క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 5 2025 4:58 AM | Updated on Oct 5 2025 4:58 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

జల్లికట్టు ఎద్దు దాడిలో యజమాని మృతి స్టాలిన్‌ వైద్య శిబిరానికి స్పందన లారీ ఢీకొని రైతు మృతి వడివుడై అమ్మన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

అన్నానగర్‌: తిరుచ్చి జిల్లా మనప్పారైలోని వైయంపట్టిలోని థామస్‌ నగర్‌లోని సవేరియార్‌ పురం నివాసి ఆంథోనీ ముత్తు (52). ఇతని భార్య సేవత్తియ్యమ్మాళ్‌. అభిప్రాయ భేదాల కారణంగా, సేవత్తియమ్మాళ్‌ తన భర్త నుండి విడిపోయి గత 8 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆంథోనీ ముత్తు గత 7 సంవత్సరాలుగా జల్లికట్టు ఎద్దులను పెంచుతున్నాడు. శుక్రవారం రాత్రి వర్షం పడటంతో ఆంథోనీ ముత్తు అడవిలో కట్టిన ఎద్దును ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. ఆ సమయంలో, ఎద్దు అతనిపై దాడిచేసి తోసేసింది. ఇందులో, అతని మెడ, కుడి కాలుకు తీవ్ర గాయాలై అతను అక్కడికక్కడే మరణించాడు. వైయంపట్టి పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం మనప్పారై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుత్తణి: స్టాలిన్‌ వైద్య శిబిరంలో భారీగా గ్రామీణులు పాల్గొని వైద్య పరీక్షలతో పాటు చికిత్స పొందారు. తిరుత్తణి శివారులోని అగూరులో ఆరగ్యశాఖ ఆధ్వర్యంలో స్టాలిన్‌ వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రియారాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌ పాల్గొని శిబిరం ప్రారంభించి గర్భిణులకు పౌష్టికాహార కిట్‌, ప్రత్యేక ప్రతిభావంతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. శిబిరంలో తిరువళ్లూరు, తిరుత్తణి ప్రభుత్వాసుపత్రుల నుంచి వైద్యుల బృందం పాల్గొని గ్రామీణులకు వైద్య సేవలు నిర్వహించారు. తిరుత్తణి యూనియన్‌ వ్యాప్తంగా దాదాపు 2వేల మంది పాల్గొని వైద్య పరీక్షలు, చికిత్స పొందారు. ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అంబిక, మండల వైద్యధి కారి కలైవాణి, మండల డీఎంకే కార్యదర్శి కృష్ణ న్‌, మాజీ పంచాయతీ అధ్యక్షుడు నరసింహరాజ్‌ సహా అనేకమంది పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: తిరువారూర్‌ జిల్లా మరువత్తూరు తోపు వీధికి చెందిన మురుగయ్యన్‌ (65) రైతు. అదే ప్రాంతంలోని పొలంలో కోత కోసిన వరి ధాన్యం కాపలా కోసం మరువ త్తూరు పాండవయ్యారు ఆనకట్ట సమీపంలో రహదారి పక్కన పోసిన ధాన్యం కుప్ప పక్కన శుక్రవారం రాత్రి పడుకున్నాడు. ఆ సమయంలో పాలు తీసుకొని వస్తున్న మినీ లారీ రహదారి పక్కన నిద్రిస్తున్న మురుగయ్యన్‌ మీదకు అదుపు తప్పి దూసుకువెళ్లింది. దీంతో మురుగయ్యన్‌ ఘటన స్థలంలోనే మృతి చెందా డు. ఈక్రమంలోఅదుపు తప్పిన లారీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని నదిలో బోల్తా పడింది. లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తిరువారూర్‌ తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మురుగయ్యన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తిరువారూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

తిరువొత్తియూరు: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళణిస్వామి 2026లో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరువొత్తియూరు త్యాగరాజ స్వామి ఆలయంలోని వడివుడైయమ్మన్‌, 46 నాయన్మార్ల ఉత్సవ విగ్రహాలు, ఇతర 400 దేవతలకు అభిషేకం చేసి, వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తర చైన్నె ఉత్తర తూర్పు జిల్లా కార్యదర్శి ఆర్‌.ఎస్‌. రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 2026 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపురం ఆర్‌.మనో, డి.జి. వెంకటేష్‌ బాబు, జిల్లా కార్యదర్శులు మాధవరం వి.మూర్తి, నా.బాలగంగ, ఆర్‌.ఎస్‌.రాజేష్‌, టి.నగర్‌ సత్య, విరుగై వి.ఎన్‌.రవి, మాజీ ఎం.ఎల్‌.ఎ. కె.గుప్పన్‌, తదితరులు అభిషేక ఆరాధనల్లో కూర్చున్నారు.

అన్నానగర్‌: మీనంబాక్కం లోని తిరువల్లువర్‌ వీధి నివాసి గోవర్ధన్‌ (19 ) తరామణి లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం, అతను తన కళాశాల స్నేహితులతో రామపురంలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తున్నాడు. పరంగిమలై హైవే మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవర్ధన్‌ తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతనితో వచ్చిన అతని స్నేహితులు వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. తరువాత తదుపరి చికిత్స కోసం రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న గోవర్ధన్‌ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పరంగిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గోవర్దన్‌ మృతదేహాన్ని శవపరీక్ష కోసం క్రోమ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement