
ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ
సాక్షి, చైన్నె : ఆరోగ్య సేవలను అపోలో క్లినిక్ విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలతో వేళచ్చేరిలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను డాక్టర్ సంగీతరెడ్డి, సినీ నటి సాక్షి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండె ఆరోగ సంరక్షణ ప్యాకేజీని ప్రకటించారు. కొత్త క్లినికల్ ఆఫరులను విడుదల చేశారు. నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణతో పాటు అందుబాటులోకి ప్రధాన సేవలు ఇక్కడకు తీసుకొచ్చినట్టు ప్రకటించారు. 22 మంది వైద్యు నిపుణుల బృందం ఇక్కడ ప్రత్యేక వైద్య చికిత్సలను అందించనున్నట్టు వైద్యులు పేర్కొన్నారు.