
సమన్వయంతో.. ముందుకు!
– పళణితో బీజేపీ నేతల భేటీ
సాక్షి, చైన్నె : ఎన్నికల వ్యవహారాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే దిశగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళణిస్వామితో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ అభిజయంత్ పండా చర్చలు జరిపారు. మంగళవారం పళణి స్వామితో ఆయన భేటీ అయ్యారు. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బీజేపీ తరపున పార్టీ సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు ఎన్నికల ఇన్‌చార్జ్‌గా అభిజయంత్ ఇటీవల నియమితులయ్యారు. చైన్నె వచ్చిన ఆయన ముందుగా కమలాలయంలో పార్టీ వర్గాలతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు నైనార్ నాగేంద్రన్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ అరవింద్‌మీనన్, కో ఇన్‌చార్జ్ సుధాకర్‌రెడ్డిలతో పాటుగా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం పళణి స్వామి నివాసంకు అభిజయంత్, నైనార్ నాగేంద్రన్‌లు వెళ్లారు. సుమారు గంట పాటుగా వీరి భేటీ జరిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల అమలు, సమన్వయంతో ముందుకు సాగడం, ఉమ్మడి ప్రచారం, జిల్లాల నేతల సమధ్య ఐక్యత, సమిష్టి ప్రయాణం, తదితర అంశాలతో పాటుగా అసె ంబ్లీ నియోజకవర్గాల ఎంపికకు సంబంధించిన చర్చకు సాగినట్టుసంకేతాలు వెలువడ్డాయి.ఇందులో కొన్ని నియోజకవర్గాల గురించి అన్నాడీఎంకే ముందు బీజేపీ ప్రతిపాదనను ఉంచినట్టు సమాచారం. అయితే, పార్టీ వర్గాలతో చర్చించే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని పళణి స్వామి వారికి సూచించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.