
పూందమల్లి– మప్పేడు మధ్య బస్సు సర్వీసు ప్రారంభం
తిరువళ్లూరు: పూందమల్లి– మప్పేడు మధ్య ఏర్పాటు చేసిన నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి నుంచి సుంగువాసత్రం వరకు బస్సు సర్వీసును కొనసాగిస్తున్నారు. సంబందిత బస్సు సర్వీసును మప్పేడు వరకు కొనసాగించాలని కోరుతూ ప్రజలు ఎమ్మేల్యే వీజీ రాజేంద్రన్‌కు పలుసార్లు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు ఎంటిసి అధికారులు సానుకూలంగా స్పందించి సర్వీసును పొడిగించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కొండంజేరి రమేష్‌తోపాటూ పలువురు అధికారులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.