
దేవదాయశాఖ కార్యాలయం ప్రారంభం
తిరువళ్లూరు: పట్టణంలో ఏర్పాటు చేసిన దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. తిరువళ్లూరుకు ప్రత్యేక జాయింట్ కమిషనర్‌ను నియమిస్తూ ఆగస్టు 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తిరువళ్లూరులో నూతన జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని మంత్రి నాజర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు.అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ నూతన జేసీ కార్యాలయం ద్వారా తిరువళ్లూరు, పొన్నేరి మీంజూరు, ఊత్తుకోట తదితర ప్రాంతాల్లోతో సహా పలు ప్రాంతాలకు చెందిన ఆలయాల పర్యవేక్షణ తిరువళ్లూరు నుంచే సాగనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్,కృష్ణస్వామి, చంద్రన్, టీజే గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, జాయింట్ కమిషనర్లు అనిత, రమణి, డిప్యూటి కమిషనర్ శివజ్ఞానం పాల్గొన్నారు.