
ఆలయాలను రక్షించాలి
కొరుక్కుపేట: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, అలాగే పురాతన దేవాలయాలను రక్షించాలని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచించారని అరుణ్ ఎక్స్‌సెల్లో ఎండీ పి సురేష్ తెలిపారు. ఈమేరకు చైన్నెలో జరిగిన విలేకర్ల సమవేశంలో ఆయన మాట్లాడారు. మహాబలిపురంలోని జీవా యాక్టివ్ రిటైర్మెంట్ కమ్యూనిటీని శంకర విజయేంద్ర సరస్వతి సందర్శించారని అన్నా రు. ప్రస్తుతం ఈ కమ్యూనిటీలో 400 మంది సీనియర్ సిటిజన్లు ఉంటున్నారని తెలిపారు. వీరికి ఆహారం, ఆరోగ్యం, భద్రత నిర్వహణ అవసరాలను కంపెనీ పూర్తిగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి జీవాను సందర్శించి, నివాసితులు, సిబ్బంది ఆనందం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారని చెప్పారు. తరువాత ఆయన శివ విష్ణు ఆలయాలు అనంతరం గోశాలను సందర్శించి మైత్రి హాల్‌ను ఆయన ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమంలో అరుణ్ సురేష్ పాల్గొన్నారు.