుణురాలు ప్రకృతి పొద్దార్ అన్నారు. -
Lifestyle Diseases: లైఫ్ స్టైల్ మార్చుకో గురూ!
సాక్షి, అమరావతి: జీవనశైలి జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్నిటికంటే మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే.. ఇలాంటి జీవనశైలి జబ్బులకు బోధనాస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 2021 జనవరి నుంచి బోధనాస్పత్రుల్లో నమోదవుతున్న ఔట్ పేషెంట్ సేవల తీరును ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్) పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎంతమేరకు జీవనశైలి జబ్బులు నమోదవుతున్నాయనేది తెలుస్తుంది. అలా మన రాష్ట్రంలో గడచిన 5 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ) 1.30 లక్షల మందికి పైగా ఔట్ పేషెంట్లు జీవనశైలి జబ్బులతో చికిత్సకు వచ్చారని తేలింది. ఇవి కేవలం 11 బోధనాస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. పీహెచ్‌సీలు మొదలుకొని జిల్లా ఆస్పత్రుల వరకూ నమోదైన కేసులు అదనం. ఒత్తిడితో చిత్తవుతున్నారు ఉద్యోగాలు, చదువుల్లో గతంతో పోలిస్తే యువతలో ఎక్కువ మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ అత్యధికంగా 51 వేల మందికి పైగా బాధితులు మానసిక జబ్బుల కారణంగా ఔట్ పేషెంట్ సేవల కోసం ప్రభుత్వ పెద్దాస్పత్రులకు వచ్చినట్టు హెచ్‌ఎంఐఎస్‌లో నమోదైంది. కొంతవరకూ కోవిడ్ కూడా ఒత్తిడికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి ప్రధాన జబ్బులు రాకుండా కాపాడుకోవడమనేది ఆ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ కార్యక్రమాలను బట్టే ఇవి ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వల్ల 35 ఏళ్లలోపు యువకులకు కూడా హార్ట్ స్ట్రోక్‌లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. డయాబెటిక్ బాధితుల సంఖ్య పెరగడానికి కూడా వ్యాయామం లేకపోవడమే కారణమని వెల్లడైంది. ఎన్సీడీ జబ్బులపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి జబ్బులపై దృష్టి సారించింది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధుమేహం, గుండెపోటు వంటి జబ్బులను ప్రాథమిక దశలో కనుక్కునేందుకు స్పెషలిస్టు డాక్టర్లను నియమిస్తున్నారు. మానసిక జబ్బులకు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మాత్రమే ఆస్పత్రి ఉంది. కొత్తగా కడపలో 100 పడకలతో మానసిక ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేసి వారికి అవగాహన కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. కోరికలు పెద్దవి.. ఆదాయం చిన్నది చిన్న వయసులోనే కోరికలు చాలా పెద్దవిగా ఉండటం.. దానికి తగ్గట్టు ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇక చదువుల్లో ఒత్తిడి ఎక్కువవుతోంది. మా దగ్గరకు ఎక్కువగా 35 ఏళ్లలోపు వారే ఈ జబ్బులతో వస్తున్నారు. యువకుల్లో వచ్చే మానసిక రుగ్మతలకు తల్లిదండ్రుల పెంపకం కూడా ప్రభావం చూపిస్తుంది. –డాక్టర్ వెంకటరాముడు, మానసిక వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి, కడప పట్టణీకరణ ప్రమాదంగా మారింది జనజీవనంలో పట్టణీకరణ ప్రతికూల మార్పులు తెస్తోంది. ముఖ్యంగా ఆహారంలో తీవ్రమైన మార్పులు తెచ్చింది. దీనికితోడు వారిని ఒత్తిడి గుండెజబ్బుల వైపు నెడుతోంది. శారీరక వ్యాయామం, కూరగాయలతో కూడిన మంచి ఆహారం ద్వారా గుండెపోటును నివారించుకోవచ్చు. ముఖ్యంగా యువతలో మార్పు రావాలి. 90 శాతం మంది యువత వ్యాయామం లేక సతమతమవుతున్నారు. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే నష్టం కొనితెచ్చుకున్నట్టే. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
ఆ సమయంలో... భరోసా ఇస్తోంది!
తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరెవరూ పడకూడదని కోరుకునే పెద్దమనసు ఇర్ఫానా జర్గర్ది. అది 2014 శ్రీనగర్‌లో ఉన్న అత్యంత రద్దీ బజారులో నడుచుకుంటూ వెళ్తోంది ఇర్ఫానా. సడెన్‌గా ఆమెకు నెలసరి (పీరియడ్స్) బ్లీడింగ్ అవ్వడం మొదౖలñ ంది. ఆ సమయంలో తన దగ్గర శానిటరీ ప్యాడ్లు లేవు. కొనుకుందామనుకున్నా డబ్బులు లేవు. దీంతో దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలñ ట్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఏమీ దొరకలేదు. దీంతో ఇంటికి వెళ్లేంత వరకు తీవ్రంగా ఇబ్బందికి గురైంది. ఆరోజు ఇర్ఫానా పడిన ఇబ్బందిని మరే అమ్మాయి పడకూడదని శ్రీనగర్‌లోని పబ్లిక్ టాయిలెట్లలో శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తోంది ఇర్ఫానా. అమ్మాయిలు, మహిళలు నెలసరి సమయంలో శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురవుతుంటారు. ఇక నలుగురిలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు దృష్టి అంతా వెనుకాల ఎక్కడ మరకలు అంటుకున్నాయో? అని పదేపదే చూసుకుంటుంటారు. అది ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియే అయినా ఇప్పటికీ అమ్మాయిలు దానికి గురించి మాట్లాడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ ధోరణి మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్ కార్యక్రమాన్ని ఇర్ఫానా చేపట్టింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్పింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోన్న ఇర్ఫానా... నెల జీతంలో ఐదువేల రూపాయలను పొదుపు చేసి , వాటితో శానిటరీ ప్యాడ్స్ కొని నిరుపేదలకు ఉచితంగా అందిస్తోంది. ఇలా ఇప్పటిదాకా 20 వేలకు పైగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చింది. శానిటరీ న్యాప్కిన్స్, ప్యాంటీస్, హ్యాండ్ వాష్, బేబీ డయపర్స్తో కూడిన ‘ఇవ సేఫ్టీ డోర్’ కిట్‌ను పబ్లిక్ టాయిలెట్లలో ఉంచుతోంది. అత్యవసరంలో ప్యాడ్లు అవసరమైన మహిళలు ఎటువంటి టెన్షన్ పడకుండా వీటిని వాడుకునేలా పబ్లిక్ లేడీస్ టాయిలెట్స్‌లో అందుబాటులో ఉంచుతోంది. శ్రీనగర్‌లోని దాదాపు అన్ని పబ్లిక్ టాయిలెట్లలో ఇవ ప్యాడ్స్ కనిపిస్తాయి. వివిధ గ్రామాల నుంచి నగరానికి వచ్చే మíß ళలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. సమాజానికి ఏదైనా చేయాలన్న మనస్తత్వం ఇర్ఫానాది. తనకి 21 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి హార్ట్ ఎటాక్‌తో మరణించారు. దీంతో తను చదువుకుంటూనే, కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు... మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగంలో చేరింది. తన జీతంలో కొంత మిగుల్చుకుని ఉచితంగా ప్యాడ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా సమయంలోనూ ఆసుపత్రులలో ప్యాడ్స్‌ను ఉచితంగా అందించింది. ఈ సమయంలో చాలామంది ఇర్ఫానాకు కాల్స్ చేసి శానిటరీ న్యాప్కిన్స్, కిట్స్ ఇవ్వమని అడిగితే వారికి పంపించేది. నిరుపేదలు, నిరక్షరాస్య మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యత వివరిస్తూ, మెన్స్ట్రువల్ హైజీన్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది.ఈ మొత్తానికి ఎవరి సాయం లేకుండా తన సొంత డబ్బులను వాడడం విశేషం. ఇర్ఫానా చేస్తోన్న పని గురించి తెలిసిన వారంతా అభినందిస్తున్నారు. ‘‘నేను ఈ పనిచేయడానికి ప్రేరణ మా నాన్నగారే. షాపుల నుంచి మా నాన్న గారే శానిటరీ ప్యాడ్స్ కొని తెచ్చి నాకు ఇబ్బంది లేకుండా చూసేవారు. అందుకే నాన్న మరణించాక ఆయన గర్వపడేలా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. కొన్నిసార్లు పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉన్నప్పుడు సడెన్‌గా మొదలవుతుంది. ఆ సమయంలో మన దగ్గర ప్యాడ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్యాడ్లు బాగా ఉపయోగపడుతాయి’’ అని ఇర్ఫానా చెప్పింది. -
మరో రెండు ఈవెంట్స్ నుంచి వైదొలిగిన సిమోన్ బైల్స్
మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ టోక్యో ఒలింపిక్స్‌లో తన మెరుపు విన్యాసాన్ని పరిమిత ఈవెంట్లలోనే ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. వాల్ట్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె... ఆ ఈవెంట్‌తో పాటు అన్ఈవెన్ బార్స్ నుంచి కూడా తప్పుకుంది. ఆదివారం ఈ రెండు ఈవెంట్లకు సంబంధించిన ఫైనల్ పోటీలు జరుగుతాయి. అయితే బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశముంది. ఈ రెండు ఈవెంట్లకు మరింత సమయం ఉండటంతో ఆలోపు మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆమె భావిస్తోంది. మంగళవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్స్ నుంచి ఈ 24 ఏళ్ల ఒలింపిక్ చాంపియన్ బైల్స్ అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే! -
Simon Byles: విజయాలే భారమై...
టోక్యో: రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, వివిధ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 19 స్వర్ణాలు... మొత్తంగా అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్ బైల్స్. ►టోక్యో ఒలింపిక్స్‌కు తమ దేశం తరఫున మరో సారి భారీ అంచనాలతో వెళ్లిన బైల్స్‌ను మానసిక సమస్యలు వీడటం లేదు. మంగళవారం టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఒక్క ‘వాల్ట్’లోనే ఒకే ఒక ప్రయత్నం చేసి తప్పుకున్న బైల్స్... గురువారం జరిగే ఆల్ ఆరౌండ్ ఈవెంట్లో కూడా పాల్గొనడం లేదని ప్రకటించింది. ప్రస్తుతం తాను మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. వచ్చేవారంలో జరిగే వ్యక్తిగత ఈవెంట్లలో కూడా ఆమె పాల్గొంటుందా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ప్రతీ రోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటా మని అమెరికా ఒలింపిక్ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెరిగిపోయిందా..! జాగ్రత్తగా చూస్తే బైల్స్ పాల్గొనే ఈవెంట్లలో ఆమె ధరించే డ్రెస్‌పై ఏదో ఒక మూల ‘మేక’ బొమ్మ ము ద్రించి ఉంటుంది. ఇది ఏదో రాశిని బట్టి పెట్టుకు న్నది కాదు... ఎౖఅఖీ (ఎట్ఛ్చ్ట్ఛట్ట ౖజ అ ∙ఖీజీఝ్ఛ)... చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్ అని గుర్తు చేయడం దాని ఉద్దేశం! ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు ఆమె టోక్యో బయల్దేరినప్పుడు అమెరికా విమానయాన సంస్థ ‘యునైటెడ్’ కూడా ఫ్లయిట్లో ఇలాంటి వస్తువులే ఇచ్చి గౌరవం ప్రదర్శించుకుంది. మైకేల్ ఫెల్ప్స్ లాంటి దిగ్గజం లేకపోవడంతో అమెరికా దేశానికి ఈ ఒలింపిక్స్‌లో ఆమె ఒక ‘ముఖచిత్రం’ తరహాలో మారిపోయింది. ► ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఒకవైపు తన బ్రాండ్ పేరును కాపాడుకోవాలి. స్పాన్సర్లను సంతోషపెట్టాలి. అటు అభిమానులను అలరించాలి. ఇటు ఇంటా, బయటా విమర్శకులకు సమాధానమివ్వాలి. ఇదంతా 24 ఏళ్ల బైల్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. టోక్యోలో ఆమె మానసికంగా కుప్పకూలిపోవడం అనూహ్యమేమీ కాదు. ► ‘రియో’ విజయాల తర్వాత చాలాసార్లు ఆమె మానసికంగా ఆందోళనకు గురైంది. కిడ్నీలో రాయితో ఇబ్బంది పడుతున్న దశలో కూడా అందరి కోసం ఆమె 2018 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. కరోనా సమయంలో హ్యూస్టన్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో వరుసగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రావడం, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం బైల్స్‌ను బాగా ఇబ్బంది పెట్టింది (జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కూడా ఇదే కారణం చెబుతూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకుంది). ► అమెరికా ఒలింపిక్స్ ట్రయల్స్ సందర్భంగా ఆమె సహచరి సునీసా లీకంటే కూడా బైల్స్ వెనుకబడింది. గత ఎనిమిదేళ్లలో ఇలా జరగలేదు. గత రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌పై ఏ ఒత్తిడి లేదు. స్వేచ్ఛగా, చలాకీగా విన్యాసాలు ప్రదర్శిస్తూ పతకాలు కొల్లగొట్టింది. ► తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం ‘వాల్ట్’ విన్యాసం చేసినప్పుడు ఆమెలో ఉత్సా హం కనిపించలేదు. 2 1/2 ట్విస్ట్‌లు చేయాల్సిన చోట 1 1/2 ట్విస్ట్‌కే పరిమితమైంది. సరిగ్గా చెప్పాలంటే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని భయపడే కొత్త జిమ్నాస్ట్లాగా కనిపించింది. ఎంతో సాధించిన తర్వాత ఇంకా రిస్క్ చేసి ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన ఆమె వ్యాఖ్యల్లోనూ వినిపించింది. తాను పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో లేకపోయినా సరే... అందరినీ సంతృప్తిపరచడం కోసమే బైల్స్ ఒలింపిక్స్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యక్తిగత విభాగంలోనూ ఆమె పోటీ పడకపోవచ్చు! ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కుదురుగా కూర్చొని నా మానసిన సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని అనిపించింది. వివరంగా చెప్పలేను కానీ కొన్ని అంశాల్లో నా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. నాకు ఎలాంటి గాయం లేదు. మనసు ఎక్కడో ఉండి బరిలోకి దిగి... లేని గాయాలు తెచ్చుకునే పిచ్చి పనిని నేను చేయదల్చుకోలేదు. ఒలింపిక్స్‌కు వచ్చాక నేను నా కోసం కాకుండా ఇంకెవరి కోసమే ఆడుతున్నట్లు అనిపించింది. ఇది నన్ను బాధించింది. పేరు ప్రతిష్టలను పక్కన పెట్టి నా ఆరోగ్యానికి ఏది సరైందో ఆ నిర్ణయం తీసుకోవడం అవసరం. మళ్లీ పోటీల్లో పాల్గొంటానో లేదో చివరి నిమిషం వరకు చెప్పలేను. –సిమోన్ బైల్స్, అమెరికా జిమ్నాస్ట్ -
టెకీకి నరకం చూపిన ‘వరుడు’: మెసేజుల్లో మాత్రమే మర్యాద!
‘సంధ్యా.. (పేరుమార్చడమైనది) ఎంతసేపు కూర్చుంటావే అలా. నెలరోజులుగా చూస్తున్నాను. సరిగా తినడం లేదు. నిద్రపోవడం లేదు. ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు. ఎందుకీ ఆలోచన’ గట్టిగానే మందలిస్తున్నట్టుగా అంది తల్లి. ‘అదేం లేదమ్మా!’ సర్దిచెబుతున్నట్టుగా అంది సంధ్య. ‘చూడమ్మా! నీవు ఆ కార్తీక్ (పేరు మార్చడమైనది)ని మర్చిపోలేకుంటే చెప్పు. అయిందేదో అయ్యింది. వాళ్ల వాళ్లతో మాట్లాడి,పెళ్లి చేస్తాం’ అనునయిస్తూ చెప్పింది తల్లి. ‘వద్దమ్మా! పెళ్లొద్దు. నే చచ్చిపోతాను’ అంటూ ఏడుస్తూ తల్లిని చుట్టేసింది. ‘ఏమైంద’ని తల్లీ తండ్రి గట్టిగా అడిగితే అసలు విషయం బయటపెట్టింది సంధ్య. ∙∙ సంధ్య సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెళ్లిసంబంధాలు చూస్తూ సంధ్య ప్రొఫైల్‌ని మ్యాట్రిమోనియల్ సైట్లో పెట్టారు పేరెంట్స్. వచ్చిన ప్రొఫైల్స్‌లో కార్తీక్‌ది సంధ్యకి బాగా నచ్చింది. సంధ్య కూడా కార్తీక్‌కు నచ్చడంతో ఇంట్లోవాళ్లతో మాట్లాడారు. ఇరువైపుల పెద్దలు ఓకే అనుకున్నారు. నెల రోజుల్లో పెళ్లి అనుకున్నారు. దాంతో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. త్వరలో జీవితం పంచుకోబోతున్నవారు అనే ఆలోచనతో పెద్దలూ అడ్డుచెప్పలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ విదేశాల్లో స్థిరపడాలనుకున్నారు. అందుకు ముందస్తుగా కావాల్సిన ప్రయత్నాలూ మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే కార్తీక్ పాస్‌పోర్ట్ చూసింది సంధ్య. అందులో అతని పుట్టినతేదీ వివరాలు చూసి, ఆశ్చర్యపోయింది. అదే విషయాన్ని కార్తీక్‌ని అడిగింది. ‘మ్యాట్రిమోనియల్ సైట్ ప్రొఫైల్‌లో వేరే వివరాలున్నాయి. పాస్‌పోర్టులో వేరేగా ఉన్నాయి’ అని నిలదీసింది. ‘అదేమంత పెద్ద విషయం కాదు. డేటాఫ్ బర్త్‌లో కొంచెం తేడా అంతేగా!’ అన్నాడు కొట్టిపారేస్తూ కార్తీక్. ఇదే విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించింది సంధ్య. ప్రొఫైల్‌లో తప్పుడు వివరాలు ఇవ్వడం, ఇన్ని రోజులూ అసలు విషయం చెప్పకుండా దాచడంతో సంధ్య తల్లిదండ్రులు కార్తీక్‌ని, అతని తల్లిదండ్రులను నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కార్తీక్. ‘ఇంకా ఎన్ని వివరాలు దాస్తున్నారో.. ఈ సంబంధం మాకొద్దు’ అని చెప్పేశారు సంధ్య అమ్మనాన్నలు. సంధ్య కూడా తల్లిదండ్రులతో ‘మీ ఇష్టమే నా ఇష్టం’ అనేసింది. దీంతో అనుకున్న పెళ్లి ఆగిపోయింది. ∙∙ నెల రోజులుగా తిండీ, నిద్రకు దూరమైన సంధ్య ఆ కొద్ది రోజుల్లోనే ఐదు కేజీల బరువు తగ్గిపోవడంతో భయపడిన సంధ్య తల్లిదండ్రులు డాక్టర్ని సంప్రదించారు. సంధ్య ఏదో మానసిక సమస్యతో బాధపడుతోందని చెప్పారు డాక్టర్. కార్తీక్‌ని మర్చిపోలేకనే ఇదంతానా అని తల్లి కూతురుని నిలదీయడంతో అదేం కాదంటూ అసలు విషయం చెప్పింది సంధ్య. ‘డియర్.. నీవెప్పుడూ ఆనందంగా ఉండాలి’ వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు సంధ్య. నెల రోజులుగా వాట్సప్ మెసేజ్‌లతో తల తిరిగిపోతోంది సంధ్యకి. ఆ వెంటనే వాట్సప్ కాల్. ‘నిన్నెలా ప్రశాంతంగా ఉండనిస్తాను. నీ ఫొటోలు అడల్ట్స్ ఓన్లీ సైట్లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్నిక ఎవ్వరూ పెళ్లి చేసుకోనివ్వకుండా చేస్తా’ అంటూ బూతులు మాట్లాడుతూ ఫోన్. ఎత్తకపోతే బెదిరింపులు, ఎత్తితే బయటకు చెప్పనలవికాని మాటలతో వేధింపులు. డిప్రెషన్‌తో బయటకు రాలేకపోతోంది. ఇన్నాళ్లూ తల్లిదండ్రులకి ఎందుకు చెప్పడం, నేనే పరిష్కరించుకుంటాను అనుకున్న సంధ్య.. ఇక వేగలేక ‘చచ్చిపోతాను’ అంటూ తల్లి వద్ద ఏడ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ‘అమ్మా, కార్తీక్‌ని మర్చిపోలేక కాదు. అతన్ని పెళ్లి చేసుకున్నా నిజంగానే చచ్చిపోతాను. ఈ వేధింపులు నా వల్ల కాదు’ అనడంతో సంధ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తెలివిగా ఎదుర్కోవాలి... దొరికితే తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని మెసేజుల్లో చాలా అందమైన, మర్యాదపూర్వకమైన భాష వాడేవాడు కార్తీక్. కానీ, ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడే వాడు. వాట్సప్ కాల్ అయితే రికార్డ్ కాదని అతని ప్లాన్. నిపుణుల సాయం తీసుకున్న సంధ్య, వారిచ్చిన సూచన మేరకు ఒక రోజు కార్తీక్ వాట్సప్ కాల్ చేసినప్పుడు స్పీకర్ ఆన్ చేసి, మరో ఫోన్లో అది రికార్డ్ చేసింది. ఆ వాయిస్‌ను పోలీసుల ముందు పెట్టింది. దీంతో వేధింపులకు చెక్ పడింది. కేసు ఫైల్ అయ్యి, అతను విదేశాలకు వెళ్లడం కూడా ఆగిపోయింది. తెలివిగా సమస్యను ఎదుర్కోవాలి. అవగాహన లేకుండా జీవితాలను చేజార్చుకోకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ ధైర్యంగా ఉండాలి మ్యారేజీ బ్యూరోలు, డేటింగ్ సైట్స్‌లలో వివరాలతో పాటు, తప్పుడు ఫోటోలు కూడా పెడుతుంటారు. తెలిసి, తెలియక వారితో క్లోజ్ అయినప్పుడు ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. పూర్తి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఒక్క అభిరుచులు తెలుసుకోవడం మాత్రమే కాదు అతని గురించి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని, మూవ్ అవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. తమకు అన్యాయం జరిగిందని అర్ధమైతే, ధైర్యంగా దగ్గరలోని పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
మానసిక రోగి హల్చల్
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ) : గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 24 గంటలపాటు ఓ మానసిక రోగి చెట్టుపై కూర్చున్నాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా కిందకు దిగలేదు. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అతికష్టం మీద కిందకు దించారు. వివరాల్లోకి వెళ్తే... ఓ మానసిక రోగి సోమవారం ఉదయం డాక్‌యార్డ్ మార్గం నుంచి సింథియా వైపు వచ్చాడు. అలా వస్తూ సింథియా మలుపు షిప్‌యార్డ్‌కు వెళ్లే మార్గంలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గంటలు గడిచినా కిందకు దిగకపోవడంతో సమీపంలోని ఆటో స్టాండ్‌లో గల డ్రైవర్లు కిందకు దించే యత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం ఉదయం స్టాండ్‌కు వచ్చిన ఆటో డ్రైవర్లకు చెట్టుపై మానసిక రోగి కనిపించడంతో మీడియా, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న మల్కాపురం పోలీసులు షిప్‌యార్డ్ ఫైర్ సిబ్బంది సాయంతో రోగిని కిందకు దించారు. అనంతరం మానసిక వైద్యశాలకు తరలించారు. -
‘మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రత’
సాక్షి, న్యూఢిల్లీ : మానసిక అస్వస్థతకూ బీమా భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మానసిక సమస్యలకూ బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కోవిడ్-19 దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటం బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్పుట్ బలవన్మరణం నేపథ్యంలో కుంగుబాటు, యాంగ్జైటీలపై చర్చ సాగుతున్న క్రమంలో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. కాగా, బీమా పాలసీల్లో మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని 2018లో ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్సల తరహాలో మానసిక అనారోగ్యానికి బీమా కవరేజ్ కల్పించాలని బీమా కంపెనీలను ఆదేశిస్తూ ఐఆర్డీఏ 2018 మేలో ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి : కరోనా మృతదేహాలను పట్టించుకోరా?: సుప్రీంకోర్టు -
వినయ్ శర్మ బాగానే ఉన్నాడు
న్యూఢిల్లీ: తాను మానసికంగా బాధపడుతున్నానని చెబుతున్న నిర్భయ కేసులో ఒకరైన వినయ్ శర్మ చెబుతున్నదంతా అబద్ధమని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. వినయ్ తనపై తాను పైపైన తగిలేలా గాయపరుచుకున్నట్లు తేలిందని జడ్జి ధర్మేందర్‌కు అధికారులు తెలిపారు. పైగా ఎలాంటి మానసిక వ్యాధితో బాధపడట్లేదనే విషయం తేటతెల్లమైందని వివరించారు. అతడు ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడట్లేదని, తరచూ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని జైలు అధికారులు చెప్పారు.త్వరలో ఉరి కంబం ఎక్కబోతున్న తనకు మానసిక రుగ్మతతో బాధపడుతున్నందున ఉరి నుంచి తనకు మినహాయింపు కలిగించాలని శర్మ పిటిషన్ వేయడం తెల్సిందే. -
క్షణికావేశంతో ఛిద్రమవుతున్న జీవితాలెన్నో..
క్షణికావేశం నిండు జీవితాన్ని బలితీసుకుంటోంది. ఓ చోట ఎన్నోఆశలతో పెంచిన కొడుకు, మరోచోట కడవరకు తోడుంటానంటూ ఏడడుగులు వేసి ప్రమాణం చేసిన భర్త, ఇంకోచోట అన్నీతానై కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటిపెద్ద... ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారంగా భావించి తనువు చాలిస్తున్నారు. కుటుంబసభ్యులకు తీరని మనోవేదన మిగుల్చుతున్నారు. సాక్షి, వనపర్తి: చిన్నచిన్న కారణాలతో క్షణికావేశానికి లోనవుతూ...ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. కారణం ఏదైనా దాన్ని పరిష్కరించుకోలేక నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా..ప్రేమ విఫలమైనా కుటుంబంలో కలహాలు, పరీక్షల్లో తప్పడం.. వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయం...ఆ వ్యక్తి కుటుంబంలో పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తోంది. చనిపోతున్న వారిలో మహిళలు, పురుషులే కాకుండా యువకులే ఎక్కువగా ఉన్నారు. కష్టనష్టాలు, అపజయాలు, కుటుంబకలహలు తదితర సమస్యలు ఎదురైనప్పుడు మనోవేదనకు గురై చావే శరణ్యమనుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇవీ లక్షణాలు... ఆత్మహత్యకు పాల్పడేవారు దేనిపై శ్రద్ధచూపరు. మానసికంగా బాధపడుతూ ఏదో పోగొట్టుకొని జీవితంపై విరక్తి కలిగినట్లుగా కనిపిస్తారు. ఆందోళన, నిద్రలేకుండా ఉండటం, కంగారు పడటం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో బాధపడుతుంటారు. చిన్నచిన్న కారణాల చేత బలవన్మరణాలకు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తండ్రి బైక్ కొనివ్వలేదని కొడుకు.. ఉద్యోగం రాలేని నిరుద్యోగి... పరీక్షా తప్పానని వి ద్యార్థి... భర్త తిట్టాడని భార్య.. భార్య కాపురానికి రాలేదని భర్త... చేయని నేరానికి నిందమోపారని ఒకరు...ఆరోగ్యం బాగోలేదని మరోకరు ఇలా క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 18నుంచి 35 ఏళ్లలోపు వారే.. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో 18 నుంచి 35ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారమార్గం అంటూ ఏదో ఉంటుంది. అది తెలియక ఎందరో వ్యక్తులు తొందరపాటుకు గురవుతూ జీవితాన్ని ముగిస్తున్నారు. కుటుంబకలహాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, చిన్న చిన్నగొడవలు, భూసమస్యలు, ఆస్తి తగాదాలు, ఇలా కారణం ఏదైనా ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. 2017లో 82మంది క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోగా..అందులో 23మంది మహిళలు, 59మంది పురుషులు ఉన్నారు. అలాగే 2018లో 107 ఆత్మహత్య చే సుకోగా ..అందులో 33మంది మహిళ లు, 74మంది పురుషులు ఉండగా... 2019లో ఇప్పటివరకు 62మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 18మంది మహిళలు, 46మంది పురుషులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో 251మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 74మంది మహిళలు, 173మంది పురుషులు ఉన్నారు. ఇందులో యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ఆత్మహత్యలు.. 2019 నవంబర్ 3న వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలరాజు(28) గత కొన్నిరోజులుగా తీవ్ర మనస్థాపానికి గురై మిషన్ భగీరథ ట్యాంకు దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8న మదనాపురం మండలం సాంఘిక సంక్షేమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాంత్(17) ల్యాబ్‌రూం ప్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్ 9 ఘనపురం మండలం అప్పారెడ్డిపల్లిలో బాష(24) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 18న ఘనపురం మండలం సల్కెలాపురంతండాలో పవన్(15) విద్యార్థి పురుగల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రితోపాటు ఊరు తీసుకెళ్లలేదనే మనస్థాపంతో విద్యార్థి పవన్ పురుగులమందు తాగాడని గ్రామస్తులు తెలిపారు. గమనించిన తండావాసులు చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సెప్టెబంర్ 18న గోపాల్పేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన పద్మమ్మ (76) తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె భర్త కూడా చనిపోవడంతో తీవ్రవనస్థాపానికి గురైన పద్మమ్మ ఒంటిపై కిరోసిన్ నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గమనించి వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో మృతిచెందింది. సెప్టెంబర్ 17న వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన వెంకటయ్య (40) తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపు మృతిచెందాడు. అప్పులబాధ ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సెప్టెంబర్ 10న వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామానికి తిరుపతమ్మ కుటుంబసమస్యల కారణంగా పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి చిన్న సమస్యకు చావే శరణ్యమని భావిస్తే ఎట్లా, అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. వారి అభిరుచులు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం శ్రద్ధచూపాలి. సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో ఒంటరిగా ఫీలవుతారు. దీంతో సమాజంలో మెలిగే స్వభావాన్ని కోల్పోయి తన సమస్యను ఎవరికి చెప్పుకోలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరూ క్షణికావేశానికి గురికాకుండా జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించాలి. – కిరణ్‌కుమార్, డీఎస్పీ, వనపర్తి -
భవనం పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
బంజారాహిల్స్: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రామిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోల్‌కతకు చెందిన సంగీత మల్హోటియా(48) కుటుంబంతో సహా బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని హ్యాంగింగ్ గార్డెన్స్ అపార్ట్మెంట్లో ఉంటోంది. గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భర్తతో గొడవ జరగడంతో సోదరుడు సజ్జన్ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ఆమె బంజారాహిల్స్ రోడ్ నెంబర్–9 మీదుగా నడిచి వస్తూ దారిలో ఉన్న హార్మనీ బంజారా అపార్ట్మెంట్ వద్దకు వెళ్లింది. అక్కడ వాచ్మెన్ లేకపోవడంతో నేరుగా పైకి వెళ్లిన ఆమె కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని, డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ సూసైడ్ నోట్లో పేర్కొంది.స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ యువతకేమైంది!
భారతీయ యువత ఇంతకు ముందు ఏ తరమూ లోను కానంతటి ఒత్తిళ్లకు లోనవుతోంది. మానసిక అనారోగ్యం బారిన పడే యువత సంఖ్య అంతకంతకూ హెచ్చుతోంది. వారి సమస్యల గురించి చర్చించే / మద్దతుగా నిలిచే వాతావరణం కరువవుతోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆత్మహత్యలకు కారణమవుతోంది. భారతీయ విశ్వవిద్యాలయాలపై 2016లో జరిగిన సర్వే ప్రకారం... 37.7 శాతం మంది విద్యార్థులు ఒక మోస్తరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. 13.1% మంది ఈ సమస్యతో తీవ్రంగా, 2.4% మంది మరింత తీవ్రంగా సతమతమవుతున్నారు. యువకుల కంటే యువతుల్లో డిప్రెషన్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. కుటుంబంలో కొంత సంతోషకర వాతావరణం ఉన్న చోట డిప్రెషన్ చాలా తక్కువగా ఉంది. పరీక్షల్లో తప్పడం, పాఠాలను అవగాహన చేసుకోలేకపోవడం విద్యార్థుల డిప్రెషన్‌కు, ఆత్మహత్యలకు ప్రధాన కారణమవుతున్నాయని ఈ అధ్యయనంలో భాగస్వామి అయిన ఎన్ఫోల్డ్ ఇండియా కో–ఫౌండర్ షైబ్యా సల్దనా చెప్పారు. వీరి బలవన్మరణాల వెనుక నిస్సహాయత, విపరీతమైన నైరాశ్యం ఉందని ఆమె వివరించారు. విజయానికి నిర్ణీత కొలమానాలను ఏర్పరచడం, సామాజికంగా వేరుపడిపోవడం, విభిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని అంగీకరించకపోవడం, పట్టణీకరణ పెరిగిపోవడం వంటి అంశాలు కుంగుబాటుకు, ఆత్మహత్యలకు కారణమని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అచల్ భగత్ అన్నారు. గంటకొక విద్యార్థి.. మానసిక వైద్య నిపుణులు, కౌన్సెలర్లు అందిస్తున్న వివరాల ప్రకారం.. పరీక్షల విషయం లో విపరీతమైన ఒత్తిడి, ఉద్యోగం పొందలేకపోవడం, తమ ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోలేకపోవడం వంటి అంశాలు డిప్రెషన్‌కు.. ఒక్కోసారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. కుటుంబాల నుంచి, విద్యా సంస్థల నుంచి తగిన మద్దతు లభించకపోవడం, కౌన్సెలింగ్ ఇచ్చే వాతావరణం కరువవడంతో యువతలో ఆత్మహత్యల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. చదువు ఒత్తిళ్లతో దేశంలో ప్రతి గంటకో విద్యార్థి మరణిస్తున్నట్లు 2015 ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. 2011–15 మధ్య.. 40,000 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2014లో సిక్కింలో నమోదైన ఆత్మహత్యల్లో 27 శాతం ఉపాధి రాహిత్యంతో ముడివడినవేననీ ఒక అధ్యయనం చెబుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం లేక ఆత్మహత్యలకు పాల్పడిన వారి శాతం దశాబ్ద కాలం(2005 –15)లో 2000% పెరిగినట్లు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. ఉపాధి లేమి తాలూకూ కుంగుబాటు యువత జీవితాలను మింగేస్తుందనడానికి ఇవి బలమైన ఉదాహరణలు. ఏం చేయాలి? - మానసిక ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అనుకునే అనుకూల వాతావరణం చాలా ముఖ్యం. - పాఠశాలలు, కాలేజీల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. మానసిక ఆరోగ్యం, వెల్నెస్ అంశాల్ని పాఠ్య ప్రణాళికల్లో చేర్పాలి. - తల్లిదండ్రుల పెంపకంలో మార్పు రావాలి. కుటుంబం అండగా ఉంటే పిల్లలు మానసిక సంక్షోభాల నుంచి బయటపడతారు. - పాఠశాలలు, కళాశాలల్లో లైంగికత, జీవన నైపుణ్యాల విజ్ఞానాన్ని అందించాలి. - ఉన్నత విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. సుశిక్షతులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్లను నియమించాలి. బాధిత విద్యార్థులకు తగిన సాయమందించాలి. - బడ్జెట్లో మానసిక ఆరోగ్య అవసరాలకు వెచ్చించే మొత్తాన్ని పెంచాలి. ఒత్తిడి గుప్పెట్లో.. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి డిప్రెషన్, గుండెపోటు సహా అనేక శారీరక అనారోగ్యాలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రమాదకర ఒత్తిడి నుంచి బయటపడటం సాధ్యం కావడం లేదని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇటీవల జరిపిన సర్వేలో 95 శాతం భారతీయ యువతీయువకులు చెప్పారు. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, బ్రెజిల్, ఇండోనేసియా సహా 23 దేశాలపై జరిగిన ఈ సర్వే ప్రకారం.. మన దేశ యువతీ యువకుల్లో (18–34 ఏళ్ల వయోశ్రేణి) 95 శాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. 50 శాతం మంది స్నేహితులతో తగినంత సేపు గడపలేకపోతున్నారు. దాదాపు 75 శాతం మంది తమ సమస్యను డాక్టర్‌తో చెప్పుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. వైద్య సాయం తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు పెద్ద అడ్డంకిగా ఉన్నాయి. ‘పని–పైసలు’.. ఈ రెండు అంశాలే వారి ఒత్తిడికి ప్రధాన కారణాలవుతున్నాయి. 50 శాతం మంది ఉద్యోగులు పని ప్రదేశాల్లో జరుగుతున్న వెల్నెస్ ప్రోగ్రాంల్లో పాల్గొంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది. -
‘గ్యాస్ట్రైటిస్’ బాధలనుంచి విముక్తి ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 42 ఏళ్లు. కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? – డి. నాగమల్లేశ్వరరావు, కర్నూలు జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కారణాలు : 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙ పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి ∙తిన్న అనంతరం కనీసం రెండు గంటల తర్వాతే నిద్రించాలి. చికిత్స : హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ దీర్ఘకాలికంగా నీరసం... తగ్గుతుందా? నా వయసు 45 ఏళ్లు. గత ఆరు నెలల నుంచి ఒళ్లునొప్పులు, కండరాలు లాగడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. ఎప్పుడూ బాగా నీరసంగా ఉంటోంది. జ్వరంగా అనిపిస్తోంది. హోమియోçలో పరిష్కారం ఉందా? – పి. రమాదేవి, హైదరాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (సీఎఫ్ఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి ఉన్నవారు శారీరక శ్రమతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా నీరసంతో బాధపడేవారిలో కనీసం ఆర్నెల్ల పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో దీర్ఘకాలం నీరసం, నిస్సత్తువ లేదా అలసటతో పాటు విశ్రాంతి తీసుకున్నా ఉత్సాహంగా లేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. పురుషులతో పోలిస్తే ఇది మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కారణాలు : ∙ఆందోళన, శరీర రక్షణ వ్యవస్థలో లోపాలు ∙అంటువ్యాధులకు గురికావడం ∙మానసిక వ్యాధులు, ముఖ్యంగా డిప్రెషన్ ∙హారోఎ్మన్ సమస్యలు, హైపోథైరాయిడిజమ్ లక్షణాలు : ∙బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా మళ్లీ ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించకపోవడం ∙ఏమాత్రం శారీరక శ్రమ చేయలేకపోవడం ∙నిద్రసరిపోనట్లుగా అనిపించడం ∙ఏకాగ్రత లోపించడం ∙తలనొప్పి ∙కండరాల నొప్పులు ∙రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం ∙చిరాకు వ్యాధి నిర్ధారణ : బ్రెయిన్ ఎమ్మారై, సీబీపీ, ఈఎస్ఆర్, టీఎస్‌హెచ్, యూరిన్ టెస్ట్ చికిత్స : హోమియో వైద్య విధానంలో సీఎఫ్‌ఎస్‌కు మేలైన చికిత్స అందుబాటులో ఉంది. ఈ విధానంలో వ్యాధి తీవ్రతను, రోగి ముఖ్యలక్షణాలను విశ్లేషించి మందులు సూచిస్తారు. ఈ సమస్యకు చైనా, యాసిడ్‌ఫాస్, ఆర్సినిక్ ఆల్బ్, కార్బోవెజ్, ఫెర్రమ్మెట్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తిన్న వెంటనే కడుపు మెలిపెట్టినట్లుగా నొప్పి! నా వయసు 38 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. కడుపులో నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. అయితే టాయిలెట్‌కు వెళ్లగానే నొప్పి తగ్గుతుంది. నా సమస్యకు హోమియోలో చికిత్స చెప్పండి. – ఎమ్. చంద్రశేఖర్, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వారు సూచించిన మేరకు మందులు తీసుకోవాలి. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
బురారీ కాండ: ఒకరి ఉన్మాదం.. పదకొండు ప్రాణాలు!
ఇటీవల ఢిల్లీలో జరిగిన బురారీ కాండలో ఒకరి భ్రాంతి 11 మంది ప్రాణాలను బలితీసుకున్న ఘటనకు కళాచిత్రం. మోక్షం ఇక్కడే ఉంది. అందమైన ప్రపంచం ఇదే. మన కుటుంబాలకు ఈ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ పంచుకుంటే సగమవుతుంది. సంతోషం పంచుకుంటే రెట్టింపవుతుంది. కల పంచుకుంటే క్రాంతి అవుతుంది. కానీ భ్రాంతి పంచుకుంటే అశాంతి మిగులుతుంది. ఢిల్లీలో జరిగిన బురారీ కాండను మరచిపోలేం. ఒకరి ఉన్మాదం పదకొండు ప్రాణాలు తీసింది. అది పైశాచికత్వం కాదు... ఒక భ్రాంతి రోగం. ఒక మానసిక అంటువ్యాధి. ఇది ఒక పంచుకున్న భ్రమ..షేర్డ్ సైకోసిస్ వల్ల జరిగిందంటున్నారు నిపుణులు. మోక్షానికి తలుపు తెరవబోయి నరకాన్ని చూశారు. వ్యాధుల్లో రెండు రకాలుంటాయి. మామూలువి. అంటుకునేవి. మరి మానసిక సమస్యల్లో అంటువ్యాధులుంటాయా? ఉంటాయి. అరె... అదెలా సాధ్యం అనిపిస్తోందా? ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఇది అంటువ్యాధి కానే కాదు. కానీ అంటువ్యాధే. అదెలాగో చూద్దాం. ఒక కేస్ స్టడీ: ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతోకాలం కిందట నారాయణి దేవి భర్త చనిపోయాడు. మరణించినాయన కుటుంబపెద్ద కావడంతో ఆయన మృతి తర్వాత ఆ కుటుంబం అష్టకష్టాలు పడింది. కుటుంబ పెద్ద రెండో కొడుకైన లలిత్ భాటియా తరచూ ఓ మాట అంటుండేవాడు. నాన్న తనతో మాట్లాడుతున్నాడనీ, బిజినెస్ విషయంలో సలహాలు ఇస్తున్నాడని చెప్పేవాడు. ఆ సలహాలను తాము పాటిస్తూ ఉండటం వల్ల బిజినెస్ పుంజుకొని తమ కష్టాలు గట్టెక్కాయని ఆయన నమ్ముతుండేవాడు. ఈ నమ్మకం మరింత పెరిగింది. దాంతో 2015 నుంచి అతడు తాంత్రిక పూజల్లో నిమగ్నం కావడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో అతడి పూజలు మరింత ముమ్మరమయ్యాయి. అందులో వటవృక్ష పూజ అనే ఓ తంతును నిర్వహిస్తే... తమకు మోక్షం తప్పదని అతడు నమ్మాడు. అతడే కాదు... గతంలో బిజినెస్ బాగుపడటం, తమ జీవనశైలి మెరుగుపడటంతో లలిత్భాటియా తండ్రే అతడితో మాట్లాడుతున్నాడని కుటుంబసభ్యులంతా నమ్మడం మొదలు పెట్టారు. దాంతో లలిత్ చెప్పే వటవృక్షపూజ కాన్సెప్ట్‌నూ అందరూ విశ్వసించారు. కుటుంబ సభ్యులందరికీ మోక్షం కోసం ఈ వటవృక్షపూజలో భాగంగా... చెట్టుకు ఉండే ఊడల్లాగా ఉరి వేసుకొని వేలాడాలనీ, దాంతో ఇప్పుడు తాము మరణించబోమనీ, అయితే వాస్తవంగా చనిపోయినప్పుడు తమకు మోక్షం తప్పదంటూ లలిత్ చెప్పిన దాన్ని అందరూ గుడ్డిగా నమ్మారు. పూజలో భాగంగా తమ నవరంధ్రాలనూ మూసిపెట్టాలని కళ్లకు గంతలు కట్టుకున్నారు. నోట్లో గుడ్డలు, చెవుల్లో దూది కుక్కుకున్నారు. పూజలో భాగంగా అందరూ ఉరేసుకున్నారు. తమ ఆత్మలు గాలిలో కలిసి, మళ్లీ తమ శరీరంలోకి ప్రవేశించడానికి 11 మంది కోసమంటూ పదకొండు గొట్టాలనూ ఏర్పాటు చేసుకున్నారు.ఇంతాచేసి ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు. అయితే ఈ వటపూజను ఎంతగా నమ్మారంటే... తమ పూజాక్రతువు పూర్తయ్యాక, తమలాగే కష్టాలు పడుతున్న మరో కుటుంబంతోనూ ఈ వ్రతం చేయించాలని వారనుకున్నారు. అంత మూఢంగా, గాఢంగా వారీ తాంత్రిక తంతును విశ్వసించారన్నమాట. లలిత్ భాటియా నమ్మాడు సరే... మరి మిగతావారి విచక్షణ ఏమైంది? ఏమైందంటే... సైంటిఫిక్‌గా చెప్పాలంటే తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేశాడు. అలా తన సైకోసిస్‌ను మిగతావారికీ షేర్ చేసిన ఈ వ్యాధి పేరే ‘‘షేర్డ్ సైకోసిస్’’. మానసిక వైద్యశాస్త్రంలో ఒకింత అరుదైన వ్యాధే. కానీ ఎంతో ప్రమాదకరం. ఎంతగానంటే... ఏ డిప్రెషన్లోనో కూరుకుపోతే... అలా దానికి గురైనవాడే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ‘షేర్డ్ సైకోసిస్’లో అతడితో పాటు మరో సమూహం సమూహమే బలయిపోతుంది. అలా బలిచేసిన ఆ ‘షేర్డ్ సైకోసిక్’ రుగ్మత గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. అసలు ‘షేర్డ్ సైకోసిస్’ అంటే ఏమిటీ? ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన ఒక ఫ్రెంచ్ పేరు ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ (జౌ జ్ఛీ ్చ ఛ్ఛీu్ఠ) అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. బురారీ ఆత్మహత్యల సంఘటనలో అది ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ వరకు వచ్చి ఆగింది. అదే వారు సంకల్పించినట్టుగా మరో కుటుంబాన్నీ ప్రభావితం చేసి పూజకు ఉసిగొలిపి, ఆ కుటుంబం మరణానికీ కారణమయ్యుంటే అప్పుడది ‘ఫోలీ ఎ ప్యాసియర్స్’ అయి ఉండేది. దీన్ని ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. మొట్టమొదట భ్రాంతులకు గురయ్యే రోగిని ‘ద ప్రైమరీ కేస్’ లేదా ‘ఇండ్యూసర్’ అని అంటారు. అంటే పై కేస్‌స్టడీలో లలిత్ భాటియా ‘ద ప్రైమరీ కేస్’ లేదా ఇండ్యూసర్ అన్నమాట. ఆ తర్వాత అతడి భ్రాంతులకు పొరుగు ఉన్న ఆరోగ్యవంతులూ ప్రభావితులైపోతారు. ఇలా తర్వాత ప్రభావితులయ్యే వారిని ‘ద సెకండరీ’ లేదా ‘యాక్సెప్టార్’ లేదా ‘అసోసియేట్’ అంటారు. ఇక్కడ మరో విచిత్రం ఉంది. ఒకరిపై ఒకిరికి ఎలాంటి ప్రభావాలూ లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకేలాంటి భ్రాంతులకు లోనైతే ఆ కండిషన్‌ను ‘ఫోలీ సైమల్టేనీ’ అంటారు. ఏదైనా కారణాల వల్ల ‘ద ప్రైమరీ కేస్’ లేదా ‘ద ఇండ్యూసర్’ భ్రాంతులకు గురికావడం లేదనుకోండి. క్రమంగా సెకండరీ/యాక్సెప్టార్/అసోసియేట్స్ కూడా భ్రాంతుల నుంచి ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేసి పూర్తిగా నార్మల్ అయిపోతారు. ఏదైనా కారణం చేత ఈ తరహా సైకోసిస్‌కు గురైనవారు భ్రాంతుల వల్ల వేర్వేరుగా హాస్పిటల్లో చేరారనుకోండి. అప్పటివరకూ ‘ద ఇండ్యూస్డ్’ తాలూకు ప్రభావం లేకపోవడంతో... ‘ద అసోసియేట్’కు ఎలాంటి వైద్య చికిత్సా అవసరం లేకుండానే ఆటోమేటిగ్గా నయమైపోతుంది. ఎవరెవరిలోనంటే...? నిజజీవితంలో దీనితో బాధపడ్డవారి కేసులు చూస్తే ఎంతో విచిత్రంగా అనిపిస్తాయి. స్వీడన్‌కు చెందిన ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు ఇంగ్లాండ్‌కు వచ్చారు. వాళ్ల పేర్లే ఉర్సులా ఎరిక్సన్, సబీనా ఎరిక్సన్. లండన్ వెళ్లడం కోసం లివర్‌పూల్‌లో బస్ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా... వారి ప్రవర్తన విచిత్రంగా అనిపించడంతో బస్‌డ్రైవర్ వాళ్లను బస్ ఎక్కనివ్వలేదు. అక్కడి ‘హైవేస్ ఇంగ్లాడ్ ట్రాఫిక్ ఆఫీసర్లు’ వాళ్లను ఆ తర్వాతి బస్‌లో ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా... తొలుత ఉర్సులా ఉన్నట్టుండి విపరీతమైన ట్రాఫిక్ ఉన్న రోడ్డుపైకి అకస్మాత్తుగా పరుగెత్తి లారీని ఢీకొనబోయింది. అంతలోనే ఆమె చెల్లి సబీనా కూడా రోడ్డు మీదికి పెరుగెత్తింది. వీళ్లలో ఉర్సులా ‘ద ప్రైమరీ కేస్’ అని, సబీనా ‘సెకండరీ’ అని.. వాళ్లిద్దరూ ‘ఫోలీ ఎ డ్యూయో’కు లోనయ్యారని ఆ తర్వాత తేలింది. ఇలా అనేక కేసులను పరిశీలించనప్పుడు బంధువర్గంలోని వారు, అన్నదమ్ముల లేదా అక్కచెల్లెళ్ల పిల్లలు (కజిన్స్) ఈ ‘షేర్డ్ సైకోసిస్’కు ఎక్కువగా గురవుతారని తేలింది. ఎందుకు, ఎలా...? ఈ ‘షేర్డ్ సైకోసిస్’కు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు ‘సైకోసిక్’కు ఎలా గురవుతారో అర్థం చేసుకుందాం. మన మెదడులో సుమారు పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని నాడీకణాలు ఉంటాయి. సన్నటి వైర్లలాంటి వాటితో ఒక్కో కణానికి మళ్లీ పక్కనున్న కణాలతో పదివేల నుంచి లక్ష వరకు కనెక్షన్లు ఉంటాయి. ఒక్కో కనెక్షన్‌ను ఒక్కో వైర్ అనుకుంటే మెదడులో మొత్తం పది పక్కన 16 సున్నాలు పెడితే ఎంత విలువ వస్తుందో... వైర్లలాంటి అన్ని కనెక్షన్లు ఉంటాయి. ఈ వైర్ల మధ్య కొన్ని చోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. అలాగే కణాల్లోనూ కొన్ని రసాయనాలు స్రవిస్తుంటాయి. కణాల మధ్యన ఉండే రసాయనాలను ఫస్ట్ మెసెంజర్స్ అనీ, కణాల్లోపలి రసాయనాలను సెకండ్ మెసెంజర్స్ అని అంటారు. ఈ రసాయనాలు, వైర్ల ద్వారా ఒక్కోకణానికి మరో కణంతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. వాటి ద్వారానే మన ఆలోచనలు పుడుతుంటాయి. మారుతుంటాయి. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని. ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడులో ఈ రసాయనాల మార్పులు జరిగిన వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. నార్మల్ వ్యక్తికి ఏమీ జరగకపోవడం ఎంత వాస్తవమో... తమ రసాయన మార్పుల అనుభూతుల వల్ల వాళ్లకు ఏదో జరగడం కూడా అంతే వాస్తవం. అందుకే వాళ్ల భ్రాంతులను మనం కొట్టిపారేయకూడదు. అలా జ్ఞానేంద్రియాలు చూడకపోయినా సంఘటనను జరిగిన అనుభూతి పొందడాన్ని ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఇక సైకోటిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ఏదైనా సంఘటన జరగకపోయినా అది జరిగిందంటూ మనసులో దృఢంగా నమ్మడాన్ని ‘డెల్యూషన్’ అంటారు. ఇలాంటి భ్రాంతులు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా జరుగుతాయి. అయితే వ్యాధికి లోనైనవారిలో అలాంటివేవీ తీసుకోకపోయినా ఈ భ్రాంతులు కలుగుతాయి. ఇలా సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితం చేస్తే పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్డ్ సైకోసిస్’ అంటారు. ఈ విధంగా షేర్డ్ సైకోసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుందన్నమాట. ఈ వ్యాప్తిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒక కుటుంబంలోని డామినెంట్ పర్సనాలిటీ... అదే కుటుంబలో సబ్మిసివ్ పర్సనాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఆ సబ్మిసివ్ పర్సనాలిటీ, డామినెంట్ పర్సనాటిటీపై ఆధారపడి చాలాకాలం జీవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సబ్మిసివ్ పర్సనాలిటీ... తన డామినెంట్ పర్సనాలిటీతో తేలిగ్గా ప్రభావితమవుతుంది. ఉగ్రవాదుల నేతలు తమ ప్రయోజనాల కోసం సబ్మిసివ్ పర్సనాటిటీ ఉన్న అనుచరులను కూడా ఇలాగే ప్రభావితం చేస్తుంటారు. ఈ జబ్బుపైన ఒక సినిమా కూడా... షేర్డ్ సైకోసిస్ అంశంగా ఆరోన్ రాటింగాస్ అనే అమెరికన్ డైరెక్టర్ 2011లో ‘అపార్ట్’ అనే సినిమా కూడా తీశాడు. దీని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోలీ ఎ డ్యూయోతో బాధపడుతున్న ఇద్దరి నిజజీవిత సంఘటన ఆధారంగా సినిమా తీసినట్లు చెప్పాడు. లక్షణాలు ఏమిటి / గుర్తించడం ఎలా: మద్యం, మాదకద్రవ్యాలు ఏమీ లేకుండానే ఒకరు తమకు ఏవేవో వినిపిస్తున్నాయనీ, ఎవరెవరో కనిపిస్తున్నారని చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ప్రైమరీలో కనిపిస్తాయి. వాటితో కుటుంబ సభ్యులూ ప్రభావితమవుతుంటారు. ఉదాహరణకు తాము పేదరికంలో బాధపడుతున్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తే... తమకు కలిసి వస్తుందనీ, దాంతో స్విమ్మింగ్‌పూల్ వంటి ఇంట్లో తాము ఉండబోతామని అనిపిస్తుంది. వ్యాపారంలో యాదృచ్చికంగా కలిసి వచ్చాక... తాము స్విమ్మింగ్‌పూల్ ఉన్న ఇంట్లోనే చేరారనుకోండి. ఇక అప్పట్నుంచి ప్రైమరీ తనకు ఏవేవో మాటలు వినిపిస్తుంటాయనీ, తనకు ఎవరెవరో కనిపిస్తుంటారనీ, తనకు వినిపించే ఆదేశాలను పాటిస్తే.. అంతా విజయమేనని నమ్ముతుంటారు. నిర్ధారణ : షేర్డ్ సైకోసిస్ నిర్ధారణకు ఇదమిత్థంగా వైద్య పరీక్షలేమీ అందుబాటులో లేవు. అయితే ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధారణ చేయడం కోసం ఒక్కోసారి రోగులకు బ్రెయిన్ ఎమ్మారై, ఇతర రక్తపరీక్షలు చేయిస్తుంటారు. అవన్నీ నార్మల్‌గా ఉండి కూడా రోగి వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ), ధోరణి, ప్రవర్తలను సైకియాట్రిస్టులు పరిశీలిస్తారు. వారు ఇతరులను ప్రభావితం చేసేలా భ్రాంతులకు లోనవుతున్నట్లు తెలుసుకున్నప్పుడు దాన్ని షేర్డ్ సైకోసిస్‌గా సైకియాట్రిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు. నివారణ / చికిత్స : కుటుంబంలో ఒకరు ఇలా భ్రాంతులకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు గ్రహిస్తే దీన్ని పసిగట్టడం తేలికే. అయితే వారు కూడా ప్రైమరీతో పాటు ప్రభావితమైతేనే సమస్య. దీనికి కౌన్సెలింగ్‌తోనూ, కుటుంబానికి ఇవ్వాల్సిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది. అలాగే యాంగై్జటీని తగ్గించే మందులు, యాంటీసైకోటిక్ మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేస్తారు. సామాజిక సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు ఈ తరహా భ్రాంతులకు గురికావడం చాలా తక్కువని సైకియాట్రిస్టులు గుర్తించారు. -
ఆ మరణాలకు కారణమదేనా?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బురారీ ప్రాంతం లో ఉన్న ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యులకూ ‘ఉమ్మడి భ్రమ’ (షేర్డ్ సైకోసిస్) వంటి మానసిక వ్యాధి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ ‘ఉమ్మడి భ్రమ అంటే అది ముందు ఒక వ్యక్తికి మొదలై ఆ తర్వాత ఇతరులకు కూడా పాకుతుంది. ఈ కుటుంబం విషయానికి వస్తే లలిత్ భాటియా తండ్రి చనిపోయినప్పటికీ.. తాను తన తండ్రితో మాట్లాడుతున్నట్లు భ్రమపడేవాడనీ, ఆ తర్వాత కుటుంబలోని మిగతా సభ్యులు కూడా ఆయనను నమ్మి, అందరూ కలిసి భ్రమపడేవారని మేం అనుమానిస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు భాటియా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారితో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, కుటుంబ, వ్యక్తిగత విష యాలను ఎవరికీ తెలియనిచ్చే వారు కాదనీ, ఎవ్వరినీ తమ ఇంట్లోకి కూడా పిలిచేవారు కాదని ఇరుగుపొరుగువారు చెప్పారు. బురారీ ప్రాంతంలోని ఇంట్లో జూలై 1న ఒకే కుటుంబానికి చెందిన 11 మృతదేహాలు కనిపించి సంచలనంగా మారడం తెలిసిందే. 10 మృతదేహాలు పై కప్పుకు వేలాడుతుండగా, ఒక ముసలావిడ శవం మాత్రం నేలపై పడి ఉంది. ఇవి హత్యలా, లేక తాంత్రిక పూజలతో మోక్షం కోసం అందరూ ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 11 పైపుల కథేంటి? మృతదేహాలు కనిపించిన ఇంటి గోడకు 11 పైపులు అమర్చి, వాటికి ఎలాంటి కనెక్షన్ ఇవ్వకపోవడం తమకు కూడా వింతగా అనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. పైపులను నాలుగు నెలల క్రితమే అమర్చారని తెలిపారు. లోపలికి గాలి రావడం కోసం, ప్లైవుడ్ రసాయనాల నుంచి వచ్చే విషవాయువులను బయటకు పంపడం కోసం ఆ పైపులను ఏర్పాటుచేసినట్లు భాటియా కుటుంబసభ్యులు అప్పట్లో చెప్పారని స్థానికులు వెల్లడించారు. అయితే ఆ 11 పైపులు అమర్చిన విధానం చూస్తుంటే కూడా వింతగా ఉంది. చనిపోయాక గాలితో కలిసి ఆత్మలు బయటకు వెళ్లేందుకే వారు ఆ పైపులను ఏర్పాటు చేసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. 11లో 7 పైపులు ఒక పరిమాణంలో, 4 పైపులు మరో పరిమాణంలో ఉన్నాయి. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఏడు పైపులను కొంచెం వంచి రంధ్రాలు నేలవైపుకు ఉండేలా అమర్చగా, నాలుగు పైపులు మాత్రం వంపు లేకుండా గోడ నుంచి చొచ్చుకొచ్చి అలాగే ఉండిపోయాయి. రెండు పైపులు మాత్రం దూరంగా ఉన్నాయి. చనిపోయిన వారిలో ఇద్దరు వితంతువులున్నందునే ఇలా దూరంగా అమర్చి ఉంటారంటున్నారు. -
అదొక మానసిక వ్యాధి: శ్రీరెడ్డి
హైదరాబాద్: తనపై వస్తోన్న విమర్శలకు ఘాటుగా బదులిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో బాణం విసిరారు. ఇప్పటివరకు ఆయా వ్యక్తుల పేర్లు వెల్లడిస్తూ ఎదురుదాడి చేసిన ఆమె.. ఇప్పుడు ఏ ఒక్కరి పేరునూ ప్రస్తావించకుండా చేసిన పోస్ట్ వైరల్ అయింది. ‘ఇది ఖచ్చితంగా పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్(పీపీడీ) అనే మానసిక వ్యాధి’ అని, ‘ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్తుడినని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంద’ని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి అంటూ ఆరు పాయింట్లు రాసుకొచ్చారు. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన శ్రీరెడ్డి ఆక్రమంలో ఫిలిం చాంబర్ ఎదుట చేపట్టిన అర్ధనగ్న నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పలు మహిళా సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని కొనసాగించిన శ్రీరెడ్డి ప్రస్తుతం చట్టపరంగా ముందుకు వెళ్ళే యోచనలో ఉన్నారు. శ్రీరెడ్డి నిరసన తర్వాత దఫదఫాలుగా స్పందించిన సినీ పెద్దలు.. ఇండస్ట్రీలో లైంగిక దాడులను అరికట్టే దిశగా కమిటీలు వేయనున్నట్లు పేర్కొనడం విదితమే. శ్రీరెడ్డి ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ ఇది.. -
నీడలు మాట్లాడుతున్నాయి!
మైండ్ ఏమైనా రేడియో స్టేషనా మాటలు వినపడటానికి? లేదంటే పాత యాంటిన్నా ఉన్న టీవీనా బొమ్మలు నాట్యమాడటానికి? ఎగ్జాట్లీ! నిజానికి మైండ్ బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ స్టేషనే కాదు... ఒక ప్రొజెక్షన్ మెషిన్లా కూడా పనిచేస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలను పరిసరాలపై, పరిసరాల్లో ఉన్న మనుషులపై ప్రొజెక్ట్ చేస్తుంది. వాటినే మనం భ్రమలు అంటాం. తొలగిపోతాయిలే అని ఆశిస్తాం. కానీ... ఇదొక రుగ్మత. స్కీజోఫ్రీనియా...! ఇట్ నీడ్స్ ట్రీట్మెంట్!! లక్ష్మి ఈమధ్యే పెళ్లిచేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తింటి వాళ్లకు ఊళ్లో కాస్త మంచి పేరే ఉంది. గౌరవప్రదమైన వ్యక్తులు, సాత్వికులూ అనే ప్రతీతీ ఉంది. అందుకే వారికి పిల్లనిచ్చినందుకు లక్ష్మి వాళ్ల పుట్టింటివాళ్లూ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే పెళ్లయిన కొద్దిరోజుల్లోనే లక్ష్మి తన అత్తింటివారి మీద ఆరోపణలు మొదలుపెట్టింది. తన అత్త, ఆడపడుచూ, భర్త కలిసి తనను వేధిస్తున్నారనీ, తనను వదిలించుకోడానికి కుట్రలు పన్నుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఊళ్లోవాళ్లూ చాలా ఆశ్చర్యపోయారు... లక్ష్మి అత్తింటివాళ్లు ఇలాంటివారా అని! పరువూ, ప్రతిష్టా దెబ్బతినడంతో లక్ష్మి భర్త తరఫువారు బాగా కుంగిపోయారు. వాళ్లకు కాస్తోకూస్తో పలుకుబడి ఉండటంతో తాము ఒత్తిడికి లొంగిపోయామనే అపవాదు రాకుండా ఉండేందుకు పోలీసులు నిందితుల పట్ల చాలా కఠినంగానే వ్యవహరించారు. చాలా పకడ్బందీగా దర్యాప్తు జరిపారు. కానీ ఎంతగా ప్రయత్నించినా లక్ష్మి ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలూ దొరకలేదు. దర్యాప్తు అధికారి అయిన సీఐ రవికి సైకాలజీలో పీజీ ఉంది.అన్ని రకాల దర్యాప్తులూ అయిన తర్వాత సీఐ రవి తన ఫ్రెండ్ అయిన సైకియాట్రిస్టును లక్ష్మితో మాట్లాడించాడు. రవి అనుమానమే నిజమైంది. లక్ష్మి ఒక మానసిక వ్యాధితో బాధపడుతోంది. లక్ష్మికి ఉన్న మానసిక సమస్య కారణంగా ఆమె కొన్ని భ్రాంతులకు లోనవుతోంది. ఆ భ్రాంతులను కల్పించే ఆ విచిత్రమైన వ్యాధి పేరు... స్కీజోఫ్రీనియా. స్కీజోఫ్రీనియా అంటే... అంతకు మునుపు సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రవర్తన అకస్మాత్తుగా అంతుపట్టని విధంగా మారిపోతుంది. భ్రాంతులకు లోనవుతూ ఉంటాడు. పొంతన లేని ఆలోచనలు వేధిస్తుంటాయి. తార్కికతకు అందని ఊహలు చేస్తుంటాడు. ఆలోచనల్లో అన్వయం ఉండదు. ఈ స్థితి కనీసం నాలుగువారాలు కొనసాగుతుంది. ఇది స్త్రీపురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. అయితే వ్యాధి వచ్చే వయసు మాత్రమే వేరుగా ఉంటుంది. పురుషుల్లో అది 16 నుంచి 21 ఏళ్ల మధ్య వస్తే... మహిళల్లో 21 నుంచి 23 ఏళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కొంత అసాధారణమైన వ్యాధి అనుకుంటారు. కానీ ప్రతి 100 మందిలో దాదాపు నలుగురు స్కీజోఫ్రీనియా రోగులు ఉంటారని ఒక అంచనా. అంత సాధారణమైనదీ వ్యాధి. లక్షణాలు : ఈ కింది లక్షణాలు కనీసం నెల రోజులపాటు ఉంటే... అవి స్కీజోఫ్రీనియా అనే వ్యాధి కారణంగా కలుగుతున్నవని భావించవచ్చు. డెల్యూజన్స్ (అవాస్తవికమైన నమ్మకాలు) : ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని వాస్తవం కాని వాటిని నమ్ముతుంటారు. మిగతావారు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా, ఎన్ని రుజువులు చూపినా తమ నమ్మకాలను వారు విడువరు. అయితే ఆరోగ్యవంతులకు అవి భ్రాంతులన్న మాట ఎంత వాస్తవమో... మెదడులో వచ్చే మార్పుల కారణంగా వ్యాధిగ్రస్తులకు అవి వాస్తవమని నమ్మేలా ఉండటమూ అంతే వాస్తవం. అందుకే వ్యాధిగ్రస్తుల వాదనను ఓపికగా అంగీకరించాలి తప్ప... మనదే వాస్తవం అనే ధోరణితో వారి భ్రాంతులను కొట్టిపారేయకూడదు. వాళ్ల నమ్మకాలు సైతం చాలా రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు వాటిలో కొన్ని... ∙తన భర్త లేదా తన భార్య వేరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నట్లు నమ్ముతుంటారు. దీన్నే డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటారు. ∙కొంతమంది వ్యక్తులు తనకు హాని కల్పించడానికో లేదా చంపడానికో ప్రయత్నిస్తున్నారని నమ్ముతుంటారు. (ఉదాహరణకు తన అత్తింటివారు తన కాపురం చెడగొట్టడానికీ, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మి నమ్మినట్లుగా). ఈ భ్రాంతిని డెబ్యూజన్ ఆఫ్ పెర్స్కూజన్ అంటారు. ∙తనను చాలా చెడ్డగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, తన ప్రతిష్టను దిగజార్చడానికి, తనను ఉద్దేశించే అందరూ మాట్లాడుకుంటున్నారని భ్రాంతి చెందడాన్ని డెల్యూజన్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ∙ఇక కొందరి భ్రాంతులు మరీ విచిత్రంగా ఉంటాయి. కొందరు చిప్స్ వంటి ఉపకరణాల ద్వారా లేదా కొన్ని యంత్రాల ద్వారా తన ఆలోచనలను తెలుసుకుంటున్నారనీ, రేడియోలోలా తన ఆలోచనలు వారికి ప్రసారమవుతున్నాయనే భ్రాంతితో ఉంటారు. దీన్ని ‘థాట్ బ్రాడ్కాస్ట్’ అంటారు. అయితే ఈ భ్రాంతి రెండు విధాలుగా ఉంటుంది. తన ఆలోచనలను తన మెదడు నుంచి తీసేస్తున్నారని భ్రాంతి చెందడాన్ని ‘థాట్ విత్‌డ్రావల్’ గా పేర్కొంటారు. వేరే వ్యక్తుల ఆలోచనలను తన మెదడులో పెడుతున్నారని భ్రాంతి చెందడాన్ని ‘థాట్ ఇన్సెర్షన్’ అంటారు. సాధారణంగా ఒకరి ఆలోచనలు మరొకరికి చెబితే గానీ (కమ్యూనికేట్ చేస్తేగానీ) తెలియవు. అలా తెలిసిపోతున్నట్లు భావించడాన్ని ‘లాస్ ఆఫ్ ఇగో బౌండరీస్’ అని వ్యవహరిస్తారు. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏది ఉన్నా... వాటి ఆధారంగా ఒక వ్యక్తి స్కీజోఫ్రీనియా తో బాధపడుతున్నాడని నిర్ధారణ చేయవచ్చు. ∙మరికొందరైతే తమను చంపడానికి ఎవరో చేతబడి చేస్తున్నట్లు బలంగా నమ్ముతుంటారు. ఇలాంటి నమ్మకాలతో పల్లెల్లో ఎందరిపైనో అభియోగాలు మోపి, కొందరిని మంత్రగాళ్లుగా చెప్పి వారి పళ్లు పీకేయడం, ఒక్కోసారి చంపేయడం జరుగుతుంటుంది. ∙తాను మనిషి రూపం నుంచి జంతువుగా మారిపోతున్నట్లు ఇంకొందరు భ్రాంతి చెందుతారు. ఇలాంటి భ్రాంతులను ఇంగ్లిష్‌లో హేల్యూసినేషన్స్ అంటారు. ఇలాంటి హేల్యూసినేషన్స్ కొందరిలో మరికొన్ని రూపాల్లోనూ కనిపిస్తుంటాయి. అవి... ∙తన చుట్టూ ఎవరూ లేకపోయినా... రోగికి కొందరు మనుషులు కనిపిస్తుంటారు. అలా ఎవరైనా లేదా ఏదైనా కనిపించడాన్ని విజువల్ హేల్యూసినేషన్స్ అంటారు. అదే ఎవరికీ వినిపించని మాటలు తమకే వినిపించడాన్ని ఆడిటరీ హేల్యూసినేషన్స్ అంటారు. ఎవరికి తెలియని వాసనలు తమకే తెలియడాన్ని ఆల్ఫాక్టరీ హేల్యూసినేషన్స్ అంటారు. ∙కొందరు రోగుల్లోనైతే... ఇతరులను కొట్టమనీ లేదా తమను తాము హింసించుకొమ్మని లేదా ఆత్మహత్య చేసుకొమ్మనే మాటలు తమను శాసిస్తున్నట్లుగా వినిపిస్తాయి. కాబట్టి వాటిని కమాండింగ్ హేల్యూసినేషన్స్ అంటారు. ఇలాంటి ఎడతెగని ఆలోచనలు భ్రాంతులతో రోగి భావోద్వేగాలలో/ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఎంతో భయపడడం, ఏడ్వడం, కారణం లేకుండానే నవ్వడం, ఒక్కసారిగా కోపం రావడం, చిరాకు పడడం వంటివి చూస్తాం. ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించవచ్చు లేదా ఇతరులకూ హాని కల్పించవచ్చు. అందుకే వీరికి తక్షణ చికిత్స అవసరం. ఎందుకు వస్తుందీ వ్యాధి... స్కీజోఫ్రీనియా వ్యాధి మెదడులోని కొన్ని రసాయనాల్లో మార్పుల కారణంగా వస్తుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం స్కాన్ వంటి పరీక్షలు నిర్వహిస్తే... మెదడులో ఎలాంటి మార్పులూ కనిపించకపోవచ్చు. అయితే వ్యాధి రావడానికి మరికొన్ని అంశాలూ దోహదం చేయవచ్చు. జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధి వచ్చేలా ప్రభావితం చేస్తాయని కొందరి ప్రతిపాదన. అయితే ఈ హైపోథెసిస్ను బలపరిచే ‘స్కీజోఫ్రీనియా జీన్’ని ఇంతవరకూ ఎవరూ గుర్తించలేదు. కాకపోతే అనువంశీకంగా కనిపించవచ్చు. అదెలాగంటే... తాత–ముత్తాతల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు... ఇది వచ్చే రిస్క్ 3 శాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరిలో ఏ ఒక్కరికైనా ఇది ఉంటే... వారి సంతానానికి ఇది వచ్చే రిస్క్ 10 శాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరికీ ఈ వ్యాధి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 40 శాతం ఉంటుంది. ఇక దీనితో పాటు గర్భధారణ, ప్రసవం వంటి సందర్భాల్లో ఏవైనా అవాంతరాలు (కాంప్లికేషన్లు) వచ్చినవారిలోనూ, బాల్యంలో పిల్లల వికాసంలో లోపాలు ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే వారు, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారిలో ఆయా అంశాలు ఈ వ్యాధిని ప్రేరేపించవచ్చు. అయితే అంత మాత్రాననే దగ్గరివారిలో లేదా తల్లిదండ్రులలో ఈ వ్యాధి ఉంటే అది తప్పక రావాలనే నియమమేదీ లేదు. కాకపోతే వచ్చే అవకాశాలు కొంత ఎక్కువ. చికిత్స వ్యాధి ఎంతవరకూ నయం అవుతుందనే విషయం రోగి వయసు, అతడిలో వచ్చే ప్రతికూల ఆలోచనలు, కుటుంబం ఎంతమేర సపోర్ట్‌గా నిలుస్తోంది వంటి అంశాలతో పాటు ‘రోగికి లక్షణాలు కనిపించిన తరువాత ఎంత కాలంలోపు వైద్య చికిత్సకు తీసుకువెళ్లారు’ అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. వ్యాధి కలిగిన తొలి దశలోనే (నెల నుండి సంవత్సరంలోపు) వైద్యుని సంప్రదించినప్పుడు వ్యాధి నయమయ్యే అవకాశం బాగుంటుంది. అంటే ఎంత త్వరగా వైద్యుణ్ణి కలిస్తే బాగయ్యే అవకాశాలు అంత ఎక్కువ అన్నమాట. కాబట్టి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. మందులు క్రమం తప్పక వాడాలి : సైకియాట్రిస్ట్ చెప్పేవరకు రోగి మందుల్ని క్రమం తప్పక వాడటం ముఖ్యం. సాధారణంగా వ్యాధి లక్షణాలు మొదటిసారి కలిగినప్పుడు 9 నెలల వరకూ మందులు వాడతారు. ఎందుకంటే మొదటి 6 నెలల్లో మందులు వాడనప్పుడు వ్యాధి తిరగబెట్టే అవకాశం 70 శాతం వరకు ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు ఈ వ్యాధి ఉన్నవారిలో మాత్రం కనీసం 5 సంవత్సరాల నుంచి జీవితకాలం వరకు మందులు వాడవలసి ఉంటుంది. మందులకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగితే వైద్యుని సంప్రదిస్తే వాటిని మారుస్తారు.. ఈ వ్యాధి కోసం వాడే మందులు నిద్రమాత్రలు కావు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి జబ్బులకు సైకియాట్రీలో నిద్రమాత్రలు వాడుతుంటారని చాలామంది అపోహ పడుతుంటారు. అందుకే కొందరు ఇలాంటి లక్షణాలు కనిపించినా తమ అపోహలతో చికిత్స అందించరు. దాంతో అలా వైద్యం చేయకుండా విడిచిపెడితే వ్యాధి లక్షణాలు మెరుగుపడకపోగా, ఎక్కువకాలం వ్యాధితో బాధపడటం వలన మెదడులోని కణాలు నష్టపోయే అవకాశం ఉంది. అప్పుడు వైద్యంతో వ్యాధి నయం కావడం కష్టమవుతుంది. ఎలా గుర్తుపట్టాలంటే... ∙వ్యక్తిగత ప్రవర్తనలో/వ్యక్తిత్వంలో మార్పులు కనిపిస్తే ∙తనను నిత్యం ఎవరో గమనిస్తున్నట్లుగా ఫీలవుతుంటే ఎవరికీ వినపడని శబ్దాలు, సంగీతం తమకు వినిపిస్తున్నట్లుగా చెబుతుంటే ఎవరికీ కనిపించని దృశ్యాలు తమకు కనిపిస్తున్నాయంటూ చెబుతుంటే ∙అర్థం లేని పదాలను ఉచ్చరిస్తుంటే ∙తమకు ఇష్టమైన వారిని సందర్భం లేకుండా కోప్పడటం, వారిని అసహ్యించుకోవడం చేస్తుంటే ∙నిద్రలేకుండా గడపుతుండటం లేదా విపరీతంగా ఆవేశపడుతుంటే. డాక్టర్ ఐ. భరత్‌కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
తమ వారే అనుకుని వేరొకరికి అంత్యక్రియలు
అన్నానగర్: తంజావూరు జిల్లా తిరుభువనం తోప్పు వీధికి చెందిన రామచంద్రన్ ఎలక్ట్రీషియన్. ఇతని భార్య ఆషా (40). వీరికి విఘ్నేష్ (22) అనే కుమారుడు ఉన్నాడు. ఆషాకి మానసిక వ్యాధి ఏర్పడిన స్థితిలో గత 13 సంవత్సరాలకు ముందు రామచంద్రన్ విడాకులు పొందాడు. అనంతరం ఇంకొక మహిళను వివాహం చేసుకుని కుమారుడు విఘ్నేష్‌తో నివసిస్తున్నాడు. గత నెల 26న కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ చికిత్స ఫలించక మృతి చెందింది. దీనిపై పోలీసులు విచారణ చేశారు. ఇందులో మృతి చెందింది తిరుభువనానికి చెందిన ఆషా అని నిశ్చయించి మృతదేహాన్ని ఆమె కుమారుడు విఘ్నేష్‌కు అప్పగించారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు చేశాడు. ఈ స్థితిలో సోమవారం తిరుభువనం దుకాణ వీధిలో ఆషా తిరుగుతున్నట్లు గుర్తించిన తెలిసిన వారు వెంటనే ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వచ్చి ఆమెను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. -
గట్టిగా అరిస్తే నిద్ర పడుతుంది: సీఎం
సాక్షి, అమరావతి: అందరూ ఆనందంగా ఉండేందుకు ‘హ్యాపీ సండే’పెట్టానని.. రోడ్ల మీద డ్యాన్సులు వేస్తుంటే చూస్తూ ఆనందించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. లేకపోతే ఇంట్లో నుంచి బయటికొచ్చి గట్టిగా కాసేపు అరిచి.. ఇంటికెళితే మంచిగా నిద్రపడుతుందని ఆయన సూచించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో హెల్త్ బులెటిన్ ఆవిష్కరణ, పలకరింపు కార్యక్రమ పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) కింద ఎన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టినా.. ‘ఆరోగ్యం’లో రాష్ట్రం ఇంకా 8వ స్థానంలోనే ఉందని పేర్కొన్నారు. ఆర్థరైటిస్, ఆస్తమా, మధుమేహం, హైపర్ టెన్షన్ తదితర జబ్బులతో బాధ పడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పారు. మానసిక జబ్బులు కూడా తీవ్రంగా పెరిగాయని.. ఇది మంచిది కాదన్నారు. ప్రతినెలా హెల్త్ బులెటిన్ ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? అనేది అవగాహన వస్తుందన్నారు. చాలా మంది మరుగుదొడ్డి కట్టుకోలేదు గానీ.. సెల్‌ఫోన్ కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ పద్ధతి సరికాదన్నారు. తనకు ఉంగరం గానీ, గడియారం గానీ లేవని సీఎం చెప్పుకొచ్చారు. చాలామంది బంగారం, డైమండ్ వంటి ఆభరణాలు పెట్టుకొని ఆనందం పొందాలనుకుంటున్నారని.. కానీ దాని వల్ల ఆనందం రాదన్నారు. అనారోగ్య సమస్యలున్న డాక్టర్లకు ఆరోగ్య సూచనలిచ్చే అర్హత లేదని తేల్చిచెప్పారు. ఈనెల 5 నుంచి 30వ తేదీ వరకూ ‘పలకరింపు’కార్యక్రమం ద్వారా ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టనున్నట్టు చెప్పారు. 57 వేల మందికి పైగా సిబ్బంది 1.22 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ‘పలకరింపు’కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మాన'సెల్ఫీ'క రోగం
సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ.. ఈ మధ్య ఎక్కడ చూసినా సెల్ఫీల పిచ్చి పట్టుకుంది అందరికి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో పెట్టడం. చిన్నపెద్ద అనే తేడా లేదు.. సందర్భం ఏదైనా సెల్ఫీ తీసుకోవడం మాత్రం సర్వసాధారణామైంది. ఎప్పుడో ఒకసారి దిగితే ఫర్వాలేదు కానీ, కొంతమంది అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటారు. ఇలాంటి వారిని మానసిక రోగులుగా భావిస్తామంటున్నారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు మార్క్ డి గ్రిఫిత్స్, జనార్థనన్ బాలకృష్ణన్. అతిగా సెల్ఫీలు దిగే వారిని ‘సెల్ఫిటీస్’గా 2014లో ఓ వార్తా పత్రికా పేర్కొంది. ఆ పదంలో నిజాన్ని నిర్ధారించడానికి, అలాంటి స్వభావం ఉన్న వారిని గుర్తించడానికి 400 మంది భారతీయుల ప్రవర్తనను వీరు పరిశీలించారు. ‘సెల్ఫిటీస్ బిహేవియర్ స్కేల్’ ద్వారా మూడు రకాలుగా విభజించారు. మొదటి రకం వారు రోజులో 3 సెల్ఫీలు దిగుతారు. కానీ, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయరు. రెండో రకం వారు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. మూడో రకం దారుణం రోజులో ప్రతి చిన్న సందర్భానికి సెల్ఫీ దిగి అదే పనిగా పోస్ట్ చేస్తారు. ఒక రోజులో వీరు కనీసం 6 సెల్ఫీలు దిగి, పోస్ట్ చేస్తారు. ఇలా అతిగా సెల్ఫీలు దిగే వారు మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని సైక్రియాట్రిస్ట్లు అభిప్రాయపడుతున్నారు. వీరిలో కొంత మందిని ఈ విషయంపై ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు తమకు తాము చాలా పాపులర్‌గా భావించుకుంటామన్నారు. సెల్ఫీ దిగకుండా, పోస్ట్ చేయకుండా ఉంటే తాము తమ తోటి వారితో సంబంధాలను కోల్పోయినట్లు భావిస్తామని మరికొంత మంది సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఈ పరిస్థితిలో ఉన్నవారు ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతుంటారు. వారి చుట్టుపక్కల ఉన్నవారితో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి వ్యసనంలా మారుతుంద’ని బాలకృష్ణన్ అన్నారు. -
‘ట్రంప’రితనం... మానసిక వ్యాధా?
‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చెబుతున్నాడు...తన డెస్క్‌పై న్యూక్లియర్ బటన్ ఎప్పుడూ ఉంటుందని. ఆకలితో అల్లాడుతున్న ఆ దేశపు వాళ్లెవరైనా ఆయనకు చెప్పండి...నా దగ్గరా అంతకన్నా పెద్దది, శక్తిమంతమైన బటన్ ఉందని’... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. చూసిన వెంటనే ‘నా చాక్లెట్ నీ కంటే పెద్దది’ అంటూ గొప్పలు పోయే చిన్న పిల్లల పోరుగుర్తుకు తెప్పిస్తుంది కదూ! అగ్రదేశాధినేత ఈ రకమైన ట్వీట్లు పెట్టడం ఆయన మానసిక స్థితిపై సందేహాలు రేకెత్తిస్తోంది. పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వైఖరే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయం సైకియాట్రీ అధ్యాపకురాలు బ్రాండీ ఎక్స్ లీ... ట్రంప్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదనీ, ఆయన అధ్యక్షుడిగా కొనసాగడం మంచిది కాదంటూ అమెరికా ఎంపీలకు ఓ ప్రెజంటేషన్ ఇచ్చారు. ట్రంప్ ట్వీట్లు చెప్పే ఆయన మానసిక పరిస్థితిపై ప్రత్యేక కథనమిది. నన్ను మించిన వాడు లేడు... నేనే అందరికంటే గొప్పవాణ్ని...ఎలాంటి సమస్యనైనా నేను ఒక్కడినే సరిచేయగలను... డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు చూస్తే ఈ లక్షణాలు మెండుగా కనిపిస్తాయి అంటారు రాచెల్ మోంటగోమరి. అధ్యక్షుడిగా ట్రంప్ చేసిన దాదాపు 34 వేల ట్వీట్ల ఆధారంగా ఆయన మానసిక స్థితిని విశ్లేషిస్తూ రాచెల్ ఓ పుస్తకం రాశారు. ఈ భూమ్మీద తనకు తెలియని విషయమే లేదని ట్రంప్ నమ్ముతారు. నడత, చదువు, వ్యవహారశైలి వంటి విషయాలపై ఈయ న పెట్టే శ్రద్ధ తదితర లక్షణాలను పరిశీలిస్తే వాస్తవం ఆయన నమ్మకానికి భిన్నమ ని ఇట్టే అర్థమైపోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో... ట్రంప్ మూడంటే మూడే నిమిషాల వ్యవధిలో తనకు 20 సబ్జెక్టుల్లో గొప్ప జ్ఞానముందని డబ్బా కొట్టుకోవడాన్ని రాచెల్ ప్రస్తావించారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సందర్భం లోనూ విదేశీ వ్యవహారాలపై మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు? అన్న ప్రశ్న వేస్తే ట్రంప్ ఇచ్చిన సమాధానం.. ‘‘నాతో నేనే మాట్లాడుకుంటా. ఎందుకంటే నా బుర్ర బాగా పనిచేస్తోంది కాబట్టి’’ అని! సంఘ వ్యతిరేక లక్షణాలు.. పొలిటీఫ్యాక్ట్ అని ఓ వెబ్సైట్ ఉంది. అమెరికా నేతలు చేసే కామెంట్లు.. అందులోని వాస్తవికతలను ప్రజల ముందు పెట్టే వెబ్సైట్ ఇది. దీని అంచనా ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్లలో 76 శాతం అబద్ధాలే. ఇంకా ఈ వెబ్సైట్ ఏం చెప్పిందంటే.. ప్రతి మూడు నిమిషాల 15 సెకన్లకు ట్రంప్ ఓ అబద్ధం చెబుతున్నాడట. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే.. అబద్ధాలు చెప్పడం... ఇతరులను వాడుకోవడం, ఇతరుల హక్కులను ఏమాత్రం ఖాతరు చేయకపోవడం.. తన వల్ల ఇతరులకు హాని కలిగినా కాసింత కూడా పశ్చాత్తాపం, సానుభూతి చూపకపోవడం వంటి లక్షణాలన్నీ సంఘ వ్యతిరేక వ్యక్తిత్వ లక్షణాలుగా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి! న్యూయార్క్‌టైమ్స్ కథనం ప్రకారం ఫ్రాంక్ లంట్జ్ అనే వ్యక్తి ట్రంప్‌ను ‘మీరెపుడైనా తన తప్పులకు మన్నించమని దేవుడిని అడిగారా?’ అని అడిగితే లేదని సమాధానమివ్వడాన్ని బట్టి ట్రంప్ వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోతోంది! నిత్య శంకితుడు.. ప్రతిదాన్నీ అనుమానపు దృష్టితో చూడటం...ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందని నమ్మే రకాల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన ప్రకటనలు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అమెరికా ఎన్నికల్లో రష్యా పరోక్షంగా వేలు పెట్టిందని నిఘా వర్గాలు కోడై కూస్తే.. దాన్ని కొట్టిపారేయడం వీటిల్లో ఒకటి మాత్రమే. మొత్తమ్మీద ఎన్నికల సమయంలో ఈయనగారు ఇలాంటి కుట్ర కథనాలు దాదాపు 48 వరకూ ప్రకటించారని అంచనా. అధ్యక్షుడయ్యాక ఇవి ఏమైనా తగ్గాయా? అంటే.. ఇంకా పెరిగాయనే చెప్పాలి. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా.. తన ట్రంప్ టవర్లోని ఫోన్లు ట్యాప్ చేశాడన్న ఆరోపణ కూడా చేశారు. నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రతిదాన్ని అనుమానపు దృష్టితో చూస్తారనేందుకు ఇంతకంటే వేరే నిదర్శనాలు అవసరం లేదేమో! శాడిజం పాళ్లూ ఎక్కువే... ట్రంప్ ట్వీట్ల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన రాచెల్ అంచనా ప్రకారం..ట్రంప్‌లో శాడిజం పాళ్లూ ఎక్కువే. తనతో ఏకీభవించని వారిని ట్వీట్లలో హేళన చేస్తూ మాట్లాడటం ట్రంప్‌కు అధ్యక్షుడు కాకముందు నుంచీ అలవాటే. తన కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన పౌరుడిని ఉద్దేశించి..‘వాడి మొహం మీద గుద్దు గుద్దాలని ఉంది’ గతంలో ట్రంప్ అన్నారనీ, తన వైఖరిపై నిరసన తెలిపేవారిని సూట్ లాగేసి చల్లటి వాతావరణంలోకి వదిలేయాలనడం, ‘మా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్లం’ అని పళ్లు ఇకిలించడం ట్రంప్‌కే చెల్లిందని రాచెల్ అన్నారు. ట్రంప్ ఎదుటివారి బాధలో తన ఆనందాన్ని వెతుక్కుంటాడని ఆమె చెప్పారు. సీఎన్ఎన్ న్యూస్‌తోపాటు చాలామందిని బాక్సింగ్ గ్లోవ్స్‌తో పంచ్ చేస్తున్న ఫొటోలు పెట్టే తత్వం ఇంతకంటే భిన్నంగా ఉంటుందని అనుకోలేం కదా? – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆలస్యంగా నిద్రిస్తే పిచ్చెక్కే ప్రమాదం!
లండన్ : ఆలస్యంగా నిద్రపోవడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అర్ధరాత్రి దాటేదాకా టీవీలు, స్మార్ట్ఫోన్లతో గడిపి ఆ తర్వాత ఎప్పటికో పడుకోవడం.. తెల్లారి ఆలస్యంగా నిద్రలేచి హడావుడి పడడమూ నిత్యకృత్యమే! ఇలా ఆలస్యంగా నిద్రించేవాళ్లకు పిచ్చెక్కే ప్రమాదం ఉందని బ్రింగ్హాటన్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిద్ర చాలకపోతే అనారోగ్యాలు పాలయ్యే ప్రమాదం ఉందనే విషయం తెలిసిందే! దీంతోపాటు హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు, మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని తెలిపారు. ఈమేరకు మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 మందిని వర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది. ఈ అధ్యయనంలో వాళ్ల మానసిక అనారోగ్యానికి కారణం నిద్రలేమి అని తేలిందట! ఇక నిద్రలేమితో ఎదురయ్యే ఇతర అనారోగ్యాలు.. రాత్రి సరిగా నిద్రించకపోతే ఉదయం లేవగానే చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, హింసాత్మక ఆలోచనలు, భయం లేకపోవడం, పొంతనలేని వాగుడు, ఆత్మహత్య ఆలోచనలూ చేస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. -
యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: యాసిడ్ దాడి బాధితులు, మానసిక వికలాంగులు, ఆటిజంతో బాధపడుతున్న వారు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ పొందే అవకాశాలున్నాయి. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం(డీఓపీటీ) బుధవారం విడుదల చేసిన ముసాయిదా విధానంలో... దివ్యాంగులకు ఉద్యోగాలు, పదోన్నతుల్లో కోటా, వయో పరిమితిలో సడలింపులను ప్రతిపాదించింది. దివ్యాంగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలన్న అంశం సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నందున తాజా చర్యకు అడ్డంకులు ఏర్పడే సూచనలూ కనిపిస్తున్నాయి. దివ్యాంగులకు కేటాయించిన ఖాళీల్లో ఐఏఎస్ అధికారుల కార్యాలయ సహాయకుల పోస్టులున్నాయి. డైరెక్ట్ నియామక ప్రక్రియలో ఏ,బీ,సీ,డీ గ్రూపులలోని మొత్తం ఖాళీల్లో నిర్దేశిత అంగవైకల్యం ఉన్న వారికి 4 శాతం కేటాయిస్తారని డీఓపీటీ తెలిపింది. అలాగే యాసిడ్ దాడి బాధితులతో పాటు ఆటిజం, మానసిక వికలాంగులు, దృష్టి, వినికిడిలోపం(సంయుక్తంగా) ఉన్నవారికి 1 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదించారు. పదోన్నతులకు సంబంధించి గ్రూప్ డీ, సీలోని మొత్తం ఖాళీల్లో ప్రామాణిక అంగవైకల్యం ఉన్న వారికి 4 శాతం కేటాయిస్తారు. అంగవైకల్యం 40 శాతం కన్నా తక్కువ ఉన్న వారే ఈ రిజర్వేషన్లకు అర్హులని ముసాయిదా విధానంలో పేర్కొన్నారు. వయో పరిమితి సడలింపు 10–13 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. -
పదేళ్లుగా చీకటి గదిలోనే
మానసిక వ్యాధితో బాధపడుతున్న యువకుడు సింధనూరు టౌన్ : పదేళ్లుగా చీకటి గదిలోనే గడిపిన ఓ యువకుని ఉదంతం తాలూకాలోని తిప్పనహట్టి సమీపంలోని కల్యాణ హుడేవ్ గ్రామంలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దొడ్డనగౌడ, బసమ్మ దంపతుల పెద్ద కుమారుడు బసవరాజ్ పదేళ్లుగా మానసిక అస్వస్థతతో బాధపడుతూ ఇహలోకంలోని అన్ని భావాలను కోల్పోయాడు. ఎవరైనా మాట్లాడిస్తే కోపోద్రిక్తుడై ప్రతిస్పందించేవాడు. అతనిని పలు చోట్ల చూపించగా, నయం కాకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులు చీకటి గదిలో బంధీ చేశారు. ఈ విషయంపై బసవరాజ్ తల్లి బసమ్మను సంప్రదించగా, చెట్టంత కొడుకు ఇలా కావడం తనను ఎంతో బాధిస్తోందని వాపోయింది. చుట్టుపక్కల వారు ఈసడించుకోవడం కన్నా తన కుమారుడు గదిలో బంధీ కావడమే మేలని, అన్నింటికీ ఆ భగవంతునిపైనే భారం వేశానన్నారు. ఇదిలా ఉండగా గురువారం సీనియర్ ఆరోగ్య సహాయకుడు రంగనాథ గుడి తిప్పనహట్టి గ్రామాన్ని సందర్శించి ఆ యువకుడి కుటుంబంతో చర్చించారు. కుటుంబ సభ్యులు సహకరిస్తే బసవరాజ్‌ను తమ శాఖ తరఫున రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తామని బసవరాజ్ తల్లికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. -
భర్తే హంతకుడు
సుపారి ఇచ్చి... భార్యను చంపించిన ఎస్ఐ సహకరించిన హతురాలి తల్లి మిస్టరీ వీడిన ప్రపుల్లా హత్య కేసు తుమకూరు : హత్య కేసులు చేధించి బుర్ర పండిపోయింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న తన సొంత భార్యను హతమార్చేందుకు ఎస్ఐ ఏకంగా ఆమెను అడ్డు తొలగించుకోడానికి సుపారీ ఇచ్చి ఎలా హత్య చేయాలో కూడా వారికి పథక రచన చేశాడు హొసదుర్గ ఎస్ఐ గిరీష్. ఈ కేసును పోలీసులు చేధించి ఎస్ఐతో పాటు నిందితుడు చిదానంద, ప్రపల్లా తల్లి మహదేవమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్తీక్‌రెడ్డి శనివారం మీడియాకు వివరించారు. ఎస్ఐ గిరీశ్‌కు గుబ్బి తాలూకా సంగోనహళ్లికి చెందిన ప్రపుల్లా(26)తో ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. మానసిక వ్యాధితో బాధపడుతున్న ప్రపుల్లా తరచూ ఇంటిలో గొడవపడేది. ఇష్టానుసారంగా ప్రవర్తించేది. దీంతో భార్యభర్తల సఖ్యత కొరవడింది. ప్రపుల్లాను అడ్డు తొలగించుకోవడానికి గిరీష్‌తో పాటు ప్రపుల్లా తల్లి మహాదేవమ్మ సైతం తన కుమార్తెను హత్య చేయడానికి సహకరించిందని ఎస్పీ చెప్పారు. రెండు నెలలకు ముందే బంధువుల ఇంటిలో ప్రపుల్లాను హత్య చేయాలని గ్రామ పంచాయతీ సభ్యుడు చిదానందకు సుపారీ ఇచ్చారు. ఈ మేరకు రూ. 50 వేలు చెల్లించారు. వాహనంతో ఢీకొట్టైనా లేదా హత్య చేసి చంపాలని గిరీష్ చిదానందకు సలహా ఇచ్చాడు. చిదానంద గిరీష్ కుటుంబానికి మొదటి నుంచే పరిచయం ఉంది. ఇదిలా ఉంటే ఈనెల 4న గిరీష్ చిదానందకు ఫోన్ చేసి ఎలా హత్య చేయాలో ఫోన్లో వివరించాడు. అదే పథకం ప్రకారం చిదానంద వేట కొడవలి తీసుకుని ద్విచక్ర వాహనంలో ప్రపుల్లా ఇంటికి వచ్చాడు. కొద్ది సేపు అనంతరం రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి రమ్మని బలవంత పెట్టి వాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోయిందని చెప్పి డిక్కీలో ఉన్న వేటకొడవలి తీసుకుని తలపై పలుమార్లు నరికాడు. కొడవలిని పక్కనే ఉన్న పొదల్లో పడేసి వెళ్లాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో నిందితుడు అసలు విషయం వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. -
మనసు కడలిలో డిప్రెషన్
తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను చేసి కుంగదీసేవ్యాధి డిప్రెషన్. ఇదొక మానసిక వ్యాధి. ఇది వచ్చిన వారు జీవితంలో కుంగుబాటుకు గురవుతారు. డిప్రెషన్ వ్యాధి ఒక్కోసారి ఆత్మహత్యకు సైతం దారి తీయవచ్చు. నిజానికి చాలా ఆత్మహత్యలకు కారణం ఇదే. ప్రపంచంలో డిప్రెషన్ తీవ్రతకు ఉదాహరణ మన దేశమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం డిప్రెషన్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నది మన దేశంలోనే. ప్రతీ ఏడాదీ దాదాపు లక్షమందికి పైగానే డిప్రెషన్ వ్యాధి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి కేవలం బయటకు తెలిసిన గణాంకాలు మాత్రమే. ఇక డిప్రెషన్‌కు లోనయ్యే వ్యక్తుల పట్ల వివక్ష, దానికి లోనయ్యామంటూ చెప్పుకోలేకపోవడం వల్ల ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా. అందుకే వ్యాధికి గురైన వారిని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాలి. డిప్రెషన్ గురించి మాట్లాడాలి. ఆ అవగాహన కోసమే ఈ కథనం. ప్రపంచంలోని డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్న వారిలో 36 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. దాదాపు ప్రతి నలుగురు లేదా ప్రతి ముగ్గురిలో ఒకరు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు ఒక అంచనా. తీవ్రమైన కుంగుబాటు ధోరణి అన్నది డిప్రెషన్ అనే మానసిక వ్యాధి వల్ల అనే అవగాహన కూడా మన దగ్గర చాలా తక్కువ. ఇదొక మానసిక ధోరణిగానే అనుకుంటారు తప్ప చికిత్స తీసుకుంటే తగ్గే వ్యాధిగా భావించరు. దాంతో దీన్ని వ్యాధిగా గుర్తించకపోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలలో ఒకటైన ఆత్మహత్య భావనలు పెరిగి, వాటివల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు పెరుగుతున్నారు. అందుకే సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో మందులు తీసుకుంటే తగ్గే వ్యాధిగా దీన్ని గుర్తించడం అవసరం. అనారోగ్యభారం కలిగించే వ్యాధుల్లో నాలుగోది డిప్రెషన్... అనారోగ్య భారం వల్ల నష్టపోతున్న జీవితకాలాన్ని లెక్కిస్తారు. దీన్ని ‘డిజేయబులిటీ అడ్జెస్టెడ్ లైఫ్ ఇయర్స్’’ (డైలీస్) అని వ్యవహరిస్తారు. ఈ అనారోగ్య భారం ఎంత కాలం ఉందనే అంశంపై అతడు ఆరోగ్యంగా జీవించిన కాలాన్ని లెక్కేస్తారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితకాలం 80 ఏళ్లు అనుకుంటే అందులో పదేళ్ల పాటు ఏదో ఒక వ్యాధి వల్ల అతడి బతుకు భారం అయిపోతే, అతడు వాస్తవంగా ఆరోగ్యంగా జీవించింది 70 ఏళ్లేనని లెక్క. ఇలా జీవితంలో అనారోగ్యభారాన్ని కలిగిస్తున్న వ్యాధుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డిప్రెషన్ నాలుగో స్థానంలో ఉంది. 2020 నాటికి ఇది రెండో స్థానానికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. డిప్రెషన్‌కు కారణాలు మెదడులోని కొన్ని రసాయనాలు, న్యూరల్ సర్క్యుట్స్లో మార్పులు చోటు చేసుకోవడం కొన్ని జన్యుపరమైన కారణాలు డిప్రెషన్‌కు గురయ్యే ఆరోగ్య చరిత్ర ఉన్న కుటుంబంలో అనువంశికంగా కనిపించడం జీవనశైలిలో మార్పులు చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం వంటివి డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఒక్కోసారి ఈ కారణాలు మెదడులోని రసాయన మార్పులకు, న్యూరల్ సర్క్యుట్ మార్పులకు కారణమవుతాయి. డిప్రెషన్‌కు గురైనప్పుడు మెదడులోని కణాల సంఖ్య, వాటి మధ్య నర్వ్ ఫైబర్స్‌కు ఉండే కనెక్షన్స్ తగ్గుతాయి. ఈ చర్యలు మెదడులోని హిప్పోక్యాంపస్, ఫ్రంటల్ లోబ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి. ఫలితంగా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే తగిన చికిత్స చేసినప్పుడు ఈ మార్పులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. డిప్రెషన్ చికిత్స మందులు, సైకోథెరపీ వంటి ప్రక్రియలు, మరికొన్ని ఆధునిక చికిత్సల ద్వారా డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే డిప్రెషన్‌నుంచి బయటపడేందుకూ, అది నయం అయ్యేందుకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీగా పేర్కొన షాక్ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇది ఒక మ్యాజిక్ చేసినంత ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లాగే ఈ షాక్ ట్రీట్మెంట్పైన కూడా చాలా అపోహలు ఉన్నాయి. అయితే షాక్ ట్రీట్మెంట్గా పేర్కొనే ఈ చికిత్సలో ఇచ్చే కరెంటు అస్సలు షాక్ కొట్టదు. ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఈ చికిత్సలో రోగికి అసలు కరెంట్‌షాక్ ఇచ్చారనే విషయం కూడా తెలియకుండా చేసే ఈ చికిత్స వల్ల ఎంతో మంది డిప్రెషన్ రోగులకు చికిత్స జరుగుతోంది. ప్రాణాలూ దక్కుతున్నాయి. ఇవి మరింత పెంచుతాయి... ఆల్కహాల్, ఓపియమ్, నిద్రమాత్రలు, ఇతర మాదకద్రవ్యాలు డిప్రెషన్‌ను మరింత పెంచుతాయి. అంతేగాక అప్పటికే డిప్రెషన్ ఉన్నవారు వీటికి అలవాటు పడే అవకాశం ఎక్కువ. వీటి మత్తులో పడి ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. డిప్రెషన్ - ఆత్మహత్యలు... డిప్రెషన్ ఉన్నవారిలో సుమారు 15% మంది ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది. డిప్రెషన్లో ఉన్నవారు ఆత్మహత్య గురించి మాట్లాడుతుంటే తేలిగ్గా తీసుకోకండి. ఇదే జరిగితే తక్షణం సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. డిప్రెషన్ కనిపించే అవకాశాలు వీరిలో ఎక్కువ ఒంటరిగా జీవిస్తున్నవారు విడాకులు తీసుకున్నవారు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు చిన్నతనంలోనే తల్లి/తండ్రిని కోల్పోయినవారు తీవ్రమైన ఒత్తిడికి గురైనవారు సమాజం నుంచి సహకారం (సోషల్ సపోర్ట్) లేనివారు తమకు అత్యంత ప్రియమైన వారు దూరం కావడం లేదా చనిపోవడం ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు లోనుకావడం కొందరిలో కనిపిస్తుంటుంది. డిప్రెషన్ - శరీరంపై ప్రభావం డిప్రెషన్ ప్రభావం మన రోగనిరోధక శక్తిపై ఉంటుంది. దాని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక శారీరక రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఎక్కువ. అలాగే శారీరక సమస్యలు ఉన్నవారిలో 30% మంది డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. గుండెజబ్బులు ఉన్నవారికి డిప్రెషన్ ఉంటే వాళ్లలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువ.డిప్రెషన్ ఉన్నవారికి డయాబెటిస్ వంటి సమస్యల చికిత్స మామూలు వారికంటే కఠినమవుతుంది. డిప్రెషన్‌కు తగిన చికిత్స లభించకపోతే మతిమరుపు (డిమెన్షియా) రావచ్చు. డిప్రెషన్ ఉన్నవారికి థైరాయిడ్, ఇతర హార్మోన్ సమస్యలు రావడం ఎక్కువ. పక్షవాతం, పార్కిన్సన్ డిసీజ్, తలకు గాయం, మెదడులో కణుతులు, మూర్ఛ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారిలో డిప్రెషన్ చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. డిప్రెషన్ ఉన్నవారిలో ఎముకల అరుగుదల, అస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు ఎక్కువగా రావచ్చు. మనం సాధారణంగా వాడే నొప్పి నివారణ మందులు (ఎన్ఎస్ఏఐడీ), బీపీ మందులు, గర్భనిరోధక మందులు, రక్తంలో కొవ్వుపాళ్లను తగ్గించే స్టాటిన్స్‌తో పాటు సల్ఫానమైడ్స్, స్టెరాయిడ్స్ వంటివి డిప్రెషన్‌ను కలగజేస్తాయి. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఇలాంటివి సొంతంగా వాడకూడదు. -
వివాహిత సజీవదహనం
కృష్ణాజిల్లా: మతి స్థిమితం లేని మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో మృతిచెందిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. కంకిపాడు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అర్జున్‌రావు, శ్రీలక్ష్మీ(36) భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం శ్రీలక్ష్మీ అనారోగ్యానికి గురై మతిస్థిమితం కోల్పోయింది. అప్పటి నుంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీకి బానిసైన మద్యం ప్రియులు
-
జ్ఞానం వికసించిన రోజు...
మే 4, సోమవారం బుద్ధపూర్ణిమ కొందరు ఆయన్ని గొప్ప తత్త్వవేత్తగా కొనియాడతారు. ఇంకొందరు సమాజాన్ని చక్కదిద్దిన సంస్కర్తగా శ్లాఘిస్తారు. ఆయనే పశువుల్లా, పాశవికంగా బతికే మానవులకు శాంతి, అహింస, కరుణ, దయ, జాలి, ప్రేమ, మైత్రి లాంటి ధర్మాల్ని ప్రబోధించిన బుద్ధుడు. క్రీస్తుకు 600 సంవత్సరాల పూర్వమే మనిషి నడవడికకు మెరుగైన దారి చూపిన మార్గదర్శి ఆయన. అంతటి మహనీయుడు మన దేశం నేలమీద పుట్టడం మనందరికీ గర్వకార ణం. ప్రపంచానికి శాంతి, అహింసల్ని ప్రబోధించిన దేశంగా భారతదేశం పొందిన కీర్తికి ఈ తథాగతుడే కారణం. బుద్ధుని బోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే. అజరామరాలే. వీటన్నింటిలో వెలకట్టలేనివి పంచశీల. బుద్ధుడు జ్ఞానానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో, అంతకు మించి శీలానికి ఇచ్చాడు. శీలం అనేది అందరికీ ఉండాల్సిన నైతిక గుణంగా భావించాడు. ప్రబోధించాడు. శీలం మన జీవన విధానమని చాటాడు. బుద్ధుడు చెప్పిన శీలం అంటే నైతిక జీవనమే. మనవల్ల ఇతరులెవరూ ఇబ్బంది పడని విధానమే శీలం. ఈ నైతిక జీవనం మనిషిని మానసిక రుగ్మతలకు దూరం చేస్తుంది. మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. నిజం చెప్పాలంటే పరిపూర్ణమానవుడిగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది. 1. పంచశీలలో ‘జీవహింస చేయను’ అనేది మొదటిది. స్వర్గసుఖం కోసం యజ్ఞాల్లో వేలాది జీవుల్ని బలివ్వడాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదు. రాజులు సాగించే అమానుషమైన జంతువేటల్ని వ్యతిరేకించాడు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది అని బోధించాడు. 2. రెండోది దొంగతనం గురించి, ‘పరుల సొమ్ము దొంగిలించను’ అని సాధారణంగా చెప్పుకుంటాం కానీ బుద్ధుడు దొంగిలించడమే కాదు, నీది కాని వస్తువుని, నీవు కష్టపడి సంపాదించని వస్తువుని, మరొకరు నీకు దానంగా ఇవ్వని వస్తువుని దారిలో దొరికినా తీసుకోకూడదు- అలా తీసుకున్నా అది పరుల సొమ్మును హరించడమే అన్నాడు. 3. మూడోది ‘అబద్ధాలు చెప్పను’ అనేది. దీనినే బుద్ధుడు ‘ముసావాద’ అన్నాడు. అంటే మోసపు మాటలు చెప్పను అని. ఎదుటి వారికి నష్టాన్ని కలిగించడం కోసమో లేదా తాను లాభం పొందడం కోసమో చెప్పే మోసపు మాటలు పలకరాదన్నాడు. 4. నాలుగోది కామానికి సంబంధించినది. సాధారణంగా స్త్రీ, పురుషుల శారీరక వాంఛల్ని కామం అంటాం. అయితే భార్యాభర్తల పవిత్ర సంబంధాన్ని బుద్ధుడు తప్పు పట్టలేదు. ‘కామదురాచారం’ మాత్రం కూడదని చెప్పాడు. కుటుంబ వ్యవస్థని గౌరవించాడు. 5. ఇక ఐదవది, మత్తుపానీయాలు, మత్తుని, ఉద్రేకాల్ని కలిగించే పదార్థాన్ని సేవించకూడదని చెప్పాడు. వీటివల్ల మనిషి తన విజ్ఞత కోల్పోయి, ఉచ్చనీచాలు ఎరుగని పశువులా ప్రవర్తిస్తాడని, ఎదుటివారికి ఇబ్బందికరంగా తయారవుతాడని ప్రబోధించాడు. ఈ ఐదు విషయాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే- నేరం, శిక్షలతో పనేముంటుంది? మనిషికి తప్పు చేసిన భావన ఎప్పుడూ కలుగదు. కాబట్టి సంతోషంగా, నిస్సిగ్గుగా, నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా బతకగలుగుతారు. అవాంతరాలకి, అవాంఛనీయ విధానాలకీ, అక్రమాలకీ తావులేని అందమైన ప్రపంచం రూపొందుతుంది. మనిషి జీవితానికి ఒక విలువ వస్తుంది. ఉత్సాహంగా బతికే మనిషి జీవితం కుంటుపడదు. వేగంగా, ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, అంటే జంతువులు, పక్షుల్ని కట్టేసి పెంచుకున్నా హింసే అన్నాడు. బానిసత్వాన్నీ హింసగానే పరిగణించాడు. చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, కఠినంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, రెండర్థాల పదాలతో బాధపెట్టినా- ఇవన్నీ ‘జీవహింస’గానే చెప్పాడు. ఐతే ఏదైనా కావాలని, తెలిసి చేస్తేనే అది నేరం అవుతుందని, తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ఈ పంచశీల మనిషి జీవితానికి ఒక చక్కటి నియంత్రణ. ఎందుకంటే- ప్రతివ్యక్తి పంచశీల ధరించి, స్వతంత్ర నియంత్రణ కలిగి ఉంటే... ఒక వ్యక్తి మరో వ్యక్తిని మోసగించడు. ఒకడు మరొకని దోపిడీ చేయడు. దగా చేయడు. చంపుకు తినడు. ఎదుటి వారి జీవితంలో అనవసరంగా తల దూర్చడు. దురాశాపరుడు కాడు- తోటి వ్యక్తుల్తో, సమాజంతో తగవు పడడు. ద్వేషాన్ని పెంచబోడు. పాపాన్ని మూటగట్టుకోడు. నలుగురితో మంచిగా ఉంటాడు. నలుగురి మేలు కోరుకుంటాడు- కాబట్టి అతనికి అడుగడుగునా అడ్డంకులుండవు. వెనక్కి లాగేవారు కానీ, ఎత్తి పడేసేవారు గానీ ఉండరు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తిలో మానవీయతనే చూస్తాడు. మానవీయునిగానే జీవిస్తాడు. పంచశీలను తెలుసుకున్నవాడు తను తాను తెలుసుకుంటాడు. పంచశీలను పాటించేవాడు తనను తాను గెలుచుకుంటాడు. జీవితాన్ని గెలుస్తాడు, జీవనాన్ని గెలుస్తాడు. నిజమైన విజేతగా నిలుస్తాడు. అందుకే... బుద్ధం శరణం గచ్ఛామి. - బొర్రా గోవర్ధన్ బౌద్ధం- పున్నమి: బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పున్నమికి ప్రాముఖ్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిన ది, ఇల్లు విడిచినదీ, జ్ఞానోదయం పొందినదీ, పరినిర్వాణం పొందినదీ వైశాఖ పూర్ణిమరోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించినదీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు; అశోకుని కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడు శ్రీ లంకలో బౌద్ధధర్మం ప్రారంభించినది ( విదేశంలో తొలి బౌద్ధ ధర్మస్థాపన) జ్యేష్ట పౌర్ణమినాడు కాగా, ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు. -
కొవ్వు పదార్థాలతో పిచ్చి ఖాయం!
లూసియానా: పరిమితికి మించిన కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడంవల్ల స్థూలకాయం, రక్తపోటువంటి వ్యాధులు వస్తాయని మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. కానీ, తాజా అధ్యయనంలో మాత్రం వీటివల్ల ఏకంగా మెదడు ఆలోచన స్థాయిలో నిలకడ తప్పుతుందని, మానసిక వైకల్యం తలెత్తి తీవ్ర ఒత్తిడికి గురవుతుందని వెల్లడైంది. లుసియానాలోని విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు కొవ్వుతో నిండిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల ఏర్పడే అనర్థాలపై ఆందోళన చెందుతూ బయోలాజికల్ సైకియారిటి అనే జర్నల్‌లో తమ పరిశోధన అంశాలను వెలువరించారు. ఈ పదార్థాలు తినే వారి ప్రవర్తనలో విపరీత మార్పు వస్తుందని, మెదడువాపు వ్యాధి కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందని అందులో పేర్కొన్నారు. మానసిక సమస్యలు వేగం పుంజుకుంటాయని, ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. ఈ మార్పును తాము ఎలుకలపై పరిశోధనలో గమనించామని వివరించారు. ముఖ్యంగా నాడీ వ్యవస్థపై కొవ్వు పదార్థాల ప్రభావం తీవ్రంగా పడినట్లు తాము గుర్తించామని చెప్పారు. జీర్ణాశయానికి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటాయని, ఫలితంగా అప్రమత్తంగా ఉండాల్సిన శరీరంలోని జీవ కణజాలం నిర్లిప్తంగా మారిపోతుందని పేర్కొన్నారు. -
మానసిక వ్యాధిగ్రస్తులకు నచ్చదు
ఎవరేమనుకున్నా గానీ, నటుడు శింబు అనాలనుకుంది అనేస్తారు. చేయాలనుకుంది చేసేస్తాడు. ప్రస్తుతం ఈయన నటించిన మూడు చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటి గురించి శింబు చింతించరు. ఇద్దరు హీరోయిన్లతో లవ్ బ్రేక్ అప్ అయినా మరోసారి వర్కౌట్ అవుతుందిలే అనే ధీమాను వ్యక్తం చేస్తారు. అలాంటి నటుడి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యూయి. శింబు అజిత్‌కు వీరాభిమాని. తన అభిమాన నటుడి చిత్రం ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ చిత్రాన్ని శింబు సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి చూశారు. అరుుతే చాలా కాలం తరువాత ఒక మంచి తమిళ చిత్రం చూశాను. అజిత్ అద్భుతంగా నటించారు. తల (అజిత్ ) అభిమానులకు పసందైన విందుగా ఉంటుంది. మానసిక బాధితులకు మినహా ఎన్నై అరిందాల్ తమిళ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఆ చిత్రం నచ్చని వారినందరినీ శింబు మానసిక వ్యాధిగ్రస్తులతో ఎలా పోల్చుతారని పలువురు ఆయనపై ట్విట్టర్లో దాడి చేస్తున్నారు. అయితే శింబు మాత్రం చిత్రం చూసి నా అభిప్రాయాన్ని చెప్పాను. ఆ భావ స్వేచ్ఛ నాకుంది. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
కోమాలో బీబీఎంపీ మహిళా కార్పొరేటర్
బెంగళూరు: మానసిక అస్వస్థతతో బాధపడుతున్న బీబీఎంపీ కార్పొరేటర్ లలిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె ఇక్కడి సాగర్ అపోలో ఆస్పత్రిలో కోమాలో ఉన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక్కడి గిరినగర వార్డు నుంచి లలిత మొదటి సారి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె చాలా కాలం నుంచి క్లీఫ్లోమేనియా వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచి వైద్యం చేయించుకుంటున్న వ్యాధి నయం కాలేదు. మంగళవారం బీబీఎంపీ మేయర్ శాంతకుమారి, శాసన సభ్యుడు రవిసుబ్రమణ్య, పాలికె అధికార పార్టీ పరిపాల విభాగం నాయకుడు ఎన్.ఆర్. రమేష్ తదితరులు సాగర్ అపోలో ఆసుపత్రి చేరుకుని లలిత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. చోరీ కేసులో అరెస్ట్ కార్పొరేటర్‌గా గెలుపొందిన లలిత ఒక చోరీ కేసులో ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీనగరలోని సుఖసాగర్ కాంప్లెక్స్‌లోని అశోక్ అపెరెల్స్లో చాలా కాలం నుంచి లలిత బట్టల కొనుగోలు చేసేవారు. ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో అశోక అపెరెల్స్కు వెళ్లిన లలిత, ఐదు టాప్‌లు తీసుకుని డ్రస్సింగ్ రూంలోకి వెళ్లారు. తరువాత మూడు టాప్‌లు ఒక దాని మీద ఒకటి వేసుకున్నారు. మూడు టాప్ల మీద ఆమె డ్రస్ వేసుకున్నారు. రెండు టాప్‌లు తీసుకు వచ్చి అక్కడ పని చేస్తున్న సేల్స్ మెన్‌కు ఇచ్చి నాకు బట్టలు నచ్చలేదని చెప్పి బయటకు రావడానికి ప్రయత్నించారు. సేల్స్‌మెన్‌కు అనుమానం వచ్చి యజమానికి చెప్పారు. బట్టల షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ పోలీసులు వచ్చి పరిశీలించగా లలిత లోపల మూడు టాప్‌లు వేసుకున్న విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటకు వచ్చిన లలిత ఇంటిలోనే ఉంటున్నారు. క్లీఫ్లోమేనియా వ్యాధి వల్లే ఆమె చోరీ చేసిందని అప్పట్లో వైదులు తెలిపారు. తాను జైలుకు వెళ్లాలనని లలిత పదేపదే బాధపడేవారని సమాచారం. ఆత్మహత్యాయత్నం........? లలిత ఇంటిలో విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఆమె ఇంటిలో విషం సేవించారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అనారోగ్యం కారణంగానే లలితను ఆసుపత్రిలో చేర్పించామని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్యహత్యాయత్నం కేసు నమోదు కాలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. -
ప్రభుత్వాస్పత్రిలో ఆత్మహత్య
కరీంనగర్ క్రైం/తిమ్మాపూర్ : మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో బుధవారం ఉరేసుకున్నాడు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన గుమ్మడి వెంకన్న(30) తల్లి కనుకవ్వతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. తండ్రి గతంలోనే మరణించగా సోదరికి వివాహమైంది. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మానసికవ్యాధితో పడుతున్న అతడు చస్తానని తరచూ ఇంట్లో బెదిరిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి ఇలాగే మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు గ్రామ శివారులో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ముట్టుకున్నాడు. షాక్ కొట్టడంతో కిందపడిపోయాడు. అక్కడే నిద్రిస్తున్న గొర్రెల కాపరులు శబ్ధం కావడంతో లేచిచూసి గ్రామస్తులకు సమాచారమందించారు. వారు వెంకన్నను తీసుకెళ్లి ఓ ఆర్ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స అనంతరం రాత్రి 12 గంటల ప్రాంతంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం సిద్ధం చేస్తుండగా వేకువజామున 3 గంటల ప్రాంతంలో బాత్రూమ్కు వెళ్లాడు. లోపల గడియపెట్టుకుని వెంటిలేటర్‌కు తన వద్ద ఉన్న లుంగీతో ఉరేసుకుని బయటకు దూకాడు. అతడు ఎంతసేపటికి బాత్రూమ్నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా బయటివైపు ఉరేసుకుని మరణించి కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నరేందర్ తెలిపారు. ఆస్తులేం లేకుండా తల్లిని ఎలా సాకాలని మనోవేదనకు గురవుతుండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. జీల్గులలో విద్యార్థిని.. జీల్గుల(ఎల్కతుర్తి) : జీల్గులకు చెందిన రావుల అనూష(14) అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న అనూషను పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాలేదు. బాధ భరించలేక బుధవారం వేకువజామున ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు గమనించి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందుతుండగానే పరిస్థితి విషమించి చనిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాచినేని రవి తెలిపారు. అర్పపల్లిలో వివాహిత.. సారంగాపూర్ : అర్పపల్లికి చెందిన రేష్మ(23) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. రేష్మ సోదరి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరణించగా ఆమె భర్తకు రేష్మతో ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరి మధ్య వయసు 20 ఏళ్ల తేడా ఉంది. రేష్మకు ఇష్టం లేకపోవడంతో నాలుగు నెలల క్రితం విడాకులు తీసుకుంది. తన జీవితం నాశనమైపోయిందని మనోవేదన చెందేది. ఇక బతకడం వృథా అనుకుని బుధవారం ఉదయం ఇంట్లోనే చున్నీతో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌజ్ అధికారి శంకరయ్య తెలిపారు. యామన్‌పల్లిలో యువకుడు... మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లికి చెందిన రామటెంకి అశోక్(20)అనే యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగగా.. తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మద్యానికి బానిసై ఒకరు.. కమాన్‌పూర్ : మండలంలోని జూలపెల్లికి చెందిన దాంపెల్లి సురేశ్(35) కూలీ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. పనికికూడా వెళ్లడం లేదు. కుటుంబ పోషణ భారం కావడంతో మనస్థాపం చెందిన ఉదయం ఇంట్లో ఉరివేసుకున్నట్లు కమాన్‌పూర్ ఏఎస్సై అన్వర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రాధ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది
ధ్యాన భావనలు మనసు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఎన్నటికీ విశ్రాంతిగా గానీ, ప్రశాంతంగా గానీ ఉండలేడు. మనలో ద్వేష భావం ఉన్నదంటే, ఎవరో చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నామని! ఎవరైనా ఒక వ్యక్తి గానీ, ఏదైనా ఒక వస్తువు గానీ మనకు అశాంతిని కలుగజేస్తే, ముందు మనకు కలిగేది చిరాకు లేదా కోపం. ఈ చిరాకు, కోపం నిముషంలోనే ద్వేషంగా మారుతుంది. అయితే ఆ చిరాకు లేదా కోపం కాసేపే ఉంటుంది కానీ, వాటి నుంచి పుట్టిన ద్వేషం మాత్రం శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది మనసులో. అలా ఎందరి మీదో, ఎన్ని వస్తువుల మీదో, ఎన్ని పరిస్థితుల మీదో మనం ద్వేషం పెంచుకుంటూ పోతే మన మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఎన్నటికీ దాని ఆరోగ్యం బాగుండదు. అంటే మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. అందువల్ల సాధకులుగా మనం ద్వేషాన్ని చిన్న సమస్యగా తీసి పారేయకూడదు. అది ఒక తీవ్రమైన, శాశ్వతమైన సమస్య. దాన్ని ప్రత్యేకంగా ఒక పట్టుపట్టాలి. అది కూడా చాలాకాలం పాటు. లేకపోతే ద్వేషం ఎన్నటికీ పోదు. ఏదో ఆషామాషీగా తీసిపారేయకూడదు. అతి ముఖ్యమైన అంశంగా చేసుకోవాలి. అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి కానీ, అవస్థ గానీ కలిగితే తట్టుకోలేను కాబట్టి. అంటే మనసు బలహీనంగా ఉన్నట్టన్నమాట. బలహీనమైన మనసు ప్రతి చిన్నదానికీ రుసరుసలాడుతుంది. ద్వేషాన్ని పెంచుతుంది. ఈ ద్వేషాన్ని దరిచేరనీయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం మనసును దృఢపరచుకోవడం. శరీరానికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చికిత్స చేస్తాం. అది బాధాకరంగా ఉండొచ్చు. అంతమాత్రాన శరీరాన్ని ద్వేషించము. అలాగే కొంతమందితో కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. అందరినీ ఒకేలాగ చూడలేకపోవచ్చు. కానీ వాళ్ల మీద ద్వేషం పెంచుకోకుండా జాగ్రత్త పడాలి నేను. అంతేకాదు, వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ల ఉన్నతి కోసం, పరిణతి కోసం దేవుని ప్రార్థించాలి. నా మనసు దృఢంగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. ప్రార్థన ద్వారా, నాకు నేను సూచనలు ఇచ్చుకోవడం ద్వారా నేను నా మనసుని దృఢపరచుకోగలను. ప్రతి ప్రార్థన ముగిశాక నేను మరింత దృఢం అయినట్లు భావిస్తాను. నేను మరింత దృఢంగా ఉన్నానని నాకు నేను చెప్పుకుంటాను. దేవుని కృప వల్ల, నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరినీ ద్వేషించను. కేవలం నాకు హాని చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించే, నా అత్యంత భయంకరమైన శత్రువుని సైతం ద్వేషించను. ఆ శత్రువు పరిణతి చెందనందుకు అతని మీద జాలి పడతాను. అతని ఉన్నతి కోసం కూడా దేవుని ప్రార్థిస్తాను. అతని వల్ల నేను అవస్థ పడినప్పటికీ నేను అతన్ని ద్వేషించాలనేం లేదు. అతన్ని నేను ప్రేమించలేకపోవచ్చు. అలా ప్రేమించగలగడానికి మరింత శక్తి కావాలి కానీ, ముందుగా ద్వేషాన్నయితే మనసులోకి రానీయకూడదు. ఎప్పుడైతే మనసులో ద్వేషానికి చోటులేదో, అప్పుడు ప్రేమించడానికి అవకాశాలు మెరుగవుతాయి. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
ధూమపానం కన్నా మనోవ్యాధులే డేంజర్..
మానసిక అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ధూమపానం కన్నా ప్రమాదకరం అంటున్నారు ఆక్స్ఫర్డ్వర్సిటీ శాస్త్రవేత్తలు. మానసిక అనారోగ్యం వల్ల జీవితకాలం సగటున 10 నుంచి 20 ఏళ్ల వరకూ తరిగిపోతుందని, అది ధూమపానం వల్ల తరిగిపోయే ఆయుర్ధాయం కన్నా ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలు, ఆల్కహాల్ వినియోగం, ధూమపానం వంటి వాటి వల్ల మరణించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అన్న కోణంలో 17 లక్షల మందిపై, 2.50 లక్షల మరణాలపై జరిగిన 20 పరిశోధనల ఫలితాలను ఆక్స్ఫర్డ్ సైకియాట్రిస్టులు అధ్యయనం చేశారు. వీరి తాజా అంచనాల ప్రకారం.. బైపోలార్ డిజార్డర్ వల్ల 9-10 ఏళ్లు, స్కిజోఫ్రీనియా వల్ల 9-20 ఏళ్లు, మళ్లీమళ్లీ వచ్చే డిప్రెషన్ వల్ల 7-11 ఏళ్లు జీవితకాలం తగ్గుతుందట. అలాగే డ్రగ్స్, ఆల్కహాల్ సేవనం వల్ల 9-24 ఏళ్లు, హెవీ స్మోకింగ్ వల్ల 8-10 ఏళ్లు ఆయుర్దాయం హరిస్తుందట. అయితే.. మానసిక రోగుల్లో అతిప్రవర్తన వల్ల కూడా ముప్పు ఏర్పడి చనిపోయే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. -
భర్త మానసిక వైకల్యం విడాకులకు దారికాదు:బాంబే హైకోర్టు
ముంబై: భర్తకు మానసిక వైకల్యం ఉన్నంత మాత్రాన భార్యకు విడాకులు మంజూరు చేయడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్తకు మానసిక వైకల్యం ఉన్నా.. అది ఆమె అతడితో కలిసి జీవించడానికి వీల్లేకుండా ఉన్నట్లు కూడా రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తన భర్త స్కీజోఫ్రీనియా బాధితుడని, వివాహం తర్వాత తనను పలుసార్లు కొట్టాడని.. కనుక విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వీఎల్ అచ్లియా, జస్టిస్ విజయ తహిల్మ్రణితో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం కొట్టివేసింది. భర్త కనీసం తన పనులను కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడనేందుకు తగిన ఆధారాలను ఈ కేసులో పిటిషనర్ పేర్కొనలేకపోయారని ధర్మాసనం పేర్కొంది. తొలుత ముంబైలోని కుటుంబ వివాదాల పరిష్కార కోర్టు విడాకుల మంజూరుకు తిరస్కరించగా.. ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు.