
చైన్నెలో వర్షాల అలర్ట్
సాక్షి, చైన్నె: చైన్నెలో ఈశాన్య రుతు పవానాల సీజన్ ఆరంభంలో భారీ వర్షాలు పడే అవకాశాలతో ముందస్తు చర్యలపై కార్పొరేషన్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుంతలు తవ్వకాలకు అనుమతులు రద్దు చేశారు. రోడ్లపై ఎవ్వరైనా గోతులు తవ్విన పక్షంలో కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. నైరుతీ సీజన్ ముగిసింది. ఇక, ఈశాన్య రుతు పవనాల సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఇందుకు శుభ సూచికంగా పశ్చిమ కనుమలలోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశిలో శుక్ర వారం రాత్రి, శనివారం భారీ వర్షాలు పడ్డాయి. ఇక్కడ జలపాతాలోకి కొండ కోనల నుంచి నీటి రాక పెరిగింది. తేనిలోనూ వర్షాలు చిరు జల్లులతో మొదలయ్యాయి. మేఘమలైలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. తేనిసురలి జలపాతంలోకి నీటి ధార పెరిగింది. ఇక వాణియం బాడి, తిరుపత్తూరు ఉపరిసరాలలో అనేకచోట్ల భారీ వర్షం పడింది. వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రిని వర్షపు నీరు చుట్టుముట్టింది. హోసూరులోనూ భారీ వర్షం పడింది. గడిచిన 24 గంటలలో ఇక్కడ 12 సెం.మీ వర్షం పడింది. రామేశ్వరంలోనూ వర్షం కొన్ని గంటల పాటుగా పడింది. ఇక, చైన్నె శివారులలోరాత్రికాసేపు వర్షం దంచి పెట్టింది. చైన్నె నగరంలోనూ అక్కడక్కడ వర్షం పడింది. ఈశాన్య రుతు పవనాల సీజన్ ఆరంభం కాగానేచైన్నెలో భారీ వర్షాలు పడుతాయన్నది గత అనుభవం. ఈ దృష్ట్యా, ముందస్తుచర్యలను కార్పొరేషన్‌యంత్రాంగం విస్తృతంచేసింది. లోతట్టు ప్రాంతాలపైదృష్టి పెట్టారు. అలాగే,నగర రోడ్లపై గుంతులు తవ్వేందుకు అనుమతులు రద్దు చేశారు. ఈ సీజన్ ముగిసే వరకు ఎలాంటి గుంతలు తవ్వేందుకు వీలు లేదని కార్పొరేషన్ యంత్రాంగం ప్రకటించింది. అలాగే ఇళ్లలో ఉన్న పనికి రాని వస్తువుల రూపంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదు రు కాకుండా వాటిని ప్రజల నుంచి సేకరించేందుకు ప్రతి శనివారం ప్రత్యేకడ్రైవ్‌కు సిద్ధమయ్యారు. కాగా చైన్నె సముద్ర తీరంలో శనివారం నుంచి సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడుతుండడం గమనార్హం.