
గంగై అమరన్‌కు చేదు అనుభవం
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో వేల్ పూజల్లో పాల్గొనేందుకు వెళ్లిన సినీ దర్శకుడు గంగై అమరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ అధికారులు దర్శనానికి అనుమతి నిరాకరించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశ్వ హిందూపరిషత్ జిల్లా అధ్యక్షుడు దురైపాండ్యన్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కొండ ఆలయంలోని నెమలి మండపంలో వేల్ పూజలు నిర్వహించారు. ఇందులో గంగైఅమరన్ పాల్గొన్నారు. వేల్ పూజలు నిర్వహించిన అనంతరం వేల్‌ను మురుగన్ సన్నధిలో వుంచి పూజలు చేసేందుకు వీఐజీ గేట్ ద్వారంలో గంగైఅమరన్ సహా ఐదుగురు ప్రముఖులు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వేల్ పూజకు అనుమతి లేదని, వీఐపీ గేట్ ద్వారా స్వామి దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు నిరాకరించడంతో కాసేపు హడావుడి చోటుచేనుకుంది. రూ.100, ఉచిత దర్శనానికి అవకాశం వున్నప్పటికీ గంగైఅమరన్ స్వామి దర్శనం చేసుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం.