తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం | - | Sakshi
Sakshi News home page

తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం

Oct 4 2025 1:56 AM | Updated on Oct 4 2025 1:56 AM

తెలుగ

తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం

కొరుక్కుపేట: రాష్ట్ర వ్యాప్తంగా దసరా వేడుకలను కో లాహలంగా జరుపుకున్నారు. అన్నింటా విజయాలు లభించాలని భక్తులు ఆలయాల్లో పూజలు చేసి, దేవతలను దర్శించుకున్నారు. చైన్నెలోని తెలుగు లోగిళ్లులో దసరా పండుగను వైభవంగా జరుపుకున్నా రు. ఆలయాల్లో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.

కన్యకాపరమేశ్వరి ఆలయంలో..

చైన్నె జార్జిటౌన్‌లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం సింహవాహనంపై మహిషాసుర మర్ధిని అలంకారంలో వాసవీ అమ్మవారికి పూజలను చేశారు. రాత్రి అమ్మ వారి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఎస్‌కేపీడీ ఆలయ ట్రస్టీలు కుటుంబ సమేతంగా పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు.

సరస్వతి ఆలయంలో.. చైన్నె పెరియపాళయం సమీపంలోని ఆర్యపాక్కంలో ఉన్న విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగా యి. గురువారం విజయదశమి సందర్శంగా ఆలయంలో అక్షరాభ్యా స మహోత్సవం భక్తిశ్రద్ధలతో చేశా రు. ఆలయ ధర్మకర్త పీవీ కృష్ణారావు సారథ్యంలో వేడుకల్లో వేదపండితులు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.

ఆకట్టుకున్న బొమ్మల కొలువు

తెలుగు కుంటుంబానికి చెందిన తోటా బానూజీ, ధరణిలు ఏర్పాటు చేసిన బొమ్మలకొలువు ఆకట్టుకుంటున్నారు . ఈ వేడుకల్లో తెలుగు వెలుగుసంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్‌ పాల్గొన్నారు. భానూ జీ దంపతులను అభినందిస్తూ సత్కరించారు.

అలరించిన కిడాంబి సంగీత విభావరి

చైన్నె మైలాపూర్‌లోని ఆదికేశవపెరుమాళ్‌ ఆలయంలో నవరాత్రి సందర్భంగా మైలై పూంబావై సభ తరఫున భక్తి సంగీత విభావరి నిర్వహించారు. ఇందులో తెలుగు సంగీత గాయకులు కిడాంబి లక్ష్మీకాంతం పాల్గొని, భక్తిగీతాలు ఆలపించారు. అన్నమాచార్య కీర్తనలు, జయదేవ అష్టపదులు, మరిన్ని తమిళ గీతాలు వినిపించి అందరి మన్నలను అందుకున్నారు. సభ తరపున కిడాంబిని సత్కరించారు.వాయిద్య సహ కారం తబలాపై సాలూరి వెంకటరావు, కీ బోర్డుపై శివకుమార్‌ సహకరించారు.

కన్యకాపరమేశ్వరిలో పార్వేట ఉత్సవంలో ఆలయ ధర్మకర్త, ట్రస్టీలు, సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం

తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం1
1/2

తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం

తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం2
2/2

తెలుగు లోగిళ్లలో దసరా కోలాహలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement