
మైదానంలో పళణి ప్రచారం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కోర్టు నిబంధనల కారణంగా మైదానంలో తన ప్రజా చైతన్యయాత్రను బుధవారం నిర్వహించారు. కరూర్ ఘటన నేపథ్యంలో రహదారులు, రోడ్లు, ఆ పరిసరాలలో ప్రచారాలకు కోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో తన ఆరో విడత ప్రజా చైతన్యయాత్రను పళణి స్వామి బుధవారం సాయంత్రం నామక్కల్‌లోని ఓ ప్రైవేటు మైదానంలో నిర్వహించాల్సి వచ్చింది. పార్టీ వర్గాలందర్నీ అక్కడికి తరలించారు. మైదానంలో నిర్వహించినా, కట్టుదిట్టమైన భద్రతా పరంగా చర్యలు తీసుకున్నారు.