
ప్రభుత్వ పథకాలపై ఇంటింటి ప్రచారం
తిరుత్తణి: ప్రభుత్వ పథకాలు పట్ల ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం చేపట్టాలని ఎంపీ జగద్రక్షగన్ హితువు పలికారు. వివరాలు.. తిరుత్తణి నియోజకవర్గం స్థాయిలో మండల, నగర, టౌన్ కార్యదర్శుల సమావేశం తిరుత్తణిలో ఆదివారం నిర్వహించారు. డీఎంకే జిల్లా కార్యదర్శి, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అరక్కోణం ఎంపీ జగద్రక్షగన్ పాల్గొని కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రదానంగా డీఎంకే ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని, దీంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. పెండింగ్‌లో వున్న పనులు పూర్తి చేయడంతో పాటూ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు.. ప్రభుత్వ అధికారులతో పాటూ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా గ్రామస్థాయిలో పనిచేయాలన్నారు.