
కోలీవుడ్‌పై భాగ్యశ్రీబోర్సే కన్నుల
తమిళసినిమా: ఏ భారతీయ నటికి అయినా కోలీవుడ్‌లో నటించాలనే ఆశ ఉంటుంది. అలా ఇప్పటికే హిందీ, మరాఠి, పంజాబి, మహారాష్ట్ర, కన్నడం, మలయాళం, తెలుగు తదితర భాషలకు చెందిన భామలు తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. తాజాగా నటి భాగ్యశ్రీ బోర్సే కన్ను కోలీవుడ్‌పై పడింది. ఈ మహారాష్ట్రీయ బ్యూటీ మొదట్లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. అలా తొలుత హిందీలో యారియన్–2 చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ చిత్రంలో నాయకిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, విజయ్ దేవరకొండ సరసన కింగ్‌డమ్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ చిత్ర అనువాదంతో తమిళ ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ చిత్రంలో నటి భాగ్యశ్రీ బోర్సే పాత్ర చాలా పరిమితం కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం కన్నడంలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా కాంత చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి భాగ్యశ్రీ బోర్సే దక్షిణాది సినిమా పరిశ్రమపై మాట్లాడుతూ సినిమాకు భాషా భేదం లేదన్నారు. కాబట్టి తాను తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మంచి అవకాశం వస్తే తప్పకుండా తమిళ చిత్రంలో నటిస్తానని అన్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మంచి కథా చిత్రాలు రూపొందుతున్నాయన్నారు. కథానాయికలకు మంచి గుర్తింపు లభిస్తోందని నటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. మొత్తం మీద తమిళ చిత్రాల్లో నటించడానికి ఈ 26 ఏళ్ల బ్యూటీ వేట మొదలెట్టారన్న మాట.
నటి భాగ్యశ్రీ బోర్సే