
సహకార బ్యాంకు ఉద్యోగుల సమ్మె
తిరువళ్లూరు: సహకార బ్యాంకు, రేషన్ దుకాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ దశల వారిగా ఉద్యోగులు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో విధులను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. వేతన పెంపులో పాఽరదర్శకత ప్రదర్శించాలని, పక్షపాతం, యూనియన్‌ల వర్గీకరణ లేకుండా 20 శాతం మేరకు వేతన పెంపును వెంటనే చేయాలని, 2021లో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.5వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. ఈక్రమంలో సోమవారం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టిన ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా వున్న ప్రాతమిక సహకార బ్యాంకులు, రేషన్ దుకాణాలను మూసివేసి సమ్మెకు దిగారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. ఉద్యోగుల ఆందోళనతో రేషన్ సరుకుల సరఫరా ఆగిపోయింది.