
క్లుప్తంగా
కారు దగ్ధం
సేలం: పార్క్ చేసిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వివరాలు.. పెరుండురై రోడ్డులోని ఓ గిడ్డంగి దగ్గర మలైసామికి చెందిన కారు ఆగి ఉంది. అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కాలిపోవడం మొదలైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే, ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ లీకేజీ వల్ల మంటలు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
విద్యార్థినిని వ్యభిచారంలోకి
దింపిన కేసులో..
– సినిమా సహాయ నటుడి అరెస్టు
తిరువొత్తియూరు: కోయంబేడులో 9వ తరగతి విద్యార్థినిని పడువు వృత్తిలోకి తీసుకెళ్లిన కేసులో కేకే నగర్‌కు చెందిన పూంగోడి, నెసపాక్కం ప్రాంతానికి చెందిన భారతి కన్నన్, డీఎంకే నాయకుడు రమేష్‌తో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అరెస్టయిన భారతి కన్నన్ సినీ సహాయ నటుడిగా పనిచేస్తున్నారు. ఇతనే పూంగోడి ద్వారా విద్యార్థినిని ధనవంతులైన కస్టమర్లకు పంపి లైంగిక వృత్తిలో పెట్టించినట్లు తెలిసింది. అరెస్టు అయిన భారతి కన్నన్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ అప్పీల్‌పై 10న
విచారణకు సుప్రీం ఆదేశం
కొరుక్కుపేట: బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను జూలై 5, 2024 దుండగులు హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు చైన్నె ప్రిన్సిపల్ సెషనన్స్ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసును దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించాలని కోరుతూ ఆర్మ్‌స్ట్రాంగ్ సోదరుడు ఇమ్మాన్యుయేల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన చైన్నె హైకోర్టు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. దీని తర్వాత, హైకోర్టు ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించి, ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఈ అప్పీల్‌ను అత్యవసర కేసుగా విచారించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది సబరీష్ సుబ్రమణియన్ ప్రధాన న్యాయమూర్తి పి.ఆర్. కవాయి ముందు అప్పీల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఈ అప్పీల్‌ను స్వీకరించి, తమిళనాడు ప్రభుత్వ అప్పీల్‌ను 10వ తేదీన విచారిస్తామని వెల్లడించారు.
దండలు, శాలువలకు
బదులుగా..
– బియ్యం అడుగుతున్న
మహిళా కాంగ్రెస్ నాయకులు
తిరువొత్తియూరు: తమిళనాడు మహిళా కాంగ్రెస్ పేదలకు సహాయం చేయడానికి ఒక వినూత్న ఏర్పాటు చేసింది. దీని ప్రకారం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్‌ను కలవడానికి వచ్చేవారు దండలు, శాలువలు, పూలగుత్తులు, చీరలు వంటివి తీసుకురావద్దని, వాటికి బదులుగా కనీసం కిలో బియ్యం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ ప్రకటన మహిళా కాంగ్రెస్ కార్యాలయం వెలుపల అతికించారు. ఎవరైనా పేదలు ఇక్కడ 5 కిలోల బియ్యం కూపన్‌ను తీసుకుని దగ్గరలోని దుకాణంలో కొనుగోలు చేయవచ్చు. అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. హసీనా సయ్యద్ మాట్లాడుతూ, శ్రీమేం సేకరించిన బియ్యాన్ని పండుగ రోజుల్లో పేదలకు కనీసం 5 కిలోల చొప్పున పంచుతాం. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 11న బియ్యం పంపిణీ చేయనున్నాం. కనీసం వెయ్యి మందికి పంపిణీ చేయాలని ‘లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు.
లయన్స్ గేట్ ప్లేలో
కోర్టు రూమ్
సాక్షి, చైన్నె : రవి గోగుల లీగల్లీ వీర్ హై స్టేక్స్ కోర్టు రూమ్ థ్రిల్లర్ అక్టోబరు 10న లయన్స్ గేట్ ప్లేలో ప్రసారం కానుంది. దీని గురించి దర్శకుడు రవి గోగుల స్థానికంగా మాట్లాడుతూ, లీగల్లీ వీర్ విచారణే కథకు ఇంజన్ అని పేర్కొంటూ, కోర్టు గదిలో అధికారం , వ్యక్తుల మనస్తత్వం గురించి ఇందులో వివరించినట్టు పేర్కొన్నారు. ఒక హత్య కేసు విచారణ..చివరకు న్యాయం గెలుస్తుందా..? అన్నది అక్టోబరు 10న లయన్స్ గేట్ ప్లే ప్రసారం ద్వారా తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు. నటుడు మలికి రెడ్డి వీర్‌రెడ్డి మాట్లాడుతూ, వీర్ పాత్రలో నటించినట్టు పేర్కొన్నారు. కాగా, వీర్ ప్రయాణం కేవలం ఒక కేసుగురించి కాకుండా, శక్తి వంతుల కోసం మోసగించబడిన వ్యవస్థ గురించి అని వ్యాఖ్యానించారు.