వేలూరు: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ మాట్లాడుతూ రోజుకు 12 గంటలపాటు విధులు నిర్వహించే 108 అంబులెన్స్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన 15 శాతం వేతనం పెంచకుండా 10 శాతం మాత్రం పెంచి మిగిలిన ఐదు శాతాన్ని పెంచకుండా నిలిపి వేయడం సరికాదన్నారు, గత ఐదేళ్లుగా ఒకే వేతనంతో పనులు చేస్తున్నామని ప్రతి సంవత్సరం తమకు వేతనం పెంచాలని కార్మికుల డిమాండ్‌తో ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా వేతనాన్ని పెంచి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శామ్యూల్, చైన్నె రీజినల్ కార్యదర్శి సహదేవన్, రీజినల్ కార్యదర్శి రంజిత్‌కుమార్, కార్మికులు పాల్గొన్నారు.