
ప్రేమలతకు మాతృవియోగం
సాక్షి, చైన్నె : డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ తల్లి అంస వేణి(83) వయోభారం, అనారోగ్య సమస్యలతో చైన్నెలో కన్నుమూశారు. ఈ సమాచారంతో ధర్మపురిలో ఉన్న ప్రేమలత విజయకాంత్, ఆమె సోదరుడు సుఽధీష్ హుటాహుటిన చైన్నెకు చేరుకున్నారు. అంసవేణి చైన్నెలోని శాలి గ్రామం ఇంట్లో ఉంటూ వచ్చారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమై ఉన్నా రు. మంగళవారం ఉదయం ఆమె కన్నుమూశారు. ఽకెప్టెన్ రథ యాత్రను ధర్మపురిలో ముగించుకుని ఈరోడ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రేమలత, సుదీష్ దృష్టికి ఈ మరణ సమాచారం చేరింది. దీంతో ప్రేమలత తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. రథయాత్ర పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన తన సోదరుడితో కలిసి కారులోనే 5 గంటలు ప్రయాణించి చైన్నెకు చేరుకున్నారు. శాలిగ్రామం నివాసంలో ఉంచిన తల్లి భౌతిక కాయాన్ని చూసిన ఆమె విలపించారు. ప్రేమలతకు సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్‌తో పాటూ పలు పార్టీల నేతలు తమ సానుభూతిని తెలియజేశారు. అంసవేణి మృతికి సంతాపం తెలియజేశారు. డీఎండీకే వర్గాలు పెద్ద సంఖ్యలో శాలిగ్రామంకు చేరుకుని అంసవేణి భౌతిక కాయానికి అంజలి ఘటించాయి.

ప్రేమలతకు మాతృవియోగం