క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 7 2025 4:09 AM | Updated on Oct 7 2025 4:09 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

● కిరాణా కొట్టు యజమాని అరెస్టు

ఒప్పందాలు

ఐపీఎఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల మధ్య ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించేలా ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు ఐసీఎఫ్‌ జీఎం యు సుబ్బారావు సమక్షంలో సోమవారం జరిగింది. ఐసీఎఫ్‌ ఉద్యోగుల సాధారణ మరణానికి ఉచిత టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా రూ.10 లక్షలు, ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా(మరణం) రూ. కోటి, ఉచిత శాశ్వత, తాత్కాలిక వైకల్యానికికు రూ.కోటి, తదితర అంశాలతో జరిగిన ఈ ఒప్పందాలు 8,600 మంది ఉద్యోగులకు వర్తింపజేయనున్నారు.

– సాక్షి, చైన్నె

బాలికపై లైంగిక వేధింపులు

అన్నానగర్‌: చైన్నె సమీపం వడపళనిలో కిరాణా దుకాణం నడుపుతున్న ఇమ్మాన్యుయేల్‌ మోసస్‌(49 ). ఇతని కిరాణా దుకాణానికి అదే ప్రాంతానికి చెందిన 5 ఏళ్ల బాలిక ఆదివారం కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆ బాలికను కిరాణా దుకాణం యజమాని ఇమ్మాన్యుయేల్‌ మోసెస్‌ లైంగికంగా వేధించాడు. బాలిక అరుపులు విని, పొరుగువారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రజలు కిరాణా దుకాణం యజమాని ఇమ్మాన్యుయేల్‌ మోసెస్‌కు దేహశుద్ధి చేశారు. తరువాత పోలీసులకు ఈ సంఘటనపై సమాచారం అందింది. పోలీసులు త్వరగా వచ్చారు. ప్రజలు ఇమ్మాన్యుయేల్‌ మోసెస్‌ను పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తర్వాత, వడపళని మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కిరాణా వ్యాపారిని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో అతను, పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇమ్మాన్యుయేల్‌ మోసెస్‌ కుడి చేయి విరిగింది. దీని తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తరువాత ఇమ్మాన్యుయేల్‌ మోసెస్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

అనుమానాస్పద స్థితిలో కారుడ్రైవర్‌ మృతి

అన్నానగర్‌: చైన్నెలోని మధురవాయల్‌ రుక్మిణి నగర్‌కు చెందిన శివసుబ్రమణి(55) కారు డ్రైవర్‌. ఇతను చైన్నెకి చెందిన విజయరాఘవన్‌, అతని కుటుంబాన్ని చైన్నె నుండి తిరుచ్చికి కారులో తీసుకెళ్లాడు. వారు తిరుచ్చి సెంట్రల్‌ బస్టాండ్‌ ప్రాంతంలోని ఒక హోటల్‌లో బస చేస్తున్నారు. హోటల్‌ సమీపంలోని స్టాండ్‌లో కారు ఆగి ఉంది. తరువాత కుటుంబ సభ్యులు కారు డ్రైవర్‌ శివసుబ్రమణిని తిరిగి రావాలని సెల్‌ఫోన్‌లో సంప్రదించారు. కానీ అతను ఫోన్‌ తీయలేదు. వారు అక్కడికి వెళ్లేసరికి శివసుబ్రమణి కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వారు వెంటనే అతన్ని 108 అంబులెన్స్‌లో తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

యువతిని కొట్టి హత్య

అన్నానగర్‌: తిరువొత్తియూరులోని కాలడిపైట్టెలోని మెట్టుతేరు నివాసి కోలారు గోపాల్‌ అలియాస్‌ గోపాల్‌. తిరువొత్తియూరు, సాత్తాంగాడు పోలీస్‌ స్టేషన్లలో అతనిపై వివిధ క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అతని భార్య జ్యోతిక(23). వీరికి 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గోపాల్‌ ఆదివారం రాత్రి తిరువొత్తియూరు పోలీస్‌స్టేషన్‌ కు వచ్చాడు. తన భార్య జ్యోతిక ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉందని చెప్పాడు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంటి గదిలో జ్యోతిక మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. జ్యోతిక ఎలా చనిపోయిందనేది మిస్టరీగా మారింది. ఆమె నుదిటిపై చిన్న గాయం మాత్రమే ఉంది. ఆమెను కొట్టి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో జ్యోతిక భర్త గోపాల్‌ను పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఫలితాల ఆధారంగా తదుపరి దశ దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

గుట్కా తరలిస్తున్న టీవీకే నాయకుడి అరెస్టు

అన్నానగర్‌: కర్ణాటక నుంచి గుట్కా ఉత్పత్తులను అక్రమంగా తీసుకువచ్చి స్థానిక వ్యాపారులకు సరఫరా చేస్తున్న మేచ్చేరి టీవీకే నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లాలోని మేచ్చేరి సందైపైట్టె సమీపంలో ఒక కారు హాన్స్‌, గుట్కా తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను, కిరాణా దుకాణ విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దీని తరువాత మేచేరి పోలీసులు కారు వద్దకు వెళ్లి దానిని చుట్టుముట్టారు. కారును మేచేరి పేరూర్‌ తమిళనాడు విక్టరీ అసోసియేషన్‌ నిర్వాహకుడు సుర్జిత్‌(27) ఉన్నాడు. పోలీసులు అతన్ని జరిపిన విచారణలో కర్ణాటక నుండి హాన్స్‌, గుట్కా కొనుక్కుని వచ్చి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. తదనంతరం సుర్జిత్‌ కారులోని 170 కిలోల హాన్స్‌, 30 కిలోల పొగాకు ప్యాకేజీలు, 27 కిలోలు కూల్‌లీఫ్‌ మొత్తం 227 కిలో పొగాకు, స్మగ్లింగ్‌ కోసం ఉపయోగించిన కారును పోలీసులు జప్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement