
కోలాహలం సూర సంహారం
పళ్లిపట్టు: నొచ్చిలి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో ప్రధానమైన సూర సంహారం కోలాహలంగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్‌లోని నొచ్చిలిలో గిరిరాజ కన్యకాపరమేశ్వరి సమేత గంగాధరేశ్వరర్ ఆలయంలో నవరాత్రి వేడుకలు గతనెల 22వ తేదీన ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి మహిషాసురమర్ధని అలంకరణ చేసి ఊరేగింపుగా గ్రామంలోని కృష్ణ భజన మందిరం వద్ద కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. మహిషాసురమర్ధిని అలంకరణలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు చెట్టును సంహారం చేసే ఘట్టం నిర్వహించారు. ఈసందర్భంగా బాణసంచా వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త గిరిరాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చేశారు.
మహిషాసురమర్ధినిగా కన్యకాపరమేశ్వరి, సూర సంహారం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు

కోలాహలం సూర సంహారం