
కయాదు లోహర్‌కు మరో లక్కీ ఛాన్స్?
తమిళసినిమా: హీరోయిన్లకు మొదట ఒకే ఒక్క ఛానన్స్. ఆ తర్వాత ఒకే ఒక్క హిట్. అంతే ఆపై వరుసగా అవకాశాలే అవకాశాలు. నటి కయాదు లోహార్ పరిస్థితి ఇప్పుడు ఇదే అని చెప్పవచ్చు. 2021లో కన్నడ చిత్రపరిశ్రమలోకి కథానాయకిగా అడుగుపెట్టిన బ్యూటీ ఈమె. ఆ తర్వాత మలయాళం, తెలుగు, మరాఠీ, తమిళం అంటూ పాన్ ఇండియా కథానాయకిగా ఎదిగిపోయారు. తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రం ఈమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళం, మలయాళం తదితర భాషల్లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి. ఈ చిత్రం త్వరలో సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కయాదు లోహర్‌ను మరో లక్కీ ఛాన్‌న్స్ వరించినట్లు సమాచారం. మదగజ రాజా చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చిన నటుడు విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబో రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. సుందర్.సి చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాముఖ్యత కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా ఒకరికి మించి హీరోయిన్లు ఆయన చిత్రాల్లో ఉంటారు. గ్లామర్ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. అదేవిధంగా ఆయన విశాల్ హీరోగా తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అందులో ఒక హీరోయిన్‌గా నటి కయాదు లోహర్ ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. ప్రస్తుతం విశాల్ సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న మకుటం చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా సుందర్.సి నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ –2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తరువాత విశాల్, సుందర్.సి కాంబోలో చిత్రం సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
దీపావళి రేసులో డీజిల్
తమిళసినిమా: ఇటీవల వరుసగా హిట్‌లతో దూసుకుపోతున్న నటుడు హరీష్ కళ్యాణ్ ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన పార్కింగ్, లబ్బర్ బంతు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డీజిల్. థర్డ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి షణ్ముగం ముత్తు స్వామి కథ ,దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. నటి అతుల్యా రవి కథానాయకిగా నటించిన ఇందులో వినయ్ ,సాయికుమార్ ,అనన్య, కరుణాస్, వివేక్ ప్రసన్న, సచిన్ కేతేకర్, జహీర్ హుస్సేన్, తంగతురై, కె పి వై దీనా తదితరు ముఖ్య పాత్రలు ప్రశ్నించారు. కాగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 17వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర వివరాలను నటుడు హరీష్ కళ్యాణ్ తెలుపుతూ ఇది 2014 ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. ముఖ్యంగా డీజిల్ దోపిడీ ఇతివృత్తంతో ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. సముద్రంలో తయారైన క్రూడ్ ఆయిల్‌ను పైపుల ద్వారా బయటకు తీస్తారన్నారు. అలా పైపుల ద్వారా వచ్చిన క్రూడ్ ఆయిల్‌ను కొందరు అక్రమంగా దోచుకుంటారన్నారు. దాన్ని చిత్ర కథానాయకుడు ఎలా అరికట్టగలిగాడు అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇందులో తాను మత్స్యకారుడిగా నటించానని, నటి అతుల్య రవి న్యాయవాదిగా నటించారని చెప్పారు. ఆమె పాత్ర సెకెండ్ ఆఫ్‌లో కథను మలుపు తిరగడానికి కీలకం అవుతుందని చెప్పారు. తాను కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ కథా చిత్రం డీజిల్ అని పేర్కొన్నారు. అదేవిధంగా దీపావళి సందర్భంగా విడుదలవుతున్న తన తొలి చిత్రం ఇదేనని హరీష్ కల్యాణ్ చెప్పారు.

కయాదు లోహర్‌కు మరో లక్కీ ఛాన్స్?