
వేడుకగా కుమరన్ జయంతి
తిరుత్తణి: జాతీయ జెండాను కాపాడి ప్రాణాలు విడిచిన స్వతంత్య్ర సమర యోధుడు కొడికాత్త కుమరన్ ( జెండా కాపాడిన కుమరన్) 122వ జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. తిరుత్తణిలో స్టార్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంకు ఆ క్లబ్ అధ్యక్షుడు పరందామన్ అధ్యక్షత వహించి కుమరన్ చిత్రపటంకు నివాళులర్పించి స్వతంత్య్ర భారతదేశంకు తిరుప్పూర్ కొడికాత్త కుమరన్ సేవలను కొనియాడారు. ఆంగ్లేయుల దాడిలో సైతం ప్రాణాలు కోల్పోతున్నా చేతిలోని జాతీయ జెండాను కిందకు దించకుండా తుది శ్వాస వరకు చేతిలో జెండాతో పోరాడి ప్రాణాలు విడిచిన కుమరన్ త్యాగ ఫలంను గుర్తు చేసుకున్నారు. జయంతి వేడుకల్లో రోటరీ క్లబ్ నిర్వాహకులు గవాస్కర్, సురేష్, వెంకటేశన్, అయ్యప్పన్, జగన్, శ్రీధర్, మాసిలామణి తదితరులు పాల్గొన్నారు.