
పరిశుభ్రత లేకుండా చేస్తే చర్యలు
తిరువళ్లూరు: పరిశుభ్రత లేకుండా స్వీట్స్ తయారు చేసి విక్రయిస్తే సంబంధిత దుకాణంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ కదిరవన్ హెచ్చరించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లాలోని స్వీట్స్, బేకరీ యజమానులతో ఫుడ్‌సేఫ్టీ అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రయివేటు హాలులో జరిగిన సమావేశానికి కదిరవన్ హాజరై స్వీట్స్ తయారీ, విక్రయాలపై హోటల్స్, స్వీట్స్, బేకరీ యజమానులకు దిశానిర్దేశం చేశారు. డాక్టర్ కదిరవన్ మాట్లాడుతూ నాణ్యత లేకుండా వస్తువులను తయారు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొలతల్లోనూ తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి వ్యాపారులు వ్యవహరిస్తే ఆహార భద్రత చట్టం కింద రూ.10లక్షలు వరకు జరిమానా విధించే అవకాశం వుందన్నారు. హోటల్స్ యజమానులు, ఫుడ్‌సేఫ్టీ అధికారులు, స్వీట్స్, బేకరీ యజమానులు పాల్గొన్నారు.