
సాయి మందిరంలో ప్రత్యేక పూజలు
తిరుత్తణి: షిరిడీ సాయిబాబా 107వ మహా సమాధి దినోత్సవం సందర్భంగా సాయి మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. తిరుత్తణి సమీపంలోని కేజీ కండ్రిగలోని దత్తసాయి అవతార దివ్యక్షేత్రంలో షిరిడీ సాయి బాబా ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వేకువజామున బాబాకు అభిషేక పూజలు చేశారు. మధ్యాహ్నం గణపతి హోమం, సహస్రనామం, క్షీరాభిషేకం నిర్వహించారు. తిరుత్తణి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, బాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వేడుకలు నిర్వహించారు.