8 అంతస్తులతో మెట్రో జంక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

8 అంతస్తులతో మెట్రో జంక్షన్‌

Oct 5 2025 4:59 AM | Updated on Oct 5 2025 4:59 AM

8 అంతస్తులతో మెట్రో జంక్షన్‌

8 అంతస్తులతో మెట్రో జంక్షన్‌

షోళింగనల్లూరులో నిర్మాణాలు

సాక్షి, చైన్నె: ఓల్డ్‌ మహాబలిపురం మార్గంలోని షోళింగనల్లూరు వద్ద మెట్రో రైలు జంక్షన్‌ రూపుదిద్దుకోనుంది. బ్రహ్మాండ మాల్‌తో 8 అంతస్తుల భవనంగా ఈ స్టేషన్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో పనులు ముగిసి రైలు సేవలు జరుగుతున్నాయి.మరో మూడు మార్గాలలో పనులు శరవేగంగా జరుగుతున్నది. ఇందులో మాధవరం – సిరుచ్చేరి , మాధవరం – షోళింగనల్లూరు మార్గంలో రైళ్లు షోళింగనల్లూరు వద్ద కలుస్తాయి. ఓల్డ్‌ మహాబలిపురం మార్గంలో షోళింగనల్లూరు ప్రాధాన ప్రాంతంగా ఉంటున్నది. ఇక్కడ ఐటీ కంపెనీలు మరీ ఎక్కువే . ఐటీ హబ్‌గా ఉన్న ఈ పరిసరాలలో మెట్రో యాజమాన్యం బ్రహ్మాండ మాల్‌ తరహాలో మెట్రో స్టేషన్‌ను నిర్మించేందుకు సిద్దమైంది. రెండు మార్గాలు కలిసే ప్రదేశంలో ఈ జంక్షన్‌ రూపుదిద్దుకోనున్నది. ఇక్కడ 8 అంతస్తులతో అన్ని రకాల హంగులతో నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నమూనాను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement