
బీజేపీ వైద్య విభాగం తిరువళ్లూరు జిల్లా అధ్యక్షుడిగా లోక
తిరువళ్లూరు: బీజేపీ వైద్య విభాగం తిరువళ్లూరు జిల్లా అధ్యక్షుడిగా లోకేష్ ప్రభును నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసుకోవడంపై ఆ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని విభాగాలకు అధ్యక్షులు, కార్యదర్శులను నియమించింది. బూత్‌కమిటీల నియామకాలను సైతం పూర్తి చేసి, వారికి ఇటీవల దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా బీజేపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా లోకేష్‌ప్రభును నియమిస్తూ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తన పేరును సిఫార్సు చేసిన జిల్లా అధ్యక్షుడు అశ్విన్‌కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.