
కడలూరు సత్యజ్ఞాన సభకు శింబు
తమిళసినిమా: నటుడు శింబు ప్రస్తుతం తన 49వ చిత్రంలో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. దీనికి అరసన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సందర్భంగా నటుడు శింబు మంగళవారం ఉదయం కడలూరు జిల్లా, వడలూర్‌లోని సత్యజ్ఞాన సభకు వెళ్లారు. వళ్లవర్ నెలకొల్పిన జ్ఞానసభ ఇది. ప్రతి ఏడాది తైపూస జ్యోతి దర్శనం ఉత్సవాలను ఈయన విరివిగా నిర్వహిస్తుంటారు. భక్తులు భారీ ఎత్తున్న ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు. కాగా శింబు ఈ సత్యజ్ఞాన సభను సందర్శించారు. అనంతరం వళ్లవర్‌ను దర్శించుకున్నారు. అక్కడ గంటకుపైగా ధ్యానం చేశారు. ఈ సందర్భంగా శింబు మీడియాతో మాట్లాడుతూ వళ్లవర్ నిరుపేదలకు, అనాథలకు మూడు పూటలా అన్నదానం చేస్తుంటారని చెప్పారు. అదేవిధంగా తాను చిన్నారులకు అన్నదానం చేయాలని వేడుకున్నట్లు చెప్పారు. అందుకే వళ్లవర్ పిలిచిన వెంటనే సత్యజ్ఞాన సభకు వచ్చి ఆయన్ని దర్శించుకున్నట్లు శింబు పేర్కొన్నారు.