
తండ్రీకొడుకుల కాంబో రెండో చిత్రం
నటుడు నట్టి హీరోగా
నటిస్తున్న నూతన చిత్రం
ప్రారంభోత్సవం
తమిళసినిమా: ఒకే చిత్రంలో తండ్రీ కొడుకులు కలిసి పని చేయడం అరుదే. అలా ప్రముఖ నటుడు కథను సమకూర్చగా, ఈయన వారసుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కన్నన్ గ్రూప్స్, కాంతారా స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాత్కాలికంగా ప్రొడక్షన్ నెంబర్–6 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటుడు నట్టి కథానాయకుడిగా నటిస్తున్నారు. తంబిరామయ్య, శ్రితారావ్, చాందినీ, తమిళరసన్, వీజీ చంద్రశేఖర్, వడివుక్కరసి, ఇళవరసు, జాన్‌విజయ్, ఆడుగళం నరేన్, వీజే.ఆండ్రూస్, సత్యన్, శ్యామ్స్, కింగ్‌కాంగ్, దేవీ మహేశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యంగా నటుడు నట్టి, తంబిరామయ్య కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది కావడం విశేషం. పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణంను, దర్బుగా శివ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఇది సమకాలీన రాజకీయ నేపథ్యంలో సాగే వినోదభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నట్టి కథానాయకుడిగా నటించడానికి అంగీకరించడం సంతోషంతోపాటు, చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించాలన్న బాధ్యత పెరిగిందన్నారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాత కన్నన్ రవి పేర్కొంటూ ఉమాపతి రామయ్య తన తొలి చిత్రం రాజాక్కిళితోనే ప్రతిభను నిరూపించుకున్నారని, ఈయన రెండో చిత్రాన్ని రాజకీయ సైటెరికల్ కథాంశంతో తెరకెక్కించడం సంతోషంగా ఉందని చెప్పారు. అదే విధంగా ఉమాపతి, తంబిరామయ్య కాంబోలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

తండ్రీకొడుకుల కాంబో రెండో చిత్రం