
17న తెరపైకి గేమ్ ఆఫ్ లోన్స్
తమిళసినిమా: జేఆర్ జీ ప్రొడక్షన్స్ పతాకంపై జీవానందం నిర్మించిన చిత్రం గేమ్ ఆఫ్ లోన్‌న్స్. ఈ చిత్రం ద్వారా అభిషేక్ వెస్లీ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నటుడు నివాస్ ఆదిత్తన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఇందులో అభినయ్ ప్రతి నాయకుడిగా నటించారు నటి ఎస్తర్, ఆద్విక్ తదితరులతో బాలనటి ఆద్విక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జో కోస్టా సంగీతాన్ని, శబరి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 17వ తేదీన తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ లాక్ డౌన్ సమయంలో ఈ చిత్ర కథ గురించి ఆలోచన వచ్చిందన్నారు తాను ఐటీలో పనిచేస్తున్న వ్యక్తిని కావడంతో ఏఐ టెక్నాలజీలో ఒక వ్యక్తి చిక్కుకుంటే ఏమవుతుంది అనే ఇతి వృత్తంతో రూపొందించిన షార్ట్ ఫిలిం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అవార్డును గెలుచుకుందన్నారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో ఆన్లైన్ గేమింగ్, ఆన్‌లైన్ లోన్ వంటి విషయాల్లో పలువురు బాధింపునకు గురైన పరిస్థుతులను నిత్యం వింటూ వచ్చానన్నారు. తన మిత్రులు కొందరు కూడా ఈ ఆన్‌లైన్ గేమ్‌లో మోసపోయారన్నారు. ఇప్పుడు ఆన్‌లైన్ లోన్ తీసుకోవడం సులభం అయింది కానీ, దాన్ని తిరిగి చెల్లించడం కష్టతరంగా మారింది అన్నారు. దీంతో ఇలాంటి విషయాలపై అవగాహన కలిగించే విధంగా కథను తయారు చేసి తెరకెక్కించిన చిత్రం గేమ్ ఆఫ్ లోనన్స్ అని చెప్పారు. ఆన్‌లైన్‌లో లోన్ తీసుకున్న ఓ వ్యక్తి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రకథ అని చెప్పారు. ఈ చిత్ర కథకు పాటలు కానీ, కామెడీ గానీ అవసరం అవ్వలేదన్నారు. కథ కథనం అంత ఆసక్తిగా సాగుతాయని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను పూర్తిగా బెంగళూరులో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఈనెల 17వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

17న తెరపైకి గేమ్ ఆఫ్ లోన్స్