
అవినాశి వంతెనకు జీడీ నాయుడు పేరు
– రేపు కోవై వాసులకు అంకితం
సాక్షి, చైన్నె: క్లాసికల్ సిటీ కోయంబత్తూరు వన్నె తెచ్చే విధంగా భారీ వంతెన రూపుదిద్దుకుంది. 10 కి.మీ మేరకు నిర్మితమైన ఈ వంతెనకు జీడీ నాయుడు పేరును ఖరారు చేస్తూ సీఎం స్టాలిన్ ప్రకటించారు. వివరాలు.. కోయంబత్తూరు నగరంలో అవినాశి రోడ్డును అనుసంధానించే విధంగా 2020లో భారీ వంతెన మార్గానికి పునాదులు వేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు 2021లో ఈపనులపై దృష్టి పెట్టారు. 10 కి.మీ దూరం వంతెన మార్గానికి రూ. 1,791 కోట్లు కేటాయించారు. పనుల వేగాన్ని పెంచారు. కోయంబత్తూరు వాసుల దీర్ఘకాలిక కోరిక, ట్రాఫి క్ కష్టాలనుంచి గట్టెక్కించే ఈ వంతెన మార్గం పనులు పూర్తి అయ్యింది. దీనిని గురువారం సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. కోయంబత్తూరు నగరంలోనే అతిపెద్ద బ్రహ్మాండ వంతెనగా రూపుదిద్దుకుని దీనికి శాస్త్ర వేత్త, పారిశ్రామికవేత్త జీడీ నాయడు పేరు ఖరారు చేశారు. కోయంబత్తూరు అంటే భారత దేశం గర్వించ దగిన వ్యక్తి జీడీ నాయుడు గుర్తుకు వస్తారని సీఎం ప్రకటించా రు. ఆయన పేరును ఈ వంతెనకు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా జీడీ నాయుడు నాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కోయంబత్తూరు కళంగల్‌లో తెలుగు కుటుంబంలో జన్మించారు. తెలుగు సంతతికి చెందిన జీడీ నాయుడుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ అతి పొడవైన వంతెనకు ఆయన పేరు పెట్టడం గమనార్హం.
జీడీ నాయడు, వంతెన