
విజయంతో కనువిప్పు కలిగించాలి
తిరువళ్లూరు: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపుతో బీజేపీకి కనువిప్పు కలగాలని డీఎంకే సీనియర్ నేత రాజ పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి, తిరువళ్లూరు తదితర రెండు నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటి ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమ్మేల్యే చంద్రన్ అద్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా కేంద్ర మాజీ మంత్రి పార్టీ డిప్యూటీ జనరల్ సెకరెట్రి రాజా హాజరై పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2026లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని, డీఎంకే గెలుపుతో బీజేపీకి కనువిప్పు కలగించాలన్నారు. కార్యక్రమంలో తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, రాష్ట్ర నాయకులు ఆర్‌టీఈ ఆదిశేషన్, జిల్లా అద్యక్షుడు ద్రావిడభక్తన్, పార్టీ నేతలు వీసీఆర్ కుమరన్, అరుణ, జైకృష్ణ, బీకే నాగరాజ్ పాల్గొన్నారు.