
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
తిరుత్తణి: పట్టణంలోని వనదుర్గాదేవి ఆలయంలో గురువారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. 500 మందికి పైగా భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుత్తణిలోని వనదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు 22న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా 11వ రోజు గురువారం అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కంకణాలు ధరించి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్ని గుండానికి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి, అమ్మవారు పుష్పలంకరణలో అగ్నిగుండం ముందు కొలువుదీరగా, అశేష భక్తజనం నడుమ భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి, మొక్కులు చెల్లించారు.
అగ్నిగుండ ప్రవేశం చేస్తున్న భక్తులు, విశేషాలంకరణలో వనదుర్గాదేవి

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం