క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 4 2025 1:56 AM | Updated on Oct 4 2025 1:56 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

34 శాతం వార్షిక వృద్ధి

సాక్షి, చైన్నె: సెప్టెంబర్‌ 2024తో పోల్చితే 34 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశామని జేఎండబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్‌లో సాగిన ఎలక్ట్రిక్‌ వా హనాల విక్రయాలను గురించి శుక్రవారం స్థానికంగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో 6,728 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు, విండ్సర్‌ బలమైన పనితీరు కొనసాగుతున్నట్టు వివరించారు. ఎంజీ కామెట్‌, ది స్ట్రీట్‌ స్మార్ట్‌ కార్‌, సీవై 25కి అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసిందన్నారు. లగ్జరీ ఈవీ విభాగంలో రెండో అతి పెద్ద బ్రాండ్‌గా ఉన్న ఎంజీ సెలెక్ట్‌ అవతరించిందని, పండుగ డిమాండ్‌ పెరగడం, జీఎస్టీ తగ్గింపు కారణంగా విక్రయాలు పెరిగాయని ప్రకటించారు.

స్కూటర్ల ఢీ.. ఇద్దరి మృతి

తిరువొత్తియూరు: రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సమీపంలోని చెన్పగపుదూర్‌, మేటూర్‌, ఊర్‌ నాయక్కన్‌ వీధికి చెందిన రాజశేఖర్‌ భార్య సింధు (28) శుక్రవారం ఉదయం స్కూటర్‌లో బజారుకు బయలుదేరారు. అదే ప్రాంతానికి చెందిన శశి తన తల్లి పళనియమ్మాల్‌ (60)తో కలిసి స్కూటర్‌లో బయటకు బయలుదేరారు. అంబేడ్కర్‌నగర్‌ మేటూర్‌ రోడ్డు లోని యువరాజ్‌ గార్డెన్‌ సమీపంలోని మలు పు వద్ద రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సింధు, పళనియమ్మాల్‌ తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందారు.

ముగిసిన డ్రోన్‌ పైలటింగ్‌, నిర్వహణ కోర్సు

కొరుక్కుపేట: చైన్నెలోని ఎంఐటీక్యాంపస్‌ – అన్నావిశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ ఏరోస్పెస్‌ రీసెర్చ్‌ (సీఏఎస్‌ఆర్‌) ఆధ్వర్యంలో జూ నియర్‌ కమిషన్‌ ఆఫీసర్లు, ఇతర ర్యాంకుల కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ రీసెట్‌మెంట్‌ (డిజిఆర్‌) సహకారంతో చేపట్టిన మొదటి బ్యాచ్‌ డ్రోన్‌ పైలటింగ్‌, నిర్వహణ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంఐటీ డీన్‌ డాక్టర్‌ జయశ్రీ , సీఏఎస్‌ఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె సెంథిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ముఖ్యఅతిథి అజయ్‌కుమార్‌ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాడ్జీలు, సర్టిఫికెట్లను బహూకరించారు. ఆపరేషన్‌ హెడ్‌ వింగ్‌ కమాండర్‌ కెఆర్‌ శ్రీకాంత్‌ (రిటైర్డ్‌) తదితరులు పాల్గొన్నారు.

చీరకు నిప్పంటుకుని

వృద్ధురాలి మృతి

అన్నానగర్‌: చీరకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందింది. చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్‌ సమీపం గాంధీనగర్‌కు చెందిన ముత్తమ్మాల్‌ (85). ఈమె శుక్రవారం ఉదయం ఇంటి మూడో అంతస్తులో కట్టెల పొయ్యిలో నీటిని వేడి చేస్తోంది. ఆ సమయంలో చీరకు మంటలు అంటుకున్నాయి. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ముత్తమ్మాల్‌ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసి మరైమలైనగర్‌ పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి కేసులో

నలుగురి అరెస్ట్‌

తిరువొత్తియూరు: గంజాయి కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. చైన్నెలోని కన్నగినగర్‌లోని శ్మశానవాటిక సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు కందగనగర్‌ పోలీసులకు సమాచారం అందింది. సీఐ నటరాజ్‌ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగులను తనిఖీ చేశారు. తనిఖీల్లో 2 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు కణ్ణగినగర్‌కు చెందిన తమిళరసన్‌ (34), ప్రభాకరన్‌ (30), దినేష్‌ (27), మహారాజా (32) అని, వీరు ఆంధ్రా సహా వివిధ ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేసి, కణ్ణగినగరంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

లైంగిక దాడి కేసులో

వ్యక్తి అరెస్టు

అన్నానగర్‌: మధురవోయల్‌ ప్రాంతానికి చెందిన మహిళపై లైంగిక దాడి చేసిన, వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె విరుగమ్‌బాక్కంలోని వెంకటేశ్వర నగర్‌లో నివసిస్తున్న హర్షవర్ధన్‌ (25) ఓ కళాశాలలో బ్యాచిలర్‌ డిగ్రీ చదువుతున్న సమయంలో సహవిద్యార్థినితో స్నే హం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ 2019 నుంచి ప్రేమించుకుంటు న్నారు. ఆ మహిళ తన చదువు పూర్తి చేసి ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. హర్షవర్ధన్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుసార్లు ఆమైపె లైంగిక దాడి చేశాడు. అనంతరం హర్షవర్ధన్‌ తన ప్రియురాలిని కలవకుండా త ప్పించుకుని, ఆమె సెల్‌ఫోన్‌ను డిస్‌కనెక్ట్‌ చేశా డు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు అతడి ని కలిసి మాట్లాడగా ఆమెను చంపేస్తానని బెదిరించి, అనుచిత పదాలు వాడాడు. ఆ యువతి మధురవోయల్‌లోని ఆల్‌ మహిళా పోలీసుస్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ జరిపి శుక్రవారం హర్షవర్ధన్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement