
చైన్నెలో జైపూర్ జ్యువెలరీ రోడ్ షో
సాక్షి, చైన్నె: బంగారు వర్తకులు, తయారీ దారులు, జ్యువెలరీస్ ఆభరణాల పరిశ్రమలోని వారందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా జైపూర్ జ్యువెలరీ షో 2025కు ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబరు 19 నుంచి 22వ తేది వరకు నోవాటెల్ జైపూర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ఇందుకు బంగారు వర్తకులు, పరిశ్రమలోని వారిని ఆహ్వానించే విధంగా చైన్నెలో ఆదివారం రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమానికి మద్రాసు జ్యువెలర్స్ అండ్ డైమండ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జయంతి లాల్ చల్లాని, చైన్నె జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ సుల్తాన్ మోహిద్దీన్, కోశాధికారి కమల్ కొఠారి హాజరయ్యారు. రంగు రంగుల రత్నాలు, డైమండ్స్, విలువైన ఆభరణాలు, జైపూర్ వారసత్వ ఆభరణాలు అంటూ బంగారు లోకాన్ని సృష్టించేదిశగా ఈ ప్రదర్శన జరగబోతోందని వివరించారు. తమిళనాడులోని వర్తకులు, జ్యువెలరీ యాజమాన్యాలు, ఈ పరిశ్రమలోని వారంతా తరలి రావాలనిపిలుపున ఇచ్చారు.