క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 5 2025 4:59 AM | Updated on Oct 5 2025 4:59 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

● ఆరోగ్య శాఖ హెచ్చరిక

శేషవాహనంపై వరాహస్వామి చిద్విలాసం

పళ్లిపట్టు: ధరణి వరాహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు శేషవాహన సేవలో కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మండలంలోని ఎగువ పొదటూరులో కళింగ వరాహస్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం స్వామివారు శేషవాహన సేవలో కొలువుదీరారు. స్వామి వారికి కర్పూర నీరాజనం పలికి మేళ తాళాలు, బాణసంచా సంబరాలు నడుమ స్వామిని గ్రామ వీధుల్లో ఊరేగించారు.

ఆస్పత్రిలో చేరిన వైగో

సాక్షి, చైన్నె : ఎండీఎంకే నేత ౖవైగో శనివారం చైన్నెలోని ప్రైవేటు ఆ స్పత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర జ్వరం ఉన్నట్టు వైద్యులు గుర్తించి, అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు.

యువకుడు దారుణ హత్య

తిరువొత్తియూరు: ఓట్టన్‌ చత్రం సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దిండిగల్‌ జిల్లా ఒట్టన్చత్రం సమీపంలోని కొసవపట్టిలోని ధనుష్కోటి కాలనీకి చెందిన సెంథమిల్‌సెల్వన్‌ (25) పలు కేసుల్లో నిందితుడు. ఇతను పళని సమీపంలోని కంజనాయక్కన్‌పట్టికి చెందిన సౌమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 ఏళ్ల ఆడపిల్ల ఉంది. సెంథమిళ్‌సెల్వన్‌ ఇంటికి సమీపంలోనే అతని స్నేహితుడు స్టాలిన్‌ (23) నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ పుట్టినరోజు సందర్భంగా సెంథమిళ్‌ సెల్వన్‌ భార్య సెల్‌ఫోన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన సెంథమిళ్‌ సెల్వన్‌, స్నేహితులతో కలిసి స్టాలిన్‌ ఇంట్లోకి చొరబడి అతనిపై దాడి చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన స్టాలిన్‌ తండ్రి పెరియస్వామిపై కూడా దాడి చేశారు. దాడిలో స్టాలిన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పెరియస్వామి దిండిగల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సెంథమిళ్‌ సెల్వన్‌, అతని బావమరిది మదన్‌న్‌కుమార్‌ (19), స్నేహితులు ప్రకాశ్‌రాజ్‌ (21), బాలమురుగన్‌ (23), గాంధీ (40) అనే ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసి జైలుకు పంపారు.

మండాడి చిత్ర యూనిట్‌కు తప్పిన ఘోర ప్రమాదం

తమిళసినిమా: నటుడు సూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మండాడి.మదిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మత్స్యకారుల బోటుల పోటీల ఇతివృత్తంతో రూపొందుతోంది. ఇందులో నటుడు సూరి మత్స్యకారుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను శుక్రవారం రామనాథపురం, తొండి సముద్రం తీరంలో నిర్వహించారు. నటుడు సూరికి సంబంధించిన సన్నివేశాలను నడి సముద్రంలో చిత్రీకరించారు. అందుకోసం నటుడు సూరి ఓ బోటులో, కెమెరామెన్‌ ఆయన సహాయకులు మరో బోటులోనూ , ఇతర చిత్ర యూనిట్‌ ఇంకో బోటులో సముద్రం మధ్యలోకి వెళ్లి షూటింగ్‌ నిర్వహించారు. అప్పుడు అనూహ్యంగా కెమెరామెన్‌ బృందం ఉన్న బోటు గాలి వేగం కారణంగా సముద్రంలో మునిగి పోయింది. సమీపంలో ఉన్న మత్స్యకారులు వెంటనే అక్కడికి చేరుకుని కెమెరామెన్‌, ఆయన సహాయకులను కాపాడారు. అలా ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయట పడగలిగారు. అయితే కోట్ల ఖరీదైన కెమెరాలు, వస్తుసామగ్రి సముద్రంలో మునిగిపోవడంతో దాన్ని బయటకు తీయలేక పోయారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

డెంగీ కేసులతో అప్రమత్తం

కొరుక్కుపేట: వర్షాల నేపథ్యంలో చైన్నెలో సాధారణ జ్వరాలతో పాటూ విషజ్వరాల వ్యాప్తి పెరుగుతోంది. సాధారణంగా కేరళలో జూన్‌, జూలై నెలల్లో ఈ పరిస్థితి ఉంటుందని, చైన్నెలో అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఇవి ఎక్కువగా వ్యాపిస్తాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం సగటున 60 నుంచి 70 మంది డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 14,000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారని, వారిలో ఏడుగురు మరణించారని తెలిపారు. రాబోయే కాలంలో డెంగ్యూ జ్వరం ఈ సంవత్సరం చివరి నాటికి 20,000 మంది వరకు ఈ వ్యాధి బారిన పడతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, శరీర నొప్పులు, అలసట రెండు రోజులకు మించి ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఇంటి పరసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement