
నల్లబ్యాడ్జీలతో సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
తిరువళ్లూరు: సహకార బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురుగేషన్, కార్యదర్శి త్యాగరాజన్ అధ్యక్షత వహించగా జిల్లా కోశాధికారి పొన్నన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా త్యాగరాజన్ మాట్లాడుతూ వేతన పెంపులో పాఽరదర్శకత ప్రదర్శించాలని, పక్షపాతం, యూనియన్ల వర్గీకరణ లేకుండా 20 శాతం వేతన పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి నిరాహారదీక్ష చేస్తామని ప్రకటించారు.