సాక్షి, చైన్నె : అరుదైన, ప్రాణాంతకమైన గుండెజబ్బుతో బాధపడుతున్న కేరళకు చెందిన 28 ఏళ్ల యువకుడైన ఇంజినీరింగ్ విద్యార్థికి సిమ్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. మంగళవారం ఈ శస్త్ర చికిత్స వివరాలను సిమ్స్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజు శివస్వామి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ డైరెక్టర్ డాక్టర్ వివి బాషి, కార్డియోథొరాసిక్ సర్జన్ మహ్మద్ ఇధ్రీస్‌లు వివరించారు. రెండు నెలలుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధ పడుతూ వచ్చిన ఈయువకుడిని సిమ్స్‌కు తీసుకువచ్చారని పేర్కొన్నారు. తాము నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడికిరెండు తీవ్రమైన గుండె సమస్య ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇది అరుదైన కలయికతో ఉన్నట్టు నిర్ధారించామన్నారు. పింగాణి బృహద్దమని, బృహద్దమణి కవాటం స్టెనోసిస్( గుండె నుంచి రక్తప్రవాహాన్ని నియంత్రించే వాల్వ్)కు శస్త్ర చికిత్స అనివార్యమైందన్నారు. ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులలో ప్రత్యేక బృందంగా ఏర్పడి. తీవ్ర పరిశోధనతో అరుదైన, ఆధునిక విధానం అనుసరించామని వివరించారు. యాంత్రీక అయోర్టిక్ వాల్వ్‌ను భర్తి చేశారు. బృహద్దమని కవాటం ఉండే నిర్మాణంలో కుట్లు అన్నది అసాధ్యం కావడంతో పింగాణి బృహద్దమని లోని సమస్య కారణంగా శస్త్ర చికిత్స సంక్లిష్టంగా మారిందన్నారు. అయినా 5 గంటల పాటూ శ్రమించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశామని, ప్రస్తుతం ఆ యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. దక్షిణ భారత దేశంలో ఇలాంటి శస్త్ర చికిత్స అతి చిన్న వయస్కుడికి జరగడం ఇదే ప్రథమంగా పేర్కొన్నారు.