
ఘనంగా పెరటాసి శనివారం
వేలూరు: తమిళ పెరటాసి మాస మూడవ శనివారాన్ని పురస్కరించుకుని స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మూడవ శనివారం వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలూరులోని టీటీడీ దేవస్థాన సమాచార మందిరంలో ఉదయం 5 గంటలకే స్వామి వారికి విశేష పూజలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. అదే విధంగా ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఇదిలా ఉండగా టీటీడీ దేవస్థానంతో నడుస్తున్న వెంకటేశ్వర పాఠశాలలో జై శ్రీరామ్ సేవా సంఘం అధ్యక్షుడు ఇళంగోవన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వీటిని ఎమ్మెల్యే కార్తికేయన్, బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు ప్రారంభించారు. అదేవిధంగా వేలపాడిలోని వరదరాజ పెరుమాల్, అరసంబట్టు పెరుమాల్, బ్రహ్మపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధరస్వామిజీ ఆధ్వర్యంలో శ్రీనివాస పెరుమాల్‌కు పూజలు చేశారు.

ఘనంగా పెరటాసి శనివారం