
ఉత్పత్తి రంగంలో తమిళనాడు దేశానికే లీడర్‌గా అవతరిస్తున్న
2032 నాటికి రాష్ట్రంలో
రూ.75 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
సీఎం స్టాలిన్ వెల్లడి
చైన్నెలో ఏరో స్పేస్, రక్షణ పరిశ్రమల ఎక్స్ పో ప్రారంభం
సదస్సులో సీఎం స్టాలిన్ ప్రసంగం
సాక్షి, చైన్నె: నందంబాక్కం వర్తక కేంద్రం వేదికగా ఏరో డెఫ్కాన్ 2025 పేరిట మూడు రోజుల అంతర్జాతీయ రక్షణ సదస్సుకు చర్యలు అధికారులు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ టిడ్కో, ఫ్రాన్స్‌కు చెందిన బీసీఐ ఏరోస్పేస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కన్సార్టియం, ఏరో స్పేస్‌ల నేతృత్వంలో ఇది సాగింది. వివరాలు.. తమిళనాడులో వేగంగా అభివద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా రక్షణ పరిశ్రమకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలతో ఒక కొత్త వేదిక రూపకల్పన దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో అమలు చేస్తున్న రక్షణ పరిశ్రమ రంగంలో రోడ్‌మ్యాప్, అంతర్జాతీయ ఉమ్మడి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై దృష్టి పెట్టే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.23 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రంగంలోకి రాగా, రూ. 5 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. 2032 నాటికి రూ. 75 వేల కోట్ల పెట్టుబడి ఈ రంగంలో పెట్టేందుకు మార్గంగా ఈ వేదికను తాజాగా ఎంపిక చేశారు. బోయింగ్, ఎయిర్‌బస్, లాక్‌హీడ్ మార్టిన్, డస్సాల్ట్, ఏవియేషన్, హెచ్‌ఏ ఎల్, బీఈఎల్, ఎల్ అండ్ టీ డిఫెన్స్, రోల్స్–రాయిస్, సఫ్రాన్ , టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌లతో పాటుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు డీఆర్‌డీఓ, ఇస్రో, హెచ్ ఏఎల్, బీడీఎల్, ఏవీఎన్‌ఎల్‌లు తమ ఆవిష్కరణలను ఇక్కడ స్టాల్స్ రూపంలో కొలువు దీర్చాయి. వీటన్నింటినీ సీఎం స్టాలిన్ సందర్శించారు. తమిళనాడు 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి ఏరోస్పేస్, రక్షణ, నౌకానిర్మాణం విభాగాలు ప్రధాన స్తంభాలుగా ఈ వేదిక ద్వారా నిలుస్తాయన్న ధీమాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు అన్బరసన్, టీఆర్‌బీ రాజా, ఎంపీ టి.ఆర్. బాలు, శాసనసభ సభ్యుడు కరుణానిధి, కోస్ట్ గార్డ్ చీఫ్ డైరెక్టర్ పరమేష్ శివమణి, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన డాక్టర్ పి.కె. దాస్, పరిశ్రమ, పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ , వాణిజ్య కార్యదర్శి వి. అరుణ్ రాయ్, కెరీర్ గైడెనన్స్ ఇన్‌స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ ధారేష్ అహ్మద్, డీఐటీసీఓ ఎండీ సందీప్ నండూరి, ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ స్టీఫెన్ కాస్టెట్, ఎయిర్ కమాండర్ శర్మ, రక్షణ పరిశోధన సంస్థ మాజీ అధ్యక్షుడు ఎస్. క్రిస్టోఫర్, జీఐఎల్ ఇండియా చైర్మన్ బాలసుబ్రమణియన్, భారత నౌకాదళ అధికారి సతీష్ షినాయ్, భారత సాయుధ దళాలు, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, ఉన్నత స్థాయి స్టార్టప్‌లు , రక్షణ పరిశోధన సంస్థల అధికారులు హాజరయ్యారు.
ఆకర్షిస్తున్న తమిళనాడు..
ఈ సదస్సులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు నేడు భారతదేశాన్ని ఆకర్షించే స్థితిలో ఉందని , ప్రపంచాన్ని ఆకర్షించే రాష్ట్రంగా ఎదిగిందంటూ ఆ మేరకు మార్గదర్శకం వహిస్తున్నట్టు వివరించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సభలు, ఎక్స్‌పోలకు తమిళనాడు వేదికగా మారిందన్నారు. అన్ని రకాల పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తమిళనాడు అవతరించి ఉందన్నారు. కొత్త వ్యాపార ఒప్పందాలను స్థాపించడానికి ఒక వేదిక ఈ సమావేశాన్ని మరింత మెరుగ్గా సమన్వయం చేయడం అభినందనీయమన్నారు. తమిళనాడు అన్ని రకాల పరిశ్రమలలో తనదైన ముద్ర వేస్తోందని, తయారీ రంగంలో అగ్రగామిగా మారుతోందన్నారు. ఎగుమతులు, ఉత్పత్తి అయ్యే మొత్తం ఆటోమేటిక్ వాహనాల సంఖ్యలో తమిళనాడు వాటా కేవలం దేశంలోనే 40 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు. ద్విచక్ర వాహనాల్లో మూడింట రెండు వంతులు ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 2024–25లో 14.6 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి, ఎగుమతిలో నంబర్ –1గా అవతరించినట్టు ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడులో 45,000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయని, దేశంలో అత్యధిక ఉత్పాదక ఉత్పత్తి తమిళనాడులో ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం 20 శాతం వాటాను తమిళనాడు కలిగి ఉందని దేశంలోనే ఉత్పత్తి రంగంలో లీడర్‌గా అవతరిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం 11.19 శాతంతో రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును కలిగిన ఏకై క’ రాష్ట్రం తమిళనాడు అని పేర్కొంటూ, తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్ విభాగం అభివృద్ధికి మలుపుగా వ్యాఖ్యలు చేశారు. ఈ రంగంలో తమిళనాడు భారతదేశ తయారీ కేంద్రంగా మారాలని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.. రక్షణ పరిశ్రమ కారిడార్ భవిష్యత్‌లో ముఖ్యమైనదని పేర్కొంటూ, ఇందులో కలక పాత్రను పోషిద్దామని పిలుపు నిచ్చారు. అధిక నాణ్యత కలిగిన జెట్ ఇంజిన్ భాగాల నుండి డ్రోన్ తయారీ వరకు ఇక్కడ జరగబోతోందని, పెరుగుతున్న అంతరిక్ష సాంకేతికత ఆధారిత తయారీ యూనిట్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. తమిళనాడు రక్షణ పరిశ్రమ రోడ్ మ్యాప్ అని, ఈ దార్శనికత కేవలం ఒక ఆలోచన కాదు, అనేక ప్రధాన ప్రాజెక్టుల అమలుతో, భారతదేశ రక్షణ రంగంలో భవిష్యత్తులో తమిళనాడు స్థానం పదిలం కాబోతోందన్నారు.
కారిడార్‌లు..
కోయంబత్తూరులో 360 ఎకరాల్లో రక్షణ పరిశ్రమ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, విమానాల మరమ్మతు, నిర్వహణ, సమన్వయ పనులు, నేరుగా రన్‌వే యాక్సెస్‌తో సూలూరులో 200 ఎకరాల్లో ఈ స్పేస్ పార్క్ ఏర్పాటు చేశామని, తిరుచ్చిలో 90 కి పైగా ఎంఎస్‌ఎంఈ మెకానికల్ ఇంజినీరింగ్‌లో నిమగ్నమై ఉన్నాయని, చైన్నె సమీపంలోని వల్లం వడకల్ వద్ద డిజైన్, పరిశోధన, ప్రయోగాత్మక అంతరిక్ష సంస్థల కోసం ఏరో–హబ్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తవుతుందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో రూ. 23 వేల కోట్ల పెట్టుబడులు సేకరించామని, ఇందులో 5 వేల కోట్ల ప్రాజెక్టులు అమల్లోకి తెచ్చామన్నారు.
భారీగా పెట్టుబడులు..
2032 నాటికిఈ రంగంలో రూ. 75,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదని తమిళనాడు ఎల్లప్పుడూ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పిలుపు నిచ్చారు. కొత్త శకానికి నాంది పలికే విధంగా దేశ భద్రతకే కాదు, ప్రపంచానికి కూడా శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి శక్తిగా తమిళనాడు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి వృత్ధి శిక్షణ పరీక్షలలో టాపర్లుగా నిలిచిన 40 మంది తమిళనాడు విద్యార్థులను అభినందించారు. విరుదునగర్, తిరువణ్ణామలై, తూత్తుకుడి, శివగంగై లలో శ్రీలంకతమిళుల పునావాస శిబిరాలలో రూ. 44.48 కోట్లతో నిర్మించిన 772 గృహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో తమిళనాడు మాజీ సైనికుల సంక్షేమ విభాగం సాధించిన ఉత్తమ ప్రదర్శన ట్రోఫిని సీఎంకు అందజేశారు.

ఉత్పత్తి రంగంలో తమిళనాడు దేశానికే లీడర్‌గా అవతరిస్తున్న

ఉత్పత్తి రంగంలో తమిళనాడు దేశానికే లీడర్‌గా అవతరిస్తున్న