
అందరికీ ఐఐటీఎం నినాదం
కొరుక్కుపేట: అందరికీ ఐఐటీఎం అనే నినాదంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు ముందుకెళుతున్నట్టు ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. ఐఐటీ మద్రాసులోని ఐఐటీ మద్రాసు శాస్త్ర మ్యాగజైన్ ద్వారా భారతదేశం అంతటా ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు క్యూరేటెడ్ శిక్షణ కార్యక్రమంతో సన్నద్ధం చేయడానికి జాతీయ ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్ శిక్షణ అండ్ మూల్యాంకనం(నిప్టా)ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని ఐఐటీ మద్రాసు క్యాంపస్‌లో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులమీదుగా నిప్టాను ప్రారంభించారు. కామకోటి మాట్లాడుతూ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ తీసుకుని రావడానికి, వివిధ సంస్థల్లో నియామకాలు తీసుకోవడానికి నిప్టా దోహదపడుతుందని అన్నారు. ఐఐటీఎం శాస్త్ర మ్యాగజైన్ ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ శ్రీకాంత్ వేదాంతం పాల్గొన్నారు.