
తిరుచ్చిపై శ్రీవారి కటాక్షం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు శనివారం తిరుచ్చిపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తమిళ పెరటాసి నెల మూడో శనివారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువ జామున సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొలిపి, నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి విశేషాలంకరణ చేసి, తిరుచ్చిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు నారికేళ, కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మంగళహారతులిచ్చి పవళింపు సేవ నిర్వహించారు.