
క్లుప్తంగా
తీర్థీశ్వరుడి ఆలయంలో పూర్ణాహుతి
– ముగిసిన పవిత్రోత్సవాలు
తిరువళ్లూరు: తీర్థీశ్వరుడి ఆలయంలో ఐదు రోజులుగా జరిగిన పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి జరిగిన పూర్ణాహుతితో ముగిశాయి. తిరువళ్లూరులోని త్రిపుర సుందరి సమే త తీర్థీశ్వరుడి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు గత గురువారం పవిత్ర యాగంతో ప్రారంభమయ్యాయి. ఐదవ రోజు మంగళవారం ఉద యం యాగపూజలు పవిత్ర సమర్పణ నిర్వహించారు. రాత్రి 9 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుత్తణిలో
న్యాయవాదుల ధర్నా
తిరుత్తణి: సీజేఐపై దాడికి నిరసనగా తిరుత్తణి న్యాయవాదులు ధర్నా చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా తిరుత్తణిలోని సంయుక్త కోర్టు న్యా యవాదులు మంగళవారం ధర్నా చేశారు. నిందితుడని వెంటనే అరెస్టు చేయాలని, దేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు భద్రత కొరవడిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
మద్యానికి డబ్బివ్వలేదని..
– తండ్రిపై కుమారుడి దాడి
అన్నానగర్: చైన్నెలోని తిరుమంగళంలోని పెరియార్ తేరుపడి కుప్పం ప్రాంతంలో నివసిస్తున్న మాణిక్యం (65). కూలీ అయిన ఇతను తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇతని కుమారుడు సుందర్ (27). నేరస్థుడైన ఇతను మద్యానికి బానిసై తాగేవాడు. సోమవారం రాత్రి, అతను తన తండ్రిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. మాణిక్యం అతనికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన సుందర్ పక్కనే ఉన్న ఇటుకను తీసుకుని తన తండ్రి తలపై కొట్టాడు. మాణిక్యానికి తీవ్ర రక్తస్రావం అవుతూ, నొప్పితో కేకలు పెడుతున్నాడు. సమీపంలోనే ఉన్న అతని మేనల్లుడు శరవణన్, మాణిక్యంను రక్షించి చికిత్స కోసం కిల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. తిరుమంగళం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మటన్ బిర్యానీలో బొద్దింక
– యువకుడికి అస్వస్థత
అన్నానగర్: చైన్నె పెరంబూర్ మాధవరం హైవే పెరంబూరులో ఓ ప్రసిద్ధ బిర్యానీ దుకాణం ఉంది. ఇందులో మంగళవారం పెరంబూరు మునియప్పచెట్టి వీధి ప్రాంతానికి చెందిన యోగేంద్రబాబు (30) మటన్ బిర్యాని కొని ఇంటికి తీసుకుని వచ్చి తిన్నాడు. బిర్యానీలో చనిపోయిన బొద్దింకను చూసి అతను దిగ్భ్రాంతి చెందాదు. వెంటనే బిర్యానీ దుకాణానికి వెళ్లి అడిగాడు, కానీ ఉద్యోగులు సరైన సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత అతను ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. ఇంతలో, యుగేంద్రబాబు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని పెరియార్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. యోగేంద్రబాబు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సెంబియం పోలీసులు కేసు నమోదు చేసి, ఆహార భద్రతా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సిరప్ తయారీ
యాజమాన్యానికి నోటీసులు
సాక్షి, చైన్నె : దగ్గు సిరప్ తాగి మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లలో చిన్నారులు మరణించిన కేసులో ఆ మందు తయారీ సంస్థకు తమిళనాడు డ్రగ్ కంట్రోలర్ అధికారి మణిమేఘలై మంగళవారం నోటీసులు జారీ చేశారు. కాంచీపురంలో ఉన్న ఈ పరిశ్రమ వద్ద నోటీసులు అంటించారు. ఈ సంస్థను పుదుచ్చేరికి చెందిన రంగనాథన్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 14 ప్రశ్నలను సంధిస్తూ, వారం రోజులలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేని పక్షంలో చట్ట పరంగా చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేశారు.
3 సెల్‌ఫోన్లు చోరీ
తిరువొత్తియూరు: చైన్నెలోని కోయంబేడు ప్రాంతంలో నివసిస్తున్న ఓ ఆటోడ్రైవర్ అశోక్‌కుమార్ (22) కోయంబేడు క్రైమ్ డివిజన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేశారు. అందులో నేను వసతి గృహంలో ముగ్గురితో కలిసి ఉంటున్నాను. నా సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్నప్పుడు, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వసతి గృహంలోకి చొరబడి 3 ఖరీదైన సెల్‌ఫోన్‌న్లను చోరీ చేశారు. చోరీకి గురైన ఫోన్‌న్లను గుర్తించి తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిఘా కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజీ ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

క్లుప్తంగా