
ఆరోగ్య శాఖకు భవనాలు
రూ.173.81 కోట్లతో నిర్మించిన ప్రజారోగ్య శాఖకు సంబంధించిన భవనాలను సీఎం స్టాలిన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.20.15 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు శంకు స్థాపన చేశారు. తంజావూరు, సేలం, పాళయంకోట్టై పరిశోధన కేంద్రాలకు రూ.24 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను అందజేశారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలలో కాట్పాడి ప్రభుత్వ ఆసుపత్రి, పళని జిల్లా ప్రధాన కేంద్రం ఆసుపత్రి, తిరుపత్తూరు జిల్లా ప్రధాన కేంద్రం ఆసుపత్రి, కూడలూరు ఆస్పత్రి, శంకరాపురం ప్రభుత్వ ఆసుపత్రి, మేలూరు ప్రభుత్వ ఆసుపత్రులలో రూ.108.50 కోట్లతో అదనపు భవనాలు ఉన్నాయి. అలాగే తెన్కాసి, తిరుపత్తూరు, కళ్లకురిచ్చి, మైలాడుతురై, మధురై, తిరునెల్వేలి, తంజావూరులలో రూ.42 కోట్లతో నిర్మించిన ఆస్పత్రుల భవనాలు, మధురైలో రూ.1.49 కోట్లతో నిర్మించిన ఫుడ్ అనాలిసిస్ కాంప్లెక్స్, రూ.14.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పరిశోధన భవనం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఏవీ వేలు, సీఎస్ మురుగానందం తదితరులు పాల్గొన్నారు.