
95 ఏళ్ల వద్ధుడికి అరుదైన యాంజియో ప్లాస్టీ శస్త్రచికిత్స
సాక్షి,చైన్నె: 95 ఏళ్ల వృద్దుడికి అరుదైన యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి చైన్నెకు చెందిన ప్రోమెడ్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి కార్డియాలజీ హెడ్ అండ్ డైరెక్టర్ అరుణ్ కల్యాణ సుందరం తెలిపారు. మంగళవారం స్థానికంగా జరిగిన విలేకర్లసమావేశంలో అరుణ్ కల్యాణ సుందరం పాల్గొని శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు . సంక్లిష్టమైన కార్డియాక్ సమస్యతో భాదపడతున్న 95 ఏళ్ల వద్ధుడికి రక్షిత యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన గుండె పనితీరు తీవ్రంగా బలహీనపడిందన్నారు. ఈ క్రమంలో అధిక రక్తపోటు, రక్తహీనత, గతంలో స్ట్రోక్ వంటి అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ, కార్డియాలజీ డైరెక్టర్ – హెడ్ డాక్టర్ అరుణ్ కళ్యాణసుందరం నేతత్వంలోని కార్డియాక్ బందం అత్యంత సంక్లిష్టమైనప్పటికీ మల్టీ–వెసెల్ పెర్‌క్యటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్ (పీసీఐ) విధానంతో చేపట్టి విజయవంతం చేసినట్టు వెల్లడించారు.