
తిరుచ్చిపై శ్రీహరి విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపుఉత్సవాల్లో భాగంగా శ్రీవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. అనంతరం దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవల చేపట్టారు. ఈ క్రమంలోనే ఉభయదేవేరులతో శ్రీవారిని తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగించారు.
పోటెత్తిన భక్తులు
పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ధ్వజస్తంభం వద్ద పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.