
ధర్మమార్గాన్ని చూపిన వాల్మీకి..
రామాయణ మహాకావ్యంతో ధర్మ మార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి అని ఎస్పీ రావుల గిరిధర్ కొనియాడారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వాల్మీకి జయంతిలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూజలు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీతి మార్గంలో నడవడమే వాల్మీకికి మనం ఇచ్చే నిజమైన నివాళులన్నారు. ఆయన రచించిన రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని.. నేటి యువత వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు, కార్యాలయ ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.