
ఈవీ ఛార్జింగ్ కోసం ఎంజీ మోటార్స్ భాగస్వామ్యం
సాక్షి, చైన్నె : ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ డెవలపర్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వెయ్యి రోజుల్లో వెయ్యి చార్జర్లకు మార్గం సుగమం చేసేలా ఈవీ చార్జింగ్ స్టేషన్లను విస్తరించనున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కాన్పిడెంట్ గ్రూఫ్, టెక్నాలజీ భాగస్వామి ఐఓఎన్‌ఏజీఈ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు జేఎస్ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. సోమవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ వాహనచోదకులకు ఈవీ చార్జింగ్‌ను సులభతరం చేసేలా ఇంటి వద్ద అనుకూలమైన, నమ్మకంతో కూడిన చార్జింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. పర్యావరణ అనుకూల రవాణా భవిష్యత్తు వైపుగా చర్యలు వేగవంతం చేశామన్నారు. ఐఓఎన్‌ఏజీఈ టెక్నాలజీస్ సీఈఓ విమల్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు లేని హోమ్‌చార్జింగ్‌ను కల్పించడం లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు.