
నవంబర్ 7న తెరపైకి అదర్స్
తమిళసినిమా: గ్రాండ్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం అదర్స్. నవ నటుడు ఆదిత్య మాధవన్, నటి గౌరీకిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ముండాసిపట్టి రామదాస్, నండు జగన్, హరీష్ పెరడి, వినోద్‌సాగర్, దర్శకుడు ఆర్.సుర్‌రాజన్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి నవ దర్శకుడు అబిన్ హరిహరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని, అరవింద్‌సింగ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని నవంబర్ 7న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మెడికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇటీవల చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. అదర్స్ చిత్ర కథ, కథనాలు ఆసక్తికరంగా సాగుతాయని చెప్పారు. దీంతో చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిందని అన్నారు.